ప్రియాంక జైన్ సీజన్ 7లో వన్ అండ్ ఓన్లీ లేడీ ఫైనల్ కంటెస్టెంట్ గా ఉంది. అమర్, శోభకు ఈమెకు బెస్ట్ ఫ్రెండ్. అయితే ఒక సందర్భంలో అమర్ పట్ల శివాజీ ప్రవర్తన నచ్చలేదని ఆమె ప్రియుడు శివ కుమార్ అన్నారు.
బిగ్ బాస్ హౌస్లో సీరియల్ బ్యాచ్ గా పాపులర్ అయ్యారు అమర్ దీప్, శోభ శెట్టి, ప్రియాంక జైన్. స్టార్ మా ఛానల్ లో ఏళ్ల తరబడి వీరు పని చేశారు. దాంతో వీళ్లకు స్టార్ మా బ్యాచ్ అనే మరో పేరు కూడా ఉంది. వృత్తిపరంగా పరిచయమైన వీరి మధ్య స్నేహం ఉంది.
27
అమర్ దీప్-ప్రియాంక అయితే కలిసి ఓ సీరియల్ లో నటించారు. జానకి కలగనలేదు సీరియల్ లో వీరిద్దరూ భార్యాభర్తలుగా లీడ్ రోల్ చేశారు. ఆ సీరియల్ కి ముగింపు పలికి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. వీళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తప్పితే తీవ్ర స్థాయిలో గొడవలైన సందర్భాలు లేవు. సీజన్ మొత్తంలో అమర్ ని ప్రియాంక ఒకసారి నామినేట్ చేసింది.
37
Bigg Boss Telugu 7
కాగా ఒక టాస్క్ లో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో తమ వద్ద ఉన్న రింగ్ వేసి బాల్ ని దగ్గరకు లాక్కోవాలి. ప్రియాంక దగ్గరున్న బంతిని అమర్ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశాడు. ప్రియాంక పట్టువదలకుండా గట్టిగా పట్టుకుంది. అమర్ ప్రియాంకను గాల్లోకి ఎత్తి కింద పడేశాడు.
47
Bigg Boss Telugu 7
ఈ టాస్క్ అనంతరం ప్రియాంక కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై ప్రియాంక ప్రియుడు శివ కుమార్ స్పందించారు. అమర్-ప్రియాంక కలిసి పని చేశారు. వాళ్ళ మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరినొకరు గౌరవించుకునే తీరు నాకు బాగా నచ్చుతుంది. బాల్ టాస్క్ లో ప్రియాంకను అమర్ ఎత్తి కింద పడేయడం నాకు నచ్చలేదు. చాలా బాధేసింది.
57
ప్రియాంక పేరెంట్స్ 24 హౌర్స్ లైవ్ చూస్తారు. అమర్ ప్రియాంకతో అలా ప్రవర్తించడం చూసి వాళ్ళు కంగారు పడ్డారు. తర్వాత టాస్క్ లో భాగమే అని లైట్ తీసుకున్నారు.
67
ప్రియాంక టైటిల్ కొట్టాలనే ఉద్దేశంలో హౌస్లో అడుగుపెట్టింది. ఆమె చాలా స్ట్రాంగ్ ప్లేయర్. అయితే టైటిల్ కొట్టే అవకాశం లేదు. బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ పల్లవి ప్రశాంత్ కొడతాడని శివ కుమార్ జోస్యం చెప్పాడు. కాబట్టి శివ కుమార్ ఉద్దేశంలో అమర్ కూడా టైటిల్ విన్నర్ కాదు.
77
Bigg Boss Telugu 7
ఫ్యామిలీ వీక్ లో అందరి కోసం కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రియాంకను కలిసేందుకు ప్రియుడు శివ కుమార్ వచ్చాడు. ఆమెను ముద్దుల్లో ముంచెత్తాడు. బిగ్ బాస్ హౌస్లోనే పెళ్లి చేసుకుందామని ప్రియాంక అడిగింది. బయటకు వచ్చాక చేసుకుందామని శివ కుమార్ హామీ ఇచ్చాడు.