Prabhas Favorite Actor: ప్రభాస్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? చిరు, కృష్ణంరాజు, ఎన్టీఆర్‌ మాత్రం కాదు

Published : Oct 22, 2026, 06:30 AM IST

ప్రభాస్‌ కృష్ణంరాజు వారసుడిగాసినిమాల్లోకి వచ్చిన విషయంతెలిసిందే. మరి తనకు ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? కృష్ణంరాజు, ఎన్టీఆర్‌, చిరంజీవి మాత్రం కాదు. మరి ఎవరనేది తెలిస్తే ఆశ్చర్యపోతారు.

PREV
13
ప్రభాస్‌ చేతిలో మూడు భారీ చిత్రాలు.. వేల కోట్ల వ్యాపారం

రెబల్‌ స్టార్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన గ్లోబల్‌ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఆయన చేతిలో ఇప్పుడు రెండు భారీ చిత్రాలున్నాయి. మరో సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. వరుసగా ఆయన అలరించేందుకు వస్తున్నారు. వచ్చే ఏడాది ఆయన్నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. చివరగా ఆయన `ది రాజా సాబ్‌` మూవీతో అలరించిన విషయం తెలిసిందే. కానీ ఇది బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. కానీ ఆ లోటుని భర్తీ చేసేలా ఇప్పటి సినిమాలుంటాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌పై వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఒక్కో మూవీ వెయ్యి నుంచి రెండు వేల కోట్లు కలెక్ట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారట. సినిమాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు వచ్చే ఏడాది రాబోతున్నాయి.

23
ప్రభాస్‌కి ఇష్టమైన హీరోయిన్లు వీరే

ఇదిలా ఉంటే రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సినిమాల్లోకి వచ్చాడు ప్రభాస్‌. తనూ కూడా యంగ్‌ రెబల్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు. `బాహుబలి`తో ఆయన రేంజ్‌ మారిపోయింది. అయితే ప్రభాస్‌కి ఇష్టమైన నటులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హీరోయిన్ల విషయంలో అలనాటి తార, మహానటి సావిత్రి పేరు చెబుతుంటారు. ఈ తరం హీరోయిన్లలో అనుష్క, సాయిపల్లవి, సమంత, త్రిష పేర్లు చెప్పారు. మరి హీరోల్లో.. అంటే నటుల్లో ఎవరు ఇష్టం అనేది కూడా ప్రభాస్‌ వెల్లడించారు.

33
ప్రభాస్‌ ఫేవరేట్‌ యాక్టర్‌ ఎవరంటే?

తనకు అలనాటి నటుల్లో మాత్రం ఎస్వీఆర్‌(ఎస్వీ రంగారావు) అంటే ఇష్టమట. ఆయన నటన తనకు బాగా నచ్చుతుందని, ఆయన గొప్పనటుడు అని వెల్లడించారు. ఆయన్ని తెరపై చూస్తుంటే వాహ్‌ ఫీలింగ్‌ కలుగుతుందట. సితారకి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు ప్రభాస్‌. తన పెదనాన్న కృష్ణంరాజు, ఎన్టీఆర్‌, చిరంజీవి పేర్లు కాకుండా ఆయన ఎస్వీఆర్‌ తన ఫేవరేట్‌ యాక్టర్‌ అని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories