ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలా మలయాళంలో విడుదలై, ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతున్న ఓ థ్రిల్లర్ మూవీ గురించే ఈ స్టోరీ.
ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా మలయాళంలో వచ్చే థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలకు మన తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అలాంటి ఓ మలయాళ సినిమానే ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమ, ద్రోహం, క్రైమ్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ సినిమా మొదట్నుంచి చివరి వరకు ఉత్కంఠగా సాగుతుంది.
24
కథాంశం ఇదే
ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు షైనీ, రెజి అనే భార్యాభర్తలు. వీరికి ఒక కొడుకు కూడా ఉంటాడు. కుటుంబ పోషణ కోసం రెజి నగరంలో పనిచేస్తూ ప్రతినెలా ఇంటికి డబ్బు పంపిస్తుంటాడు. మరోవైపు, షైనీ తన కొడుకు, వృద్ధులైన అత్తమామలతో కలిసి పల్లెటూరిలో ఉంటుంది. అత్తగారి ఆరోగ్యం పాడవడంతో, ఆమెను చూసుకునే బాధ్యత షైనీపై పడుతుంది. పైకి ప్రశాంతంగా కనిపించే ఈ కుటుంబంలో, షైనీ జీవితంలో ఓ రహస్యం దాగి ఉంటుంది.
34
కుట్రకు తెరతీసిన కోడలు
భర్త ఇంట్లో లేని సమయంలో, షైనీ తన పాత స్నేహితుడైన కిరణ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. ఈ విషయం అత్తమామలకు తెలియడంతో వారు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీంతో కుటుంబంలో ఉద్రిక్తత పెరుగుతుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నవాళ్లను తొలగించుకోవాలని షైనీ, కిరణ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటారు. కానీ వాళ్ల ప్లాన్ ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక దశలో, వీరిద్దరి కుట్రను మామగారు కనిపెట్టేస్తారు. ఆ తర్వాత జరిగే సంఘటనలు కథను పూర్తిగా మార్చేస్తాయి. షైనీ, కిరణ్ తమ ప్లాన్‌లో సక్సెస్ అయ్యారా? నిజం చివరికి ఎవరి వైపు నిలిచింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మనమందరం పైకి కనిపించేంత నాగరికులం కాదు. మనలో కోరికలు, కోపాలు, పగ లాంటి ఎన్నో అంశాలను అణచిపెట్టుకుని ఉంటాం. అదే మన అసలైన 'ఉడల్' (శరీరం). ఆ జంతు స్వభావం ఎప్పుడైనా బయటకు రావచ్చు. అలాంటి పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? అనే ప్రశ్ననే రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించిన 'ఉడల్' సినిమా మన ముందు ఉంచుతుంది. ఈ చిత్రంలో దుర్గా కృష్ణ, ధ్యాన్ శ్రీనివాసన్, ఇంద్రాన్స్, జూడ్ ఆంటనీ జోసెఫ్ వంటి భారీ తారాగణం నటించారు. ఈ సినిమాకు రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించగా, గోకులం గోపాలన్ నిర్మించారు. 'ఉడల్' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ డ్రామా, ద్రోహం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను తప్పకుండా చూడొచ్చు.