Ugram Review: `ఉగ్రం` ట్విట్టర్‌ టాక్‌.. అల్లరి నరేష్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడా?

Published : May 05, 2023, 07:16 AM IST

అల్లరి నరేష్‌ మరోసారి `నాంది` డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడలతో కలిసి ఇప్పుడు `ఉగ్రం` చేశాడు. ఇది నేడు(మే5న)శుక్రవారం విడుదలవుతుంది. ముందుగా ఇది యూఎస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించబడింది. మరి అక్కడి టాక్‌ ఎలా ఉంది, ఆడియెన్స్ ఏం చెబుతున్నారనేది ట్విట్టర్‌ టాక్‌లో తెలుసుకుందాం. 

PREV
15
Ugram Review: `ఉగ్రం` ట్విట్టర్‌ టాక్‌.. అల్లరి నరేష్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడా?

అల్లరి నరేష్‌ అంటేకామెడీకి కేరాఫ్‌. కామెడీ చిత్రాలతో హీరోగా ఎదిగి నవ్వులు పూయించిన ఆయనకి ఇప్పుడు ఆ కామెడీనే వర్కౌట్‌ కావడం లేదు. అందుకే ఆయన తనని తాను మార్చుకోవాల్సి వచ్చింది. సీరియస్‌ లుక్‌లోకి టర్న్ తీసుకుని చేసిన `నాంది` భారీ విజయాన్ని సాధించింది. అల్లరి నరేష్‌ని కొత్తగా ఆవిష్కరించింది. విజయ్‌ కనకమేడల ఆయనకు మంచి విజయాన్ని అందించారు. అల్లరి నరేష్‌కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత చేసిన `మారెడుమిల్లి నియోజకవర్గం` పెద్దగా ఆడలేదు. దీంతో మరోసారి `నాంది` డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడలతో కలిసి ఇప్పుడు `ఉగ్రం` చేశాడు. ఇది నేడు(మే5న)శుక్రవారం విడుదలవుతుంది. ముందుగా ఇది యూఎస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించబడింది. మరి అక్కడి టాక్‌ ఎలా ఉంది, ఆడియెన్స్ ఏం చెబుతున్నారనేది ట్విట్టర్‌ టాక్‌లో తెలుసుకుందాం. 

25

మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అమ్మాయిల కిడ్నాప్‌ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఇందులో అల్లరి నరేష్‌.. శివకుమార్‌ అనే సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారు. సినిమా కథగా బాగుందట. మిస్టరీ థ్రిల్లర్‌ని ఆసక్తికరంగా మలిచాడట దర్శకుడు విజయ్‌ కనకమేడల. అయితే దాన్ని తెరపై ఆవిష్కరించడంలో ఆయన తడబడినట్టు తెలుస్తుంది. సినిమాలో చాలా వరకు మంచి సన్నివేశాలున్నాయట, కానీ అనవసరమైన కమర్షియల్‌ ఎలిమెంట్లు జోడించడంతో కథ ట్రాక్‌ తప్పినట్టుగా ఉందని అంటున్నారు. రైటింగ్‌ చాలా డల్‌గా ఉందని, దీంతో సినిమాని బోరింగ్‌గా మార్చాయని అంటున్నారు. 

35

ఫస్టాఫ్‌ లో ప్రారంభంలో కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైందట. కానీ రొమాంటిక్‌ ట్రాక్‌ చాలా డల్‌గా ఉందని, ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని అంటున్నారు. దీనికితోడు బ్యాక్ టూ బ్యాక్‌ యాక్షన్‌ సీన్లు వర్కౌట్‌ కాలేదని, అవి కన్విన్సింగ్‌గా లేవని అంటున్నారు. సెకండాఫ్‌లో అసలు కథ రివీల్‌ అవుతుందట. శృతి మించిన యాక్షన్‌ సీన్లు ఉన్నాయట, కానీ ఎమోషనల్‌ కనెక్ట్ అయ్యేలా లేదని అంటున్నారు. టైమ్‌ పాస్‌ మూవీ లాంటిది తప్ప, ఏదో ఆశిస్తే నిరాశ తప్పదంటున్నారు. 

45

అల్లరి నరేష్‌ నటన సూపర్బ్ అట. క్లైమాక్స్ లో ఇరగదీశాడట. కానీ మాస్‌ సీన్లకి ఆయన డైలాగ్‌ డెలివరీ సింక్ కాలేదని, మాస్‌ అప్పీల్‌ రాలేదంటున్నారు. హీరోయిజానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారట, అది కథని దెబ్బతీసేలా ఉంటుందంటున్నారు. బీజీఎం ఉన్నంతలో బాగుందట. ఎడిటింగ్‌ లోపాలు చాలా ఉన్నాయని, చాలా సీన్లు తీసేయోచ్చు అంటున్నారు.

55

అల్లరి నరేష్‌  యాక్టింగ్‌, బీజీఎం, కొన్ని యాక్షన్‌ సీన్లు, క్లైమాక్స్, రెయిన్‌ ఎపిసోడ్‌ బాగుందట. కథనం, లవ్‌ అండ్‌రొమాంటిక్‌ ట్రాక్‌, కొన్ని బోరింగ్‌ సీన్లు మైనస్‌ అంటున్నారు. హీరోయిజం ఎలివేషన్‌ ప్రయత్నం, నరేష్‌ డైలాగ్‌ డెలివరీ పెద్దగా ఆకట్టుకునేలా లేవంటున్నారు. ఓవరాల్‌గా సినిమాకి యావరేజ్‌ టాక్ వినిపిస్తుంది. మరి ఇది పాజిటివ్‌ సైడ్‌ వెళ్తుందా? నెగటివ్ సైడ్‌ వెళ్తుందా అనేది చూడాలి. ఇది ఓవర్సీస్‌ ఆడియెన్స్ అభిప్రాయం. పూర్తి స్థాయి `ఏషియానెట్‌ రివ్యూ` కోసం వేచి ఉండంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories