V R Raja: యూట్యూబర్ వీఆర్ రాజా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? సబ్ స్క్రైబర్స్, ఫాలోయింగ్ తెలిస్తే షాక్ అవుతారు

Published : Jul 16, 2026, 08:39 AM IST

V R Raja: తెలుగులో ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు. కానీ కొంత మందికి మాత్రం స్టార్ హీరోలకు సమానంగా ఫాలోయింగ్ ఉంటుంది. అటువంటి వారిలో వీఆర్ రాజా ఒకరు. రెండు ఛానెల్స్ తో భారీ గా అభిమానులున్న రాజా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PREV
15
కంటెంట్ క్రియేటర్లలో స్టార్..

కంటెంట్ క్రియేటర్ గా వి.ఆర్. రాజా తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో చాలా స్పెషల్ అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో విజ్ఞానాన్ని, ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న తెలుగు కంటెంట్ క్రియేటర్లలో వి ఆర్ రాజా (V R Raja) టాప్ లో ఉన్నాడు. సంక్లిష్టమైన అంతర్జాతీయ రాజకీయాలు (Geopolitics), రహస్యాలు (Mysteries), కరెంట్ అఫైర్స్, సైన్స్ తో పాటు సమాజంలో జరిగే సంచలన సంఘటనలను అత్యంత విశ్లేషణాత్మకంగా వివరించడం ఆయన ప్రత్యేకత.

25
వీఆర్ రాజా ఛానెల్స్, సబ్ స్క్రైబర్స్:

V R రాజా యూట్యూబ్‌లో ప్రధానంగా రెండు ఛానెల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. V R RAJA (@iamvrraja) ఇది ఆయన ప్రధాన ఛానెల్. ప్రస్తుతం లెక్కల ప్రకారం ఈ ఛానెల్‌కు సుమారు 1.85 మిలియన్లు అంటే 18.5 లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. V R Facts In Telugu ఇది ఆయనకు సంబంధించిన మరో ప్రజాదరణ పొందిన ఛానెల్. దీనికి కూడా సుమారు 1.76 మిలియన్ల అంటే 17.6 లక్షల సబ్‌స్క్రైబర్స్ సపోర్ట్ ఉంది. రెండు ఛానెల్స్ కలుపుకుంటే వీఆర్ రాజాకు యూట్యూబ్‌లో 3.5 మిలియన్లకు పైగా భారీ సబ్‌స్క్రైబర్ బేస్ ఉంది.

35
యూట్యూబ్ ద్వారా V R Raja నెల సంపాదన ఎంత?

యూట్యూబర్స్ ఆదాయం అనేది ప్రతి నెలా వచ్చే వ్యూస్, యాడ్ రేట్స్ (CPM/RPM), బ్రాండ్ ప్రమోషన్స్ తో పాటు స్పాన్సర్‌షిప్‌లపై ఆధారపడి మారుతూ ఉంటుంది. థర్డ్-పార్టీ అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్స్ అంచనాల ప్రకారం, ఆయన ప్రధాన ఛానెల్స్ ద్వారా నెలకు సుమారు 10 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు సమాచారం. వి.ఆర్. రాజా యూట్యూబ్ ప్రకటనలు, బ్రాండ్ కొల్లాబరేషన్స్ ద్వారా ఇంత మొత్తంలో సంపాదిస్తున్నట్లు అంచనా. ఇంది ఇంకా ఎక్కువే ఉండవచ్చు. అధికారికంగా మాత్రం ఆయన తన సంపాదన ఎప్పుడు వెల్లడించలేదు.

45
సామాన్యులకు సైతం అర్ధం అయ్యేలా..

విలక్షణమైన కంటెంట్ శైలి వి.ఆర్. రాజా ఛానెల్స్ విజయం సాధించడానికి ప్రధాన కారణం. ఆయన ఎంచుకునే కంటెంట్ సాధారణ ఫ్యాక్ట్స్ ఛానెల్స్ లాగా కాకుండా, ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి, సాక్ష్యాలతో (Data-driven) కూడిన వీడియోలను ఆయన అందిస్తారు. భూరాజకీయాలు & విదేశీ విధానాలు (Geopolitics): భారత్-చైనా సరిహద్దు వివాదాలు, పాకిస్తాన్ కుతంత్రాలు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, చైనా మాస్టర్ ప్లాన్స్ వంటి అంతర్జాతీయ అంశాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరిస్తారు. అంతే కాదు ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాలు, చారిత్రక మిస్టరీలు, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్‌వర్క్ ఉదాహరణకు లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్ వంటివాటి గురించిన చీకటి నిజాలను వెలికితీస్తాడు రాజా.

55
సోషల్ మీడియా లో రాజా ఫాలోయింగ్..

దేశంలో జరుగుతున్న సమకాలీన ఉదంతాలు, విద్యా వ్యవస్థలోని లోపాలు (ది డార్క్ రియాలిటీ ఆఫ్ బి.టెక్ వంటివి) పై వీఆర్ రాజా ఎనాలసీస్ అద్భుతంగా ఉంటుంది. రాజా కి కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా సైట్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన అందించే సమాచారం నమ్మదగినదిగా ఉండటంతో యువత, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఆయన వీడియోలను క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటారు. 

తెలుగు కమ్యూనిటీలో అత్యంత నమ్మకమైన ఇన్ఫర్మేటివ్ ఇన్ఫ్లుయెన్సర్‌గా V R రాజా గుర్తింపు తెచ్చుకున్నారు. కంటెంట్ క్వాలిటీని నమ్ముకుంటే యూట్యూబ్‌లో ఏ స్థాయికి ఎదగవచ్చో వి.ఆర్. రాజా నిరూపించారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితం కాకుండా, తెలుగు ప్రేక్షకులకు గ్లోబల్ నాలెడ్జ్‌ను అందిస్తూ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ విభాగంలో ఆయన దూసుకుపోతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories