గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తొలిసారి లైగింక వేధింపుల గురించి నోరు విప్పింది. ఇటీవల సింగర్ కార్తీక్ ని నిలదీస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది.