దాంతో నరేష్ కి మరో సూపర్ ఐడియా వచ్చింది. నెగిటివిటీని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్లాన్ వేశాడు. మీరు అడుక్కుంటున్నాను అంటున్నారు కాబట్టి, నేను నిజంగానే అడుక్కుంటున్నాను. నన్ను అభిమానించే నా సబ్స్క్రైబర్స్ ఒక్కో రూపాయి చొప్పున నాకు దానం ఇవ్వండి. ఆ డబ్బు నా సబ్స్క్రైబర్స్ లో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వాళ్లకు ఇస్తాను, అని వీడియో చేశాడు.