20 ఏళ్ళ తర్వాత చిరు కోసం లెజెండ్రీ సింగర్ ని రంగంలోకి దించిన అనిల్ రావిపూడి.. నువ్వు మామూలోడివి కాదు బాసూ

Published : Oct 02, 2025, 08:50 PM IST

రామా చిలకమ్మ, వానా వానా వెన్నెల వాన, కైకలూరి కన్నె పిల్ల లాంటి చిరంజీవి సాంగ్స్ వింటే వెంటనే ఓ లెజెండ్రీ సింగర్ గుర్తుకు వస్తారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఆ సింగర్ చిరంజీవి కోసం మళ్ళీ పాట పాడారు. 

PREV
15
ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి స్టయిలే వేరు 

 మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో పాటలకు, డ్యాన్సులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తన డ్యాన్సులతో దశాబ్దాలుగా అభిమానులని అలరిస్తున్నారు. మరోవైపు పరాజయం లేకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి దూసుకుపోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. సినిమాకి ఎలా బజ్ పెంచాలో అనిల్ రావిపూడికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి నుంచి అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ చిత్రానికి తనదైన శైలిలో ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. 

25
లెజెండ్రీ సింగర్ ఈజ్ బ్యాక్ 

ఇటీవల విడుదలైన టీజర్ బాగా ఆకట్టుకుంది. మునుపటి చిరంజీవిని అనిల్ రావిపూడి మళ్ళీ తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి.. మెగాస్టార్ మూవీ కోసం మరో మ్యాజిక్ చేశారు. లెజెండ్రీ సింగర్ ఉదిత్ నారాయణ్ తో ఈ చిత్రంలో పాట పాడించారు. ఉదిత్ నారాయణ్ పేరు చెప్పగానే చూడాలని ఉంది చిత్రంలోని రామా చిలకమ్మా సాంగ్ గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంతోనే చిరంజీవి, ఉదిత్ నారాయణ్ కాంబినేషన్ మొదలైంది. రామా చిలకమ్మ పాట చిరంజీవి కెరీర్ లో బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి తరచుగా ఉదిత్ నారాయణ్ చిరంజీవి చిత్రాల్లో పాటలు పడుతూనే ఉన్నారు. 

35
చిరు, ఉదిత్ నారాయణ్ సూపర్ హిట్ కాంబో 

ఆ తర్వాత ఇద్దరు మిత్రులు, అన్నయ్య, డాడీ, ఇంద్ర, మృగరాజు, జై చిరంజీవ, ఠాగూర్ చిత్రాల్లో ఉదిత్ నారాయణ్ సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. చివరగా ఉదిత్ నారాయణ్ చిరంజీవి కోసం జై చిరంజీవి చిత్రంలో సాంగ్ పాడారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లో ఉదిత్ సాంగ్ పాడలేదు. 20 ఏళ్ళ తర్వాత మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం అనిల్ రావిపూడి ఉదిత్ నారాయణ్ ని తీసుకువచ్చారు. ఈ చిత్రంలో ఆయన మీసాల పిల్ల అనే పాట పాడారు. ఈ సాంగ్ ని అనిల్ రావిపూడి ప్రమోట్ చేస్తున్న విధానం కూడా బావుంది. 

45
ఫన్నీ వీడియో వైరల్ 

సంగీత దర్శకుడు భీమ్స్, అనిల్ రావిపూడి, ఉదిత్ నారాయణ్ ముగ్గురూ ఫన్నీగా ఓ వీడియో చేశారు. అనిల్ రావిపూడి ఒక రేంజ్ లో బిల్డప్ ఇస్తూ ఉదిత్ నారాయణ్ ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఉదిత్ మధ్యలో దూరి రామా చిలకమ్మ అనే పాట పాడారు. మరోసారి అనిల్ రావిపూడి ఆయన్ని పరిచయం చేసే ప్రయత్నం చేయగా 'వానా వానా వెన్నెల వానా' అనే పాట పాడారు. ఈయన మనకంటే ఫుల్ జోష్ లో ఉన్నారుగా అని అనిల్ రావిపూడి అంటారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. 

55
మీసాల పిల్ల సాంగ్ ప్రోమో

మొత్తంగా అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ కి మూడు నెలల ముందు నుంచే బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మీసాల పిల్ల సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో చిరంజీవి నయనతారని మీసాల పిల్ల అని పిలుస్తూ సింపుల్ గా వేస్తున్న డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. త్వరలో కంప్లీట్ లిరికల్ సాంగ్ రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories