బిగ్ బాస్ హౌస్లోకి జ్యోతిరాయ్? క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!

First Published | Aug 9, 2024, 11:09 AM IST

బిగ్ బాస్ షోలో గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ కంటెస్టెంట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. 
 

గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జ్యోతిరాయ్. ఈ కన్నడ భామ హోమ్లీ రోల్ లో ఆకట్టుకుంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. హీరో తల్లి జగతిగా ఆమె మెప్పించారు. 

Jyothi Rai

ప్రస్తుతం జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్ లో నటించడం లేదు. ఆమె అభిమానులను ఇది నిరాశపరిచే అంశం. జ్యోతిరాయ్ కన్నడలో సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలో గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకుంది. 


గుప్పెడంత మనసు సీరియల్ లో ఆమె పాత్రను చంపేశారు. జ్యోతిరాయ్ వ్యక్తిగత విషయాలు పరిశీలిస్తే...  యంగ్ ఏజ్ లోనే వివాహం చేసుకున్న జ్యోతిరాయ్ జీవితంలో చాలా కాంట్రవర్సీ ఉంది. ఆమె మొదటి భర్తకు విడాకులిచ్చి దర్శకుడు పూర్వజ్ తో కలిసి జీవిస్తున్నారు. వీరు సహజీవనం చేస్తున్నారా? లేక వివాహం చేసుకున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. 

సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ షేర్ చేసే ఫోటోలు కాకరేపుతుంటాయి. శృతి మించిన గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆమె ఆకర్షిస్తుంది. అయితే ఇదంతా కెరీర్ కోసమే అని ఆమె అంటున్నారు. లైఫ్ లో కాంట్రవర్సీతో కూడిన హాట్ బ్యూటీస్ కి బిగ్ బాస్ షోలో డిమాండ్ ఎక్కువ. మేకర్స్ ఇలాంటి వ్యక్తులను హౌస్లోకి పంపేందుకు ఆసక్తి చూపుతారు. 

ఈ క్రమంలో బిగ్ బాస్ కన్నడ సీజన్ 11లో ఆమెకు ఆఫర్ వచ్చింది. కంటెస్టెంట్స్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లపై జ్యోతిరాయ్ స్పందించింది. నన్ను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించిన మాట వాస్తవమే. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. నాకు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ రీత్యా బిగ్ బాస్ షోకి వెళ్ళలేను. అభిమానులకు ధన్యవాదాలు.. అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దాంతో జ్యోతిరాయ్ బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్ట్ చేయడం లేదని క్లారిటీ వచ్చింది. 
 

Latest Videos

click me!