అల్లు అర్జున్ కోసం ఇద్దరు తమిళ స్టార్ డైరెక్టర్ల పోటీ, మరి బన్నీ ఓటు ఎవరికి..?

Published : May 19, 2022, 07:20 PM IST

అల్లు అర్జున్ తో సినిమా కోసం పోటీ పెరిగిపోతోంది. పుష్పతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాధించిన ఐకాన్ స్టార్ తో సినిమా చేయాలిన డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఇక తమిళంలో సినిమా కమిట్ అయిన అల్లు కోసం.. ఇద్దరు స్టార్ డైరెక్టర్లు పోటీపడుతున్నారు. 

PREV
18
అల్లు అర్జున్ కోసం ఇద్దరు తమిళ స్టార్ డైరెక్టర్ల పోటీ, మరి బన్నీ ఓటు ఎవరికి..?

టాలీవుడ్ లో బన్నీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే పుష్ప సినిమాతో అది దేశవ్యాప్తం అయ్యింది. ఇక బన్నీ కోసం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు తన్నుకు వస్తున్నాయి. అలాగా తమిళంలో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అల్లు అర్జున్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మరి బన్నీ ఎవరికి ఛాన్స్ ఇస్తాడు. 
 

28

పుష్ప తరువాత బాలీవుడ్ నుంచి కూడా బన్నీకి చాలాఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి కూడా బన్నీతో సినిమా చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గాబన్నీ కూడా ఆయన్ను కలిశారు ముంబయ్ లో. ఇక సౌత్ లో స్టార్ ప్రొడ్యూసర్లు బన్నీ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 

38

ఈక్రమలోనే సౌత్ లో భారీ సినిమాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ తో అల్లు అర్జున్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. అయితే ఆ సినిమా కోసం మంచి డైరెక్టర్ వేటలో ఉన్నారు టీమ్. ముందుగా ఈ సినిమా కోసం తమిళయంగ్ డైరెక్టర్ అట్లీని అనుకున్నారట మేకర్స్. దాదాపు అట్లీ కన్ ఫార్మ్ అయ్యాడని కోలీవుడ్ లో పుకార్లు షికారు చేశాయి. అయితే అనూహ్యంగా తెరపైకి ఇప్పుడు మురుగదాస్ వచ్చాడు. 

48

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ డైరెక్టర్ గా మురుగదాస్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. స్టార్ హీరోలతో భారీ విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన టేకింగ్ కి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న దర్శకుడాయన. ఆయన కథలను అందించిన అన్ని సినిమాలు ఇతర భాషల్లోను సంచలన విజయాలను నమోదు చేశాడు. వాటితో పాటు స్పైడర్ లాంటి ప్లాప్ లు కూడా ఇచ్చాడు. 

58

ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా కోసం పోటీలో అట్లీ, మురుగుదాస్ ఉన్నారు. వీరిలో ఎవరు ఐకాన్ స్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నారు అనేది అంతటా ఉత్కంఠగా మారింది. అయితే ఈ విషయంలో రకరకాల సమీకరణాలు కనిపిస్తున్నాయి... రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. 

68

బన్నీ సినిమా అట్లీతో అనుకున్నారట లైకా మేకర్స్.. అయితే మంచి ఫామ్ లో ఉండి.. బాలీవుడ్ లో కూడా షారుఖ్ లాంటి వారితో సినిమా చేస్తున్న అట్లీ.. భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట. దాంతో లైకా వారు అట్లీ విషయంలో ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే బన్నీ చూపు మురుగదాస్ వైపు పడినట్టు సమాచారం. 
 

78

మురుగదాస్ దర్శకత్వంలో చేయడానికి బన్నీ మొగ్గుచూపుతున్నాడని లేటేస్ట్ టాక్.. మురుగదాస్ పేరు సిఫార్స్ చేసింది బన్నీయేనని అంటున్నారు. ఇక అట్లీ డిమాండ్ చేసిన పారితోషికం కారణంగా మేకర్స్ కూడా మురుగదాస్ ను రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నారని వినికిడి. 
 

88

అయితే పుష్ప 2 కంప్లీట్ చేసిన తరువాతే బన్నీ తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈలోపు అల్లుతో సినిమా కోసం  బోయపాటి కూడా వెయిటింగ్ లో ఉన్నాడు. అయితే పుష్ప2 తరువాత అల్లు అర్జున్ సినిమా బోయపాటితో   ఉంటుందో .. మురుగదాస్ తో ఉంటుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories