ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ తెలుగు 7 వివాదాలు రాజేసింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ ఇందుకు కారణం కాగా, నాగార్జున ఇమేజ్ కూడా దెబ్బతింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రశాంత్ అరెస్ట్ కాగా, ఈ వివాదం మీద బిగ్ బాస్ యాజమాన్యం, హోస్ట్ నాగార్జున స్పందించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.