₹100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన మలయాళ చిత్రం 'మార్కో' ఓటీటీ హక్కులను సోనీ లివ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ చిత్రం ఎక్స్టెండెడ్ వెర్షన్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మలయాళ సినిమాల (Malayalam movie) స్థాయిని పెంచుతూ వచ్చిన ‘మార్కో’ (Marco) భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ₹100 కోట్లు గ్రాస్ కలెక్షన్ దాటి, మలయాళ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. తెలుగులో కూడా ‘మార్కో’ ప్రేక్షకులను మెప్పించి మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది. అనూహ్యంగా. హిందీ మార్కెట్‌లో ఈ సినిమా సంచలనంగా నిలిచింది. మలయాళం నుంచి హిందీలోకి డబ్ అయిన సినిమాల్లో మొదటిసారిగా డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్ సాధించిన చిత్రం కావటం చెప్పుకోదగ్గ విషయం.
23
Unni Mukundan starrer Marco film update out
ఈ క్రమంలో ‘మార్కో’ ఓటీటీ (Marco OTT) హక్కుల కోసం పెద్ద డిమాండ్ క్రియేట్ అయ్యింది. సోనీ లివ్ (Sony LIV) ఈ సినిమాను అన్ని భాషల హక్కులతో భారీ మొత్తంలో కొనుగోలు చేసింది. మలయాళ పరిశ్రమలో అన్ని భాషలకు సంబంధించి ఇది అత్యంత భారీ రేటుకి అమ్ముడైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రత్యేకంగా, ఓటీటీ లో ప్రేక్షకులకు మరింత అద్బుతమైన ఎక్సపీరియన్స్ అందించడానికి ఈ సినిమాను ఎక్స్టెండెడ్ వెర్షన్‌తో స్ట్రీమ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
33
సినిమా థియేటర్లలో చూసిన వారు ఇప్పుడు ఓటీటీ లో కూడా ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కన్నడ వెర్షన్ రిలీజ్ ఇంకా కాకపోవటంతో ఓటిటి స్ట్రీమింగ్ లేటు అవుతుందని తెలుస్తోంది. ఏదైమైనా పిభ్రవరి మూడవ వారంలో ఈ చిత్రం ఓటిటిలో వచ్చే అవకాసం ఉందంటోంది మళయాళి పరిశ్రమ. ఓటిటి రిలీజ్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు.