Upasana: రామ్‌ చరణ్‌ని అలా చూస్తే ఉపాసన తట్టుకోలేదు.. ఆమెని ఏడిపించే విషయం ఏంటంటే?

Published : Oct 22, 2026, 07:39 AM IST

రామ్‌ చరణ్‌ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన తన భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెరపై అలా చరణ్‌ని చూస్తే తట్టుకోలేదట. తమకి సంబంధించిన పలు రహస్యాలను ఆమె వెల్లడించింది.

PREV
14
మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తోన్న ఉపాసన

మెగా కోడలు ఉపాసన మాతృత్వాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె ఆ మధ్య కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసింది. అంతకు ముందు క్లీంకార జన్మించింది. అయితే ఉపాసన ఓ వైపు తన పిల్లల్ని చూసుకుంటూనే మరోవైపు తన వ్యాపారాలు చూసుకుంటోంది. అపోలో హాస్పిటల్‌కి సంబంధించిన వ్యవహారాలు తనే చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఓ వైపు కోడలిగా, మరోవైపు భార్యగా, అమ్మగా, హాస్పిటల్‌ హెడ్‌గా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ మెప్పిస్తుంది ఉపాసన. మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తోంది.

24
రామ్‌చరణ్‌, ఉపాసన పెళ్లి వెనుక రహస్య ప్రేమ కథ

ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అనే విషయం తెలిసిందే. కానీ అంతకు ముందే ప్రేమించుకున్నారు. రహస్యంగా వీరి లవ్‌ స్టోరీ సాగింది. అయితే ఆ విషయాలకు సంబంధించిన రహస్యాలను మెయింటేన్‌ చేస్తున్నారు. ఎప్పుడూ పూర్తిగా ఓపెన్‌ కాలేదు. ఈ క్రమంలో అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడింది. రామ్‌ చరణ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలా విషయాల్లో తమ అభిరుచులు కలుస్తాయని తెలిపింది. తమ మధ్య ఉండే తీపి జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటామని చెప్పింది.

34
రామ్‌ చరణ్‌ నన్ను రాణిలా చూసుకుంటారు-ఉపాసన

తాము మొదటిసారి కలిసిన ప్రాంతం గురించి చెప్పలేనని, కానీ అదొక ఫన్నీ స్టోరీ అని చెప్పింది. ఆ విషయం తెలిస్తే మాత్రం ఫ్యామిలీ అంతా షాక్‌ అవుతారని వెల్లడించింది. ఈ క్రమంలో రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయన వ్యక్తిత్వం గొప్పదని, చరణ్‌ని పెళ్లి చేసుకోవడం తన జీవితంలో ఎంతో సంతోషకరమైన విషయమని, ఆయన తనని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారని, రాణిలా చూసుకుంటారని తెలిపింది.

44
రామ్‌ చరణ్‌ని అలా చూస్తే తట్టుకోలేను - ఉపాసన

ఈ క్రమంలో ఒక ఆసక్తికర విషయాన్నిపంచుకుంది ఉపాసన. చరణ్‌ నటించిన అన్ని సినిమాలు చూస్తుందట. అన్నీ ఇష్టమే అని చెప్పింది. తెరపై చరణ్‌ని చూసినప్పుడు గర్వంగా ఫీలవుతుందట. ఆయన్ని ఎవరైనా పొగుడుతుంటే హ్యాపీ అవుతుందట. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయట. అదే సమయంలో తెరపై గాయాలతో, రక్తంతో కనిపిస్తే మాత్రం తట్టుకోలేదట. సినిమా అని తెలిసినా భరించలేనని, తీవ్ర ఆవేదనకు గురవుతానని చెప్పింది ఉపాసన. దాదాపు ఏడేళ్లక్రితం ఈనాడుకిచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన ఈ విషయాలను పంచుకోవడం విశేషం. ఇటీవల `పెద్ది`తో విజయాన్ని అందుకున్న రామ్‌ చరణ్‌.. ప్రస్తుతం సుకుమార్‌తో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందట.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories