రాజ్‌కుంద్రా చేసిన పనికి ఒంటరైన శిల్పాశెట్టి.. సపోర్ట్ గా నిలిచిన ఒకే ఒక్కడు...

First Published Jul 31, 2021, 2:19 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా చేసిన పనికి శిల్పాశెట్టి ఒంటరైపోయింది. బాలీవుడ్‌లో ఏ ఒక్కరు ఆమెకి మద్దతుగా నిలవలేదు. ఈ క్రమంలో ఆమెకి ఒకే ఒక్కరు మద్దతుగా నిలిచారు. ఆమెకి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఈ నెల 19న అరెస్ట్ అయ్యారు. ఆయన 14రోజుల పోలీస్‌ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. పలువురు నటీమణులు రాజ్‌కుంద్రా టీమ్‌ ఆగడాలపై బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
undefined
మరోవైపు మీడియాలో కథనాలతో తలెత్తుకోలేకపోతుంది శిల్పాశెట్టి. దీంతో ఆమె ఏకంగా మీడియా సంస్థలపైనే కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేసింది. తమ పరువు తీస్తున్నారని, వారిని అడ్డుకోవాలని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె బాంబేకోర్ట్ ని ఆశ్రయించగా, శుక్రవారం విచారించిన కోర్ట్ మీడియా కథనాలను ఆపలేమని శిల్పాశెట్టి వేసిన పిటిషన్‌ని కొట్టివేసింది. దీంతో శిల్పాశెట్టికి పెద్ద షాక్‌ తగిలినట్టయ్యింది.
undefined
మరోవైపు శిల్పాశెట్టిపై, ఆమె ఫ్యామిలీపై మీడియాలోనే కాదు, బాలీవుడ్‌లోనూ అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. నెగటివ్‌ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో శిల్పాశెట్టి ఒంటరైపోయింది. ఈక్రమంలో శిల్పాశెట్టికి మద్దతుగా ఒక్కరు ముందుకొచ్చారు. ఒకే ఒక్కడు ఆమెకి సపోర్ట్ చేసేందుకు ముందుకు రావడం విశేషం.
undefined
ఆ ఒక్కరు ఎవరో కాదు, బాలీవుడ్‌ నిర్మాత హన్సల్‌ మెహతా. ట్విట్టర్‌ ద్వారా ఆమెకి సపోర్ట్ గా నిలిచారు. `మీరు ఆమెతో నిలబడకపోతే, శిల్పాశెట్టిని ఒంటరిగా వదిలేయండి` అని కోరారు. సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు,ఆమెని అలా వదిలేయండి చట్టం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆమెకి గౌరవాన్ని, గోప్యతని అనుమతించండని పేర్కొన్నారు.
undefined
ప్రజా జీవితంలో ప్రజలు చివరకు తమని తాము రక్షించుకోవడం, న్యాయం జరగకపోతే దోషులుగా ప్రకటించడం దురదృష్టకరమని తెలిపారు హన్సల్‌ మెహతా. ఈ నిశ్శబ్దం ఒక నమునా. మంచి సమయంలో అందరు కలిసి పార్టీలు చేసుకుంటారు. చెడు సమయాల్లో చెవిటి మౌనం ఉంటుంది. ఒంటరితనం ఉంది. అంతిమ తీర్పు ఎలా ఉన్నప్పటికీ ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పారు.
undefined
అదే సమయంలో ఆయన మీడియాపై ఫైర్‌ అయ్యారు. ఇదొక విలనిజం నమునా అని, సినిమా వ్యక్తిపై ఆరోపణలు ఉంటే, గోప్యతపై దాడి చేయడానికి, విస్తృతమైన తీర్పు ఇవ్వడానికి ముందుగా ఉంటారు. క్యారెక్టర్లని చంపేస్తారు. వార్తలను చెత్తగాసిప్‌లతో నింపడానికి హడావుడి జరుగుతుంది. ఇది మౌనంగా ఉన్నందుకు చెల్లించాల్సిన ప్రతిఫలంగా మారుతుందన్నారు. మీడియాని నిలువరించాలనే శిల్పాశెట్టి పిటిషన్‌ని కోర్ట్ కొట్టేసిన నేపథ్యంలో హన్సల్‌ మెహతా ఈ విధంగా స్పందించారు.
undefined
click me!