పాన్ ఇండియా: బడ్జెట్ తో షాకిస్తున్న కొత్త సినిమాలు

First Published Aug 21, 2019, 2:47 PM IST

కాలం మారుతున్న కొద్దీ సినీ వరల్డ్ లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కంటెంట్ పరంగానే కాకుండా బడ్జెట్ లోను అలాగే బాషా బేధం లేకుండా సినిమాలు ఆదరించడం వంటి ఎన్నో విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ఇక సౌత్ నార్త్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా రిలీజ్ కానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం..  

సైరా - మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మొదటి ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కింది. 250కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.
undefined
సాహో: బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ 300కోట్ల సినిమా ఆగస్ట్ 30న విడుదల కాబోతోంది.
undefined
దబాంగ్ 3: సల్మాన్ ఖాన్ మొదటిసారి తన సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. 100కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2019 డిసెంబర్ 20న రానుంది.
undefined
ఇండియన్ 2: శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ 200కోట్ల ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
undefined
KGF 2: మొదటి పార్ట్ హిట్టవ్వడంతో చాఫ్టర్ 2 అంతకంటే హై రేంజ్ లో 200కోట్ల బారి బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ ఏడాది చివరలో గాని లేక నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.
undefined
మహావీర్ కర్ణ: విక్రమ్ నటిస్తున్న ఈ హిస్టారికల్ సినిమాను దర్శకుడు విమల్ 300కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాది చివరలో వచ్చే అవకాశం ఉంది.
undefined
బ్రహ్మాస్త్రా: కరణ్ జోహార్ అలాగే మరికొంత మంది బాలీవుడ్ నిర్మాతలు కలిసి 150కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర లో అమితాబ్ - రన్ బీర్ తో పాటు అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ బిగ్ సినిమా రిలీజ్ కానుంది.
undefined
RRR: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ తో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ కాబోతోంది. 350కోట్ల నుంచి 400కోట్ల వరకు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు.
undefined
వార్: హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ ఒకేతెరపై నటిస్తున్న ఈ యాక్షన్ మూవీ అన్ని భాషల్లో అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం 150కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.
undefined
హిరణ్యకశిప: రానా ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ బడ్జెట్ ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. 200కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు టాక్. ఈ సినిమా రావడానికి రెండేళ్ల సమయం పడుతుంది.
undefined
click me!