ప్రముఖ యాంకర్ ఉదయభాను, కమెడియన్ వేణు మాధవ్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది. వేణు మాధవ్ చేసిన పనికి తాను వార్నింగ్ ఇచ్చానని, అయినా కూడా అతడు వినలేదని ఉదయభాను పేర్కొన్నారు.
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ఉదయభానుకి ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి వేణు మాధవ్ తో పరిచయం ఉంది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.ఇద్దరూ కలసి బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు చేశారు. వేణు మాధవ్ 2019లో 49 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఉదయ భాను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ ని గుర్తు చేసుకున్నారు.
25
నా గురించి పూర్తిగా తెలిసింది వేణు మాధవ్ ఒక్కడికే
నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి వేణు మాధవ్. అందరితో అల్లరి చిల్లరగా ఉంటాడు కానీ నాతో మాత్రం చాలా గౌరవంగా మాట్లాడేవాడు. అలాగని సీరియస్ గా మాత్రమే కాదు.. సరదాగా కూడా మాట్లాడేవాడు. నేను హీల్స్ వేసుకుని వెళితే.. నీ హీల్స్ మీదికి ఎక్కి దూకి చచ్చిపోవచ్చు అని ఫన్నీగా మాట్లాడేవాడు. కావాలనే ఎక్కువ ఎత్తు ఉన్న హీల్స్ వేసుకునేదాన్ని అని ఉదయభాను తెలిపారు.
35
నోటి దురుసు ఎక్కువ
మిగిలిన వాళ్ళతో చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడు. నోటి దురుసు ఎక్కువ. ఎవరి గురించి అయినా ఈజీగా కామెంట్ చేసేస్తాడు. నాతో మాత్రం చాలా గౌరవంగా ఉండేవాడు. ఒక కామెడీ షోకి వేణు మాధవ్ ని జడ్జీగా పిలవండి అని అడిగాను. వద్దండీ అతను ఎక్కడ పడితే అక్కడ తాగేసి పడిపోతున్నాడు అని చెప్పారు. నేను వేణు మాధవ్ కి ఫోన్ చేశాను. ఏంటి నీ గురించి ఇలా చెబుతున్నారు అని అడిగా.
లేదు భాను, వాళ్లంతా నా గురించి కావాలనే అబద్దాలు చెబుతున్నారు అని చెప్పాడు. లేదు వేణు ముందు నీ ఆరోగ్యం కాపాడుకో, అలాంటి అలవాట్లు మానుకో అని వార్నింగ్ ఇచ్చా. అయినా కూడా వినలేదు. కొన్ని రోజుల తర్వాత వేణు చనిపోయినట్లు వార్త వచ్చింది అని ఉదయభాను ఎమోషనల్ అయ్యారు.
55
రచ్చ మూవీ షూటింగ్ లో పడిపోయిన వేణు మాధవ్
తాగేసి పడిపోవడం గురించి వేణు మాధవ్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను ఆ ముందు రోజు షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల నైట్ భోజనం చేయలేదు. మళ్ళీ మార్నింగ్ షూటింగ్ ఉండడంతో టిఫిన్ చేయలేదు. దీనితో కళ్ళు తిరిగి పడిపోయా. దీనితో నేనంటే గిట్టని వాళ్ళు వేణు మాధవ్ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు అంటూ విపరీతంగా రూమర్స్ క్రియేట్ చేశారు. అది కూడా నేను రాంచరణ్ రచ్చ మూవీ షూటింగ్ లోనే పడిపోయాను. కానీ ప్రతి సినిమా షూటింగ్ లో పడిపోతున్నట్లు అబద్దాలు ప్రచారం చేశారు అని వేణు మాధవ్ తెలిపారు.