12000 కోట్లకు పైగా ఆస్తి, సినిమాకు 150 కోట్ల రెమ్యునరేషన్.. షారుఖ్ ఖాన్ ఫస్ట్ మూవీకి ఎంత ఇచ్చారో తెలుసా?

Published : Nov 02, 2025, 01:10 PM IST

సాధారణ సీరియల్ యాక్టర్ బాలీవుడ్ బాద్ షా అయ్యాడు, 12000 కోట్లకు పైగా ఆస్తులతో బిలియనీర్ లిస్ట్ లోకి చేరాడు. సినిమాకు 150 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాడు. అయితే షారుఖ్ ఖాన్ ఫస్ట్ మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?

PREV
14
బిలియనీర్ గా షారుఖ్ ఖాన్

కింద స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన షారుఖ్ ఖాన్.. ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోగా చరిత్ర సృష్టించాడు. ఈ మధ్యనే అధికారికంగా బిలియనీర్ క్లబ్‌లోకి ప్రవేశించాడు బాద్ షా. హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో 12,490 కోట్ల ఆస్తితో షారుఖ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. హురున్ షారుఖ్‌ను బిలియనీర్‌గా గుర్తించడం ఇదే మొదటిసారి. సినిమాకు 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న షారుఖ్ పలు వ్యాపారాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నాడు. తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నుంచే కాకుండా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ద్వారా కూడా షారుఖ్ భారీగా ఆస్తిని పోగేశాడు. దాంతో ఈ ఏడాది షారుక్ బిలియనీర్స్ జాబితాలో మొదటి స్థానం సంపాదించాడు. మరి షారుఖ్ కెరీర్ బిగినింగ్ లో.. ఫస్ట్ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

24
వేల మంది అభిమానులు

ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు వేల కోట్లు సంపాదించాడు, కానీ ఈ స్థాయికి రావడానికి అతను చాలా కష్టపడ్డాడు. 'దీవానా' (1992) సినిమాతో బాలీవుడ్ లోకి ఆరంగ్రేట్రం చేశాడు. అంచలంచలుగు ఎదుగుతూ వచ్చాడు. షారుఖ్ ఖాన్ ఎదుగుదల గురించి ఆయన పాత స్నేహితుడు, మార్గదర్శి అయిన నిర్మాత వివేక్ వాస్వానీ, ఓ ఇంటర్వ్యలో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సూపర్‌స్టార్ సినీ ప్రయాణంలో చాలామందికి పెద్దగా తెలియని విషయాలను ఆయన పంచుకున్నారు. షారుఖ్ మొదట ఏ సినిమాకు సంతకం చేశాడో, దానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకన్నాడన్న విషయాన్ని ఆయన వెల్లడించారు.

34
షారుఖ్ ఖాన్‌కు ఫస్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది

షారుఖ్ ఖాన్ కు ఫస్ట్ సినిమా ఆఫర్ సీనియర్ హీరోయిన్ హేమా మాలిని ఇచ్చారు. షారుఖ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న టైమ్ లో వివేక్ వాస్వానీతో కలిసి ఉండేవారు. అప్పుడే అతనికి హేమా మాలిని నుంచి ఫోన్ వచ్చింది. ఆమె తన దర్శకత్వంలో వస్తున్న 'దిల్ ఆశ్నా హై' సినిమా కోసం యాక్టర్స్ ను ఎంపిక చేస్తున్నారు. దాంతో ఈ ఇద్దరు స్నేహితులు ఎంతో ఉత్సాహంగా ఆమె ఇంటికి వెళ్లారు. వెళ్లడం అయితే వెళ్ళారు కానీ.. వారికి కాస్త కంగారుగానే ఉంది. అక్కడ ఒక వ్యక్తి పేపర్ వెనుక దాక్కుని కూర్చుని ఉండటం చూశారు. అతను పేపర్ కిందకు దించినప్పుడు, వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అతను మరెవరో కాదు, ధర్మేంద్ర. కాసేపటికి హేమా మాలిని కూడా వచ్చి షారుఖ్ లుక్ చూసి, హీరోగా ఆఫర్ ఇచ్చారు.

44
మొదటి సినిమాకు షారుఖ్ ఖాన్‌ రెమ్యునరేషన్

హేమా మాలిని షారుఖ్ ఎనర్జీ, స్క్రీన్‌పై అతని నటన చూసి అతన్ని సినిమాలో తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పాత్ర కోసం హేమా షారుఖ్ కి 50,000 ఆఫర్ చేశారు. 150 కోట్లు తీసుకునే బాలీవుడ్ బాద్ షా..ఫస్ట్ సినిమాకు 50 వేలు అందుకున్నాడు.. ఇది అప్పటికీ సీరియల్స్ లో నటిస్తున్న షారుఖ్ కి చిన్న మొత్తమే అయినా, చాలా ముఖ్యమైనది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు జితేంద్ర, మిథున్ చక్రవర్తి, డింపుల్ కపాడియా, అమృతా సింగ్, కబీర్ బేడీ లాంటి సెలబ్రిటీలు నటించారు. అయితే, షారుఖ్ మొదట సంతకం చేసిన సినిమా 'దిల్ ఆశ్నా హై' అయినప్పటికీ, అతని మొదటి సినిమా రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన 'కింగ్ అంకుల్', అతని మొదటి రిలీజ్ మాత్రం 'దీవానా', ఇదే అతని విజయానికి కారణమైంది.

Read more Photos on
click me!

Recommended Stories