చేయాల్సి వస్తే `బద్రి` రీమేక్‌ చేస్తా.. పవన్‌ కళ్యాణ్‌ సినిమాపై వైష్ణవ్‌ తేజ్‌ కామెంట్‌..

Published : Sep 01, 2022, 07:27 PM ISTUpdated : Sep 02, 2022, 05:50 AM IST

`ఉప్పెన` చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన వైష్ణవ్‌ తేజ్‌ తన మామయ్య పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న ప్రేమని చాటుకున్నారు. తన చిరకాల కోరిక బయటపెట్టాడు. ఇదే ఇప్పుడు హాట్‌ న్యూస్‌.  

PREV
16
చేయాల్సి వస్తే `బద్రి` రీమేక్‌ చేస్తా.. పవన్‌ కళ్యాణ్‌ సినిమాపై వైష్ణవ్‌ తేజ్‌ కామెంట్‌..

రేపు(సెప్టెంబర్‌ 2) పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో తాను నటిస్తున్న `రంగరంగ వైభవంగా` చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉందని చెప్పారు. అయితే ఇది కావాలని ప్లాన్‌ చేసింది కాదని, అనేక వాయిదాల అనంతరం లక్కీగా ఇలా కుదిరిందని చెప్పారు. పవన్‌ మామయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్‌ అవుతున్న తన సినిమా సక్సెస్‌ అయితే అదే తనకు పెద్ద సంతోషాన్నిస్తుందన్నారు. 

26

ఈ సందర్భంగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ నటించిన సినిమాల్లో ఏ సినిమా రీమేక్‌లో నటించాలని ఉందని ప్రశ్నించగా, అవన్నీ గొప్ప చిత్రాలని, క్లాసిక్స్ అని, వాటిని టచ్‌ చేయలేమని, వాళ్లు మాత్రమే న్యాయం చేస్తారని, తను ఆ సాహసం చేయలేనని తెలిపారు. అయితే కచ్చితంగా రీమేక్‌ చేయాల్సి వస్తే తాను పవన్‌ మామయ్య నటించిన `బద్రి` సినిమాని రీమేక్‌ చేస్తానని, అది అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. 

36

`ఉప్పెన` వంటి బ్లాక్‌ బస్టర్‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్‌ తేజ్‌ `కొండపొలం` పరాజయం తర్వాత ఇప్పుడు `రంగరంగా వైభవంగా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గిరీశయ దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం రేపు(శుక్రవారం) విడుదల కానుంది. పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా రిలీజ్‌ కాబోతున్న సినిమా కావడంతో అందరిలోనూ అటెన్షన్‌ నెలకొంది. ఈ సందర్భంగా గురువారం మీడియాలో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

46

`రంగరంగ వైభవంగా` ఇద్దరు ఈగోయిస్టుల మధ్య ప్రేమ కథ అని, ఇందులో ఎవరు తగ్గారు, ఎవరు నెగ్గారనేది సినిమా అని చెప్పారు. తనకు ఏమాత్రం ఈగో లేదని తెలిపారు. ఇందులో కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపిస్తానని, చాలా సరదాగా ఉండే పాత్ర తనదని, అయితే `ఉప్పెన`, `కొండపొలం` వంటి ఇంటెన్స్ పాత్రల తర్వాత ఇలాంటి రోల్‌ చేయడం కాస్త కష్టంగా అనిపించిందని చెప్పారు. కథని, దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేసినట్టు తెలిపారు. 

56

`ఉప్పెన`తో సక్సెస్‌, `కొండపొలం`తో ఫెయిల్యూర్‌ వచ్చినా తానురెండింటికి ఒకేలా రియాక్ట్ అయ్యానని, నాకు రెండూ ఒకేలా అనిపించాయని, తనచుట్టూ ఉన్నవాళ్లు హ్యాపీగా ఉంటే తాను హ్యాపీగా ఉంటానని తెలిపారు. అయితే రెండు సినిమాలతో చాలా నేర్చుకున్నానని చెప్పారు. తాను చేసే సినిమాలకు సంబంధించి తుది నిర్ణయం తనదే అని సాయితేజ్‌ కూడా ఇన్‌వాల్వ్ కాడని తెలిపారు. 
 

66

అన్న సాయిధరమ్‌ తేజ్‌ గురించి చెబుతూ, అన్నయ్య అలా జరిగిన విషయంలో చాలా బాధగా ఉందని చెప్పారు. అది పక్కన పెడితే తాము చాలా ఫ్రెండ్లీగా జోవియెల్‌గా ఉంటామని తెలిపారు. గిల్లుకోవడం, ఆటపట్టించుకోవడం జరుగుతుంటాయని తెలిపారు. మెగా హీరోల మధ్య కూడా అలాంటి రిలేషనే ఉంటుందని, బయట ఎలా ఉన్నా, ఫ్యామిలీ విషయంలో మాత్రం అంతా ఫ్రెండ్లీగానే ఉంటామని, మా మధ్య ఎలాంటి ఈగోలకు ఆస్కారం లేదన్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories