పాలిటిక్స్ కారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్న చిత్రం మాత్రం ఓజి అనే చెప్పాలి. డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డాన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.