నైట్ వాచ్ మెన్ నుంచి నటుడిగా.. జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా?

Published : Oct 31, 2025, 11:34 AM IST

ప్రస్తుతం స్టార్లుగా ఉన్న ఎంతో మంది నటులు..ఒకప్పుడు ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చినవారే? వారి అందమైన జీవితం వెనక ఎన్నో విషాద కోణాలు కనిపిస్తుంటాయి. ఈక్రమంలో ఓ కమెడియన్ తన జీవితంలో పడ్డ కష్టాల గురించి ఓ ఈవెంట్ లో వెల్లడించారు. 

PREV
14
నవ్వుల వెనుక విషాద కోణం..

టాలీవుడ్ లో ఎంతో మంది సీనయిర్ కమెడియన్లు ఉన్నారు. వారు కాకుండా జబర్థస్త్ నుంచి కూడా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అందులో చాలామంది చేసే కామెడీ వెనకు ఏదో ఒక విషాద గాధ ఉంటుంది. అది ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తుంది. వారి కామెడీ చూసి కడుపుబ్బ నవ్వుకున్నవారికి...వాటి విషాద కథ విని ఎంతో బాదేస్తుంది. అలాంటి కమెడియన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కమెడియన్ మరెవరో కాదు తాగుబోతు రమేష్.

24
తాగుబోతు పాత్రలకు బ్రాండ్..

టాలీవుడ్ లో తాగుబోతు పాత్రలు చేయగల కమెడియన్ గా ఎమ్మెస్ నారాయణకు మాత్రమే పేరుంది. కానీ ఆయన మరణం తరవాత ఆలోటును ఎవరూ పూడ్చలేకపోయారు. ఆయనంత కాదు కానీ.. ఎమ్మెస్ మాదిరిగా తాగుబోతు పాత్రలకు బ్రాండ్ ఇమేజ్ పడిపోయిన నటుడు రమేష్. తన పేరు పక్కన తాగుబోతు రమేష్ అనే ట్యాగ్ లైన్ వచ్చిందంటే.. ఆ పాత్రలు అతను ఎంత బాగా చేస్తున్నాడో అర్ధం అవుతుంది. వెండితెరపై, బుల్లితెరపై తన కామెడీ జల్లులు కురిపించిన రమేష్.. సినిమాలు చేస్తూనే.. అటు జబర్థస్త్ లో కూడా తన సత్తా చూపించాడు. బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈక్రమంలో అతని కామెడీ వెనుక ఉన్న విషాద కథను రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో వెల్లడించాడు రమేష్.

34
కాపాడిన జబర్ధస్త్

తాగుబోతు రమేష్ టాలీవుడ్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అతను చేసిన సినిమాల్లో ఎక్కువగా తాగుబోతు పాత్రలే గుర్తింపు తీసుకువచ్చాయి. మరీ ముఖ్యంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో రమేష్ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆతరువాత వరుసగా సినిమాలు చేసిన తాగుబోతు రమేష్ కు మధ్యలో.. అవకాశాలు లేక బ్రేక్ వచ్చింది. దాంతో బబర్ధస్త్ టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చి.. బుల్లితెర ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. జబర్ధస్త్ వల్ల మరోసారి రమేష్ కు సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. అయితే రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ లో మాట్లాడిన రమేష్.. తన కెరీర్ బిగినింగ్ లో పడ్డ ఇబ్బందుల గురించి మాట్లాడారు.

44
నైట్ వాచ్ మెన్ నుంచి నటుడిగా..

నటుడిగా ఎదగాలని ఇండస్ట్రీకి వచ్చిన రమేష్ కు.. అది అంత సులువుగా జరిగే పని కాదు అని తెలిసింది. ఎన్నో కష్టాలు.. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డరోజులు ఉన్నాయి. బస్ కు వెళ్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతుందని. ఆ 5 రూపాయాలు జేబులో ఉంచుకుని..నడుచుకుంటూ వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నాడు రమేష్. అంతే కాదు అవకాశాలు కోసం పగలంతా తిరుగుతూ.. నైట్ వాచ్ మెన్ గా జాబ్ చేసిన రోజులు గుర్తు చేసుకుని కన్నీరు పెట్టాడు తాగుబోతు రమేష్. నటుడిగా గుర్తింపు వచ్చేవరకూ.. బయట సర్వేవ్ అవ్వడానికి చాలా పనులు చేశానని ఆయన వెల్లడించారు. జేసీబి డ్రైవర్ గా కూడా పనిచేసినట్టు రమేష్ వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories