టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాలు చేసినా.. మంచి గుర్తింపు సాధించిన హీరోలు కొద్దిమందే ఉన్నారు. అందులో వడ్డే నవీన్ ఒకరు. కానీ ఆయన చాలా పొగరుగా ఉంటాడని ఇండస్ట్రీలో కొంత మంది వాదన. ఈ విషయంపై స్పందించారు డైరెక్టర్ చంద్ర మహేష్. సంచలన కామెంట్స్ చేశారు.
వడ్డే నవీన్.. టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలు చేసి, మంచి గుర్తింపు సాధించిన హీరో. ఆయన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఏమీ లేవు. సాధారణ విజయాలే అయినా.. ఆ మూవీస్ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించాయి. దాంతో వడ్డే నవీన్ కు ఫ్యామిలీ హీరో అన్న ముద్ర పడిపోయింది. 25 ఏళ్ల కెరీర్ లో దాదాపు 35 సిమాలు మాత్రమే చేశాడు నవీన్. కోరుకున్న ప్రియుడు, పెళ్లి, స్నేహితులు, మనసిచ్చిచూడు, చాలా బాగుంది, మా ఆవీడి మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది లాంటి సినిమాలతో నవీన్ కు హీరోగా మంచి పేరు వచ్చింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించిన హీరో నవిన్ అని చెప్పవచ్చు. ఆతరువాత కాలంలో సినిమాల నుంచి చిన్నగా కనుమరుగయ్యాడు వడ్డే నవీన్.
25
సంపన్నకుటుంబంలో పుట్టిన హీరో..
వడ్డే నవీన్ బై బర్త్ గోల్డెన్ స్పూన్… భారీగా ఆస్తులున్న ఫ్యామిలీలో పుట్టడు ఈహీరో. నవీన్ తండ్రి వడ్డే రమేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. రకరాల వ్యాపారాలు కూడా ఈ ఫ్యామిలీకి ఉన్నాయి. రమేష్ బాబు చిరంజీవితో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, లంకేశ్వరుడు, బొబ్బిలి పులి లాంటి సూపర్ హిట్ సినిమాలను రమేష్ బాబు నిర్మించారు. స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నవీన్. వరుస హిట్లు కొట్టి, సొంత టాలెంట్ తో టాలీవుడ్ లో నిలబడ్డాడు.
35
వడ్డే నవీన్ ప్రవర్తన ఎలా ఉంటుంది?
సహజంగా సంపన్న కుటుంబం, ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు కావడంతో..నవీన్ చాలా పొగరు చూపిస్తారని, ఎవరితో సరిగ్గా మాట్లాడరని, ఎవరినీ లెక్క చేయకుండా గర్వం చూపిస్తారని ఫిల్మ్ ఇండస్ట్రీలో నవీన్ పై అప్పట్లో రకరాల వార్తలు వైరల్ అయ్యాయి. అలా ఉండటం మూలంగానే నవీన్ కు అవకాశాలు తగ్గిపోయాయి అన్నవారు కూడా లేకపోలేదు. అయితే ఈ విషయంలో నిజం ఎంత? నవీన్ నిజంగానే అలా ఉండేవారా? అనే విషయాలను దర్శకుడు చంద్ర మహేష్ వెల్లడించారు. నవీన్ తో చెప్పాలని ఉంది సినిమాను డైరెక్ట్ చేశారు చంద్ర మహేష్.. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
చంద్రమహేష్ మాట్లాడుతూ..'' ఇండస్ట్రీలో వడ్డే నవీన్ అంటే ఓ పేరు ఉండేది. కొంత మంది అయితే ఆయనకు పొగరు ఉంది, ఎవరితో సరిగ్గా మాట్లాడరు, ఎవరిని లెక్క చేయరు అని అన్నారు. అయితే నేను ప్రొడ్యూసర్లతో కలిసి కథ చెప్పడానికి వెళ్తే.. అంతా జాగ్రత్తగా విన్నారు. చాలా క్యాజువల్ గా మాట్లాడారు. అంతా అయిపోయిన తరువాత.. చివరిగా నన్ను..మీరు రేపు రండి డైరెక్టర్ గారు మనం మాట్లాడుకుందాం.. అని చెప్పారు. ఇక ఆయన చెప్పిన టైమ్ కు నేను మరుసటి రోజు వెళ్లాను. అప్పుడు ఆయన చాలా మర్యాదగా.. కూర్చోబెట్టి.. సర్ సర్ అనుకుంటూ.. క్లోజ్ గా మాట్లాడారు. అందరు చెప్పినట్టు ఆయన ఏమాత్రం పొగరు చూపించలేదు. బయట చాలామంది అంటున్న విషాయన్ని నేను ఆయనతో చెప్పాను. కానీ ఆయన చాలా క్యాజువల్ గా నవ్వి.. అవునండీ నా దగ్గరకు కూడా ఈ విషయం వచ్చింది. అవన్నీ కామన్ వదిలేయండి అన్నారు. నవీన్ అందరిలా కాదు.. చాలామంచి వారు. అందరిని గౌరవించేవారు. కానీ ఇండస్ట్రీలో ఎంత మంచిగా ఉన్నా.. రూమర్స్ మాత్రం కామన్'' అని అన్నారు చంద్రమహేష్.
55
వడ్డే నవీన్ రీ ఎంట్రీ ..
నవీన్ హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా రాణించారు. తను హీరోగా నటించిన రెండు మూడు సినిమాలను తానే నిర్మించుకున్నాడు. ఇక చాలా కాలం తరువాత ఆయన మళ్లీ ఇండస్ట్రీలో కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ "వడ్డే క్రియేషన్స్" బ్యానర్‌పై 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే సినిమాతో హీరోగా, నిర్మాతగా తిరిగి వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈసినిమాపై అప్ డేట్స్ తెలియాల్సి ఉంది.