బాలయ్య చేసిన పని బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. ఆ రోజు దేవుడు కనిపించాడంటూ ఎమోషనల్‌

Published : May 14, 2024, 07:17 AM IST

తన జీవితంలో చేదు అనుభవాలను పంచుకుంది యాంకర ఉదయభాను.  బాలయ్యతో అనుబంధాన్ని, ఆయన చేసిన పనిని బయటపెట్టి ఎమోషనల్‌ అయ్యింది ఉదయభాను.

PREV
110
బాలయ్య చేసిన పని బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. ఆ రోజు దేవుడు కనిపించాడంటూ ఎమోషనల్‌

ఉదయ భాను ఒకప్పుడు యాంకర్‌గా రాణించిన విషయం తెలిసిందే. యాంకర్‌ సుమకి గట్టి పోటీ ఇచ్చింది. ఏక కాలంలో అనేక షోస్‌తోపాటు సినిమా ఈవెంట్లు కూడా చేసి మెప్పించింది. యాంకర్‌గా పీక్‌లోకి వెళ్తున్న సమయంలోనే ఆమె సడెన్‌గా బ్రేక్‌ తీసుకుంది. పెళ్లి,  పిల్లలు వంటి కారణాలతో ఆమె దూరయ్యింది.  
 

210

నటిగా కెరీర్‌ని ప్రారంభించింది ఉదయభాను. అడపాదడపా సినిమాలు చేసింది. కానీ నటిగా పెద్దగా అవకాశాలు రాలేదు. ఏడాదికి ఒకటి అర అన్నట్టుగానే సాగింది. ఈ క్రమంలో యాంకరింగ్‌ వైపు టర్న్ తీసుకుని అక్కడ సక్సెస్‌ అయ్యింది. బుల్లితెరని ఏలేసింది. యాంకర్‌గా అనేక షోస్‌ చేసింది. 
 

310

`హృదయాంజలి`, `వన్స్ మోర్‌ ప్లీజ్‌`, `సాహసం చేయరా దింబకా`, `జానవులే నెరజానవులే`, నువ్వు నేను`, `లక్స్ డ్రీమ్‌ గర్ల్‌`, `ఛాంగురే బంగారు లేడీ`, `లక్కీ లక్ష్మి`, `డాన్సింగ్‌ స్టార్‌`,  `గోల్డ్ రష్‌`, `తీన్‌మార్‌`, `రేలా రే రేలా`, `రంగం`, `ఢీ`, `నీతోనే డాన్స్`, `గ్యాంగ్‌ లీడర్‌`, `బొమ్మా  బొరుసు`, `కళ్యాణ లక్ష్మి ` వంటి షోస్‌ చేసి మెప్పించింది. ఉర్రూతలూగించింది.
 

410

కొన్ని షోస్‌కి జడ్జ్ గానూ చేసింది. `అదుర్స్`, `తడాఖా`,  `జూలకటక`, `ఢీ` షోలకు జడ్జ్ గా చేసి మెప్పించింది. అయితే పదేళ్ల క్రితం ఆమె బ్రేక్‌ తీసుకుంది. సడెన్‌గా ఆమె ఎందుకు దూరమయ్యిందో పెద్ద మిస్టరీ. ఇటీవల  మళ్లీ అడపాదడపా మెరుస్తుంది. అయితే `నీతోనే డాన్స్` షోలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 
 

510

తన జీవితంలో చేదు అనుభవాలను పంచుకుంది.  బాలయ్యతో అనుబంధాన్ని, ఆయన చేసిన పనిని బయటపెట్టి ఎమోషనల్‌ అయ్యింది ఉదయభాను. ఆ రోజు తనకు దేవుడు కనిపించాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా ఇది వైరల్‌గా  మారింది. మరి బాలయ్య ఏం  చేశాడు, ఆమె ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందనేది చూస్తే..
 

610

`నీతోనే డాన్స్` షోలో బాలకృష్ణ గురించి చర్చ వచ్చింది. ఈసందర్భంగా యాంకర్‌గా ఉన్న ఉదయభాను రియాక్ట్ అవుతూ నేనూ బాలయ్య బాబు గురించి ఓ విషయం షేర్‌ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి తాను ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలిపింది. తాను 12ఏళ్ల  నుంచి పనిచేయడం ప్రారంభించిందట. తన జీవితంలో సెలబ్రేషన్‌ అనేదే లేదట. 

710

ఆడపిల్లలకు కోరికలుంటాయి. అయితే ప్రెగ్నెంట్‌ అయ్యాక ఆ కోరికలు మరింతగా పెరుగుతాయి. సీమంతం చేసుకోవాలని ఉంటుంది. కానీ కొన్ని సంఘటనల తర్వాత దేవుడు లేడనిపించింది. ఇదంతా ట్రాష్‌ అనుకున్నా. దేవుడుని నమ్మకూడదనుకున్నా. పిల్లలంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. కానీ నా దగ్గర్నుంచి  ప్రతి బిడ్డని కొందరు  దూరం చేసేశారు.ఫైనల్‌గా నాకంటూ ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు  దేవుడు. 
 

810

ఫస్ట్ టైమ్‌, నా ఫస్ట్ బిడ్డకి ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నా. నా ఇండస్ట్రీనే నా ఫ్యామిలీ అనుకుని కొంత మందికి ఫోన్‌ చేశాను. ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన కొందరు  రెస్పాన్సే ఇవ్వలేదు. బాలయ్య బాబు నెంబర్‌కి ఒక్క మెసేజ్‌ పెట్టాను. ఇలా నా బేబీ ఫస్ట్ బర్త్ డే సర్‌, నా లైఫ్‌లోనే ఫస్ట్ పండగా, మీరు  వస్తే సంతోషిస్తాను అని మెసేజ్‌ పెట్టాను. ఆయన్నుంచి అరగంట  తర్వాత ఫోన్‌ వచ్చింది.
 

910

ఫస్ట్ టైమ్‌, నా ఫస్ట్ బిడ్డకి ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నా. నా ఇండస్ట్రీనే నా ఫ్యామిలీ అనుకుని కొంత మందికి ఫోన్‌ చేశాను. ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన కొందరు  రెస్పాన్సే ఇవ్వలేదు. బాలయ్య బాబు నెంబర్‌కి ఒక్క మెసేజ్‌ పెట్టాను. ఇలా నా బేబీ ఫస్ట్ బర్త్ డే సర్‌, నా లైఫ్‌లోనే ఫస్ట్ పండగా, మీరు  వస్తే సంతోషిస్తాను అని మెసేజ్‌ పెట్టాను. ఆయన్నుంచి అరగంట  తర్వాత ఫోన్‌ వచ్చింది.
 

1010

ఇదిలా ఉంటే వరుస విజయాలతో ఉన్న బాలకృష్ణ.. ప్రస్తుతం `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్‌ విలన్‌గా  చేస్తున్నారు. ఈమూవీ చిత్రీకరణ దశలో ఉంది. బాలకృష్ణ హిందూపుర్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు.  ఈ ఫలితాల అనంతరం ఆయన మళ్లీ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories