అల్లు శిరీష్ కాబోయే భార్య నైనికా ఏం చేస్తుంది? ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Published : Nov 02, 2025, 12:12 PM IST

అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. రీసెంట్ గా నైనికాతో శిరీష్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇక అతను చేసకోబోయే అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? నెలకు ఆమె సంపాదన ఏంత ఉంటుందో తెలుసా? 

PREV
15
బ్యాచిలర్ లైఫ్ కు అల్లు శిరీష్ గుడ్ బై..

టాలీవుడ్‌లో మరో శుభకార్యం జరగబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి.. త్వరలోనే పెళ్ళికి రెడీ అవుతున్నాడు. 38 ఏళ్ళ వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆయన నైనికా అనే హైదరాబాదీ అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా రీసెంట్ గా నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గోన్నారు.

25
మెగా అల్లు ఫ్యామిలీ సందడి

అల్లు శిరీష్ నిశ్చితార్దం వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ప్రత్యేకంగా రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆయన భార్య ఉపాసన ఈ నిశ్చితార్థానికి హాజరు కావడంతో.. సందడిగా మారింది. అంతే కాదు రీసెంట్ గా వివాహం చేసుకుని, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి జంట కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తానికి మెగా, అల్లు ఫ్యామిలీ కలిసి ఇలా కనిపించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

35
అల్లు శిరీష్ కాబోయే భార్య ఏంచేస్తుంది.

ఇక అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతోన్న నైనికా ఎవరు అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. మెగా, అల్లు ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, నైనికా హైదరాబాదులో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వాటితో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా నైనిక ఫ్యామిలీ రాణిస్తున్నట్టు సమాచారం. ఇక నైనిక కూడా బెంగళూర్ లో రెండు ఐటీ కంపెనీలు నడుపుతున్నట్టు తెలుస్తోంది.

45
నైనికా ఎంత సంపాదిస్తుంది..?

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, నైనికా నెల ఆదాయం కోట్లలో ఉంటుందని అంచనా.. అల్లు శిరీష్ సంపాదన కంటే నైనికా ఇన్ కమ్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే నైనికా కుటుంబం, అల్లు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారి, చివరికి పెళ్ళి వరకూ వచ్చినట్టు తెలుస్తోంది.

55
అల్లు శిరీష్ సినిమాలు

ఇక అల్లువారబ్బాయి సినిమాల విషయానికి వస్తే, అల్లు శిరీష్ చివరిసారిగా బడ్డీ సినిమాలో నటించాడు. ఈసినిమా గత ఏడాది రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటివరకు ఆయన కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. పెళ్ళి తరువాత అల్లు శిరీష్ కొత్త సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories