ఫోన్ ఇచ్చేయండి మంచి గిఫ్ట్ ఇస్తాను.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఊర్వశీ రౌతేలా

Published : Oct 18, 2023, 09:27 AM IST

బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాల బంపర్ ఆఫర్ ప్రకటించింది. తనకు ఎంతో ఇష్టమైన ఫోన్ పొగొట్టుకున్న బ్యూటీ.. ఆఫోన్ కోసం తంటాలు పడుతోంది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?   

PREV
15
ఫోన్ ఇచ్చేయండి మంచి గిఫ్ట్ ఇస్తాను.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఊర్వశీ రౌతేలా
Urvashi Rautela

రీసెంట్ గా ఫోన్ పోగొట్టుకుని తెగ బాధపడిపోతోంది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. పోయిన తన  ఫోన్‌ కనుగొనడంలో సాయం చేసిన వారికి రివార్డ్‌  కూడా  ప్రకటించింది ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టింది. అందులో తన ఫోన్‌ చివరి సారిగా అహ్మదాబాద్‌లోని ఓ మాల్‌ వద్ద ఉన్నట్లు తెలిపింది. ఫోన్‌ను తిరిగి తెచ్చిస్తే రివార్డు ఇస్తానంటూ ప్రకటించింది. అయితే ఆ రివార్డు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు.

25
Urvashi Rautela-Gold I-Phone

తాను ఎంతో ఇష్టంతో కొనుకున్న ఈ ఫోన్  అలాంటి ఇలాంటిది కాదు..  24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన ఫోన్ కావడంతో ఊర్వశీ తెగ బాధపడుతోంది. అంతే కాదు ఆ ఫోన్ లో తనకు కావల్సి.. తనకు అవసరమైన సమాచారం చాలా ఉంది అంటోంది.  అది ఎవరికైనా దొరికితే ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా  వేడుకున్నారు ఊర్వశీ. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారిక  అకౌట్స్ ను కూడా   ట్యాగ్ చేశారు. ఆమె పోస్టును చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 

35

ఇక అసలు విషయానికి వస్తే.. ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మొన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ  మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. సెలబ్రిటీలు కూడా ఆరాటపడ్డారు. ఇండియా.. పాక్ మ్యాచ్ కావడంతో చాలా మందిలా.. బాలీవుడ్ సెలబ్రిటీ ఊర్వశీ కూడా.. హడావిడిలో  ఒళు తెలియకుండా మ్యాచ్ లో మునిగిపోయింది. మ్యాచ్ గెలిచిన ఆనందం కాసేపైన లేకుండానే.. నటి ఊర్వశీ రౌతేలా కు చేదు అనుభవం ఎదురయ్యింది. 
 

45
Urvashi Rautela loses gold iPhone during Ind vs Pak match

తన అందంతో  అభిమానులకు ఆనందం పంచినా.. నటి ఊర్వశి రౌతేలాకు ఓ క్రికెట్ మ్యాచ్ మాత్రం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. మ్యాచ్ లో ఇండియా గెలవడంతో.. ఆట అంతా చూసి ఎంజాయ్ చేసిన ఊర్వశి.. అందులో మునిగిపోయి.. తను ఎంతో ఇష్టంగా కొనుకున్న ఫోన్ పోగోట్టుకుంది.  అత్యంత ఖరీదైన తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నట్టు.. విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. అది 24 క్యారెట్ల బంగారు తాపడం చేయించిన ఫోన్ కావడంతో. ఆమె బాధ వర్ణనాతీతం అయ్యింది. 

55

ఈమధ్యే  సౌత్ లో బిజీ అవుతోంది ఊర్వశీ. బాలీవుడ్ కంటే కూడా ఆమెకు సౌత్ సినిమాల నుంచే డిమాండ్ ఎక్కువైపోయింది.  సౌత్ సినిమాల్లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తోంది బ్యూటీ. ఒక్క సాంగ్ కు కోటి .. రెండు కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందట ఊర్వశీ. 

Read more Photos on
click me!

Recommended Stories