`బేబీ`తో ఒక్కసారిగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య.. ప్రస్తుతం `ఎపిక్` చిత్రంలో ఆనంద్ దేవరకొండతో నటించింది. ఈ మూవీ విశేషాలను, తెలుగు అమ్మాయిలకు వస్తోన్న అవకాశాలపై స్పందించింది.
మనలో టాలెంట్ ఉంటే తెలుగు అమ్మాయిలకు కూడా ఆఫర్లు వస్తాయని చెప్పింది వైష్ణవి చైతన్య. ఆమె హీరోయిన్‌గా నటించిన చిత్రం `ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్`. ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ మూవీకి ఆదిత్య హాసన్ దర్శకుడు. నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. తాజాగా వైష్ణవి చైతన్య మీడియాతో మాట్లాడుతూ, తెలుగు అమ్మాయిలకు ఆఫర్ల గురించి ఓపెన్ అయ్యింది. తెలుగు అమ్మాయిలకు కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. టాలెంట్ ఉండి, పాత్రకి మనం సెట్ అవుతామని భావిస్తే మేకర్స్ ఛాన్స్ ఇస్తున్నారని, తనకు అలానే వస్తున్నాయని వెల్లడించింది. షార్ట్ ఫిల్మ్స్ నుంచి, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా వచ్చిన తాను ఇప్పుడు ఆడియెన్స్ సపోర్ట్ తో ఇక్కడి వరకు వచ్చానని, తెలుగు అమ్మాయిలు పరిశ్రమలో ప్రత్యేకతని చాటుతున్నారు, అందులో తాను కూడా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు వైష్ణవి.
24
ఎపిక్ ఒక స్పెషల్ లవ్ స్టోరీ
ఇక `ఎపిక్` మూవీ గురించి ఆమె చెబుతూ, మనం ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ, ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఎపిక్ లో కూడా ఆ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకి చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా. అమ్మాయి జీవితాన్ని ఒకలా చూస్తుంది. అబ్బాయి ఒకలా చూస్తాడు. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు? వీరిద్దరి ఆలోచనలు ఏంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు. హత్తుకునేలా ఉంటుంది` అని చెప్పింది వైష్ణవి.
34
ప్రతి ఒక్క అమ్మాయిలో కడలి ఉంటుంది
ఆమె ఇంకా చెబుతూ, `ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి. ప్రతి ఒక్కరిలోనూ కడలి పాత్ర ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది. కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. ఎపిక్ ఎంచుకోవడానికి కారణమదే` అని చెప్పింది వైష్ణవి చైతన్య.
`బేబీ`తో `ఎపిక్`ని పోల్చడంపై వైష్ణవి చైతన్య రియాక్ట్ అవుతూ, బేబీ, ఎపిక్ సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి. ఒత్తిడి లేదు కానీ, ఛాలెంజింగ్ గా తీసుకొని ఎపిక్ సినిమా చేశాము. ఈ సినిమాలో మమ్మల్ని చూస్తున్నప్పుడు బేబీ గుర్తుకు రాకపోతే మేము విజయం సాధించినట్టే. ఎపిక్ కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం మాకు మొదటి నుంచి ఉంది. నాగవంశీ గారు సినిమా విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే `అలా వైకుంఠపురములో` మూవీలో చిన్న పాత్రలో నటించాను, ఇప్పుడు అదే బ్యానర్‌లో హీరోయిన్‌గా చేయడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవచ్చు అనే ఆశను నాకు కలిగించింది. నా జీవితంలో ఇలా జరగడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది` అని తెలిపింది వైష్ణవి చైతన్య. నెక్ట్స్ ఇదే బ్యానర్‌లో ఒక సినిమా, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్టు తెలిపింది.