శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రమే తమన్నా కెరీర్ ని మలుపు తిప్పింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నా యువతకి క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత తమన్నా తాను నటించిన చిత్రాల్లో గ్లామర్ డోస్ పెంచి మరింతగా యువతని ఆకట్టుకుంది. 100 పర్సెంట్ లవ్, రచ్చ లాంటి చిత్రాలు తమన్నా ఇమేజ్ ని తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తమన్నాకి అవకాశాలు వచ్చాయి. రాంచరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలతో రొమాన్స్ పండించింది. కొన్నేళ్లు తమన్నా తన క్రేజ్ తో టాలీవుడ్ ని ఊపేసింది అని చెప్పొచ్చు.