మోహన్‌బాబు అలా గట్టిగా నెట్టడంతో తాను కిందపడిపోయానని, దీంతో చేతులు రాసుకుపోయినట్టు తెలిపింది. దానికి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మోహన్‌బాబు వచ్చి, ఇది యాక్టింగ్ అంటే అని చెప్పి వెళ్లిపోయారట. ఆ సమయంలో తన పరిస్థితి మరోలా మారిపోయిందని వెల్లడించింది లిరిషా. ఇందులో తనది విచిత్రమైన పాత్ర అని, రకరకాలుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మోహన్‌బాబు తనని ఎంతో బాగా చూసుకున్నారని, బాగా చేసుకోవాలని చెప్పేవారని, యాక్టింగ్ సంబంధించిన సలహాలు కూడా ఇచ్చేవారని వెల్లడించింది `వకీల్‌సాబ్` నటి.