నేను నీ వెంట పడ్డానా.. సుధీర్ ని నిలదీసిన రష్మీ, వివాదం చివర్లో ట్విస్ట్!

First Published Apr 10, 2021, 2:18 PM IST

బుల్లితెర స్టార్స్ రష్మీ గౌతమ్, సుధీర్ మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది, ఏళ్లుగా ప్రేక్షకులను వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్న రష్మీ,సుధీర్ లను నేరుగా అనేక మార్లు, అనేక మంది అడిగారు. అయితే స్పష్టమైన సమాధానం రాలేదు. 
 

మేము మిత్రులం మాత్రమే అని చెప్పుకునే ఈ జంట, బుల్లితెర వేదికలపై రొమాన్స్ పంచుతారు. కలిసి సాంగ్స్ చేయడం, స్కిట్స్ చేయడం చేస్తూ ఉంటారు. కార్యక్రమం ఏదైనా రష్మీతో రొమాన్స్ అంటే సుధీరే చేయాలి.
undefined
అలాగే బుల్లితెర ప్రత్యేక కార్యక్రమాలలో రష్మీ మెడలో సుధీర్ తాళి కూడా కట్టారు. శోభన దంపతుల వలె సిగ్గుపడుతూ ఈ జంట కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే వీరి తోటి టీవీ సెలెబ్రిటీలు, వారు స్నేహితులు మాత్రమే అని చెబుతూ ఉంటారు.
undefined
తాజాగా జబర్దస్త్ వేదికపై ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన రాకేష్ మాస్టర్, సుధీర్ ని నేరుగా 'ఎవరినైనా ప్రేమిస్తే, పెళ్లి చేసుకోవచ్చుగా' అని అడిగాడు. దీనితో రష్మీ వైపు చూస్తూ సుధీర్, ఆమె నా వెంటబడుతుందని చెప్పాడు.
undefined
దీనితో రష్మీ.. రోజా గారు నేను సుధీర్ వెంటపడ్డానా, నువ్వే నా వెంట పడ్డావ్ అన్నట్లు సుధీర్ ని నిలదీసింది. ఇక సుధీర్ గతంలో వారిద్దరి మధ్య జరిగిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ గుర్తు చేసుకున్నాడు.
undefined
ఇవన్నీ కాదు, మీకు ఒకరంటే ఒకరికి ఇష్టమేనా.. పెళ్లి చేసుకుంటారా, అని రాకేష్ మాస్టర్ అడిగారు. అనూహ్యంగా ఇద్దరూ ఒకే చెప్పడంతో రాకేష్ మాస్టర్ రష్మీ, సుధీర్ చేతులు కలిపి పెళ్లి ఖాయం చేశాడు.
undefined
ఇవన్నీ కాదు, మీకు ఒకరంటే ఒకరికి ఇష్టమేనా.. పెళ్లి చేసుకుంటారా, అని రాకేష్ మాస్టర్ అడిగారు. అనూహ్యంగా ఇద్దరూ ఒకే చెప్పడంతో రాకేష్ మాస్టర్ రష్మీ, సుధీర్ చేతులు కలిపి పెళ్లి ఖాయం చేశాడు.
undefined
మరి రష్మీ, సుధీర్ పెళ్ళికి ఒప్పుకోవడం నిజమా లేక స్కిట్ లో భాగమా అనేది రానున్న పూర్తి జబర్దస్త్ ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది. అప్పటి వరకు ఎప్పటిలానే సస్పెన్సు అని చెప్పాలి.
undefined
నా కెరీర్ ఎదుగుదలకు రష్మీనే కారణం అని సుధీర్ పలు మార్లు చెప్పారు. ఇక రష్మీ మాత్రం పెళ్లి మాట ఎత్తితే, ఇంకా టైం ఉంది.. అబ్బాయి ఎవరైనా కావచ్చు, అది సుధీర్ కూడా కావచ్చని అంటుంది.
undefined
click me!