యావర్-నయని-గౌతమ్ మధ్య ట్రైయాంగిల్ లవ్ డ్రామా... డాక్టర్ బాబు ఘాటైన కౌంటర్లు!

Published : Jan 30, 2024, 12:04 PM ISTUpdated : Jan 30, 2024, 01:46 PM IST

  బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి నెల రోజులు దాటిపోయినా కంటెస్టెంట్స్ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటున్నారు. మొన్నటి వరకు యావర్ తో సన్నిహితంగా ఉన్న నయని పావని గౌతమ్ తో రొమాన్స్ చేస్తుందంటూ ట్రోల్స్ మొదలయ్యాయి.   

PREV
16
యావర్-నయని-గౌతమ్ మధ్య ట్రైయాంగిల్ లవ్ డ్రామా... డాక్టర్ బాబు ఘాటైన కౌంటర్లు!
Nayani Pavani

బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది నయని పావని. ఐదో వారం మినీ లాంచ్ ఈవెంట్ ద్వారా ఆమె హౌస్లో అడుగుపెట్టింది. అనూహ్యంగా వారానికే ఎలిమినేట్ అయ్యింది. నయని పావని ఎలిమినేషన్ పై విమర్శలు వినిపించాయి. ఆమె కన్నీరు మున్నీరు అయ్యింది. 

 

26
Bigg Boss Telugu 7

కాగా ఫైనలిస్ట్స్ లో ఒకరైన ప్రిన్స్ యావర్ తో ఆమె సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి కొన్ని రీల్స్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యావర్, నయని పావని మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం కూడా జరిగింది. 
 

36
Nayani Pavani

ఈ ప్రచారం జరుగుతుండగా... బిగ్ బాస్ 7 మరో కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణతో నయని పావని ఓ సాంగ్ చేసింది. తెలియదే... అనే సాంగ్ లో వీరి రొమాన్స్ అదిరింది. కెమిస్ట్రీ పీక్స్ లో ఉంది. దీంతో నెటిజెన్స్ నయని పావని, గౌతమ్ మీద ట్రోల్స్ షురూ చేశారు. 
 

46
Nayani Pavani

యావర్ కి హ్యాండ్ ఇచ్చిన నయని పావని... గౌతమ్ తో డేటింగ్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా నెగిటివిటీ మీద గౌతమ్ స్పందించాడు. సాధారణంగా నేను నెగిటివ్ కామెంట్స్ మీద స్పందించను. అయితే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. మేము నటులం. బొమ్మతో అయినా మనిషితో అయినా ఒకేలా నటిస్తాము. 
 

56
Nayani Pavani

ఆమె నేను మంచి మిత్రులం. అలాగే మనం అందరం మనుషులం. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. అర్థం చేసుకోండి. నెగిటివ్ గా మాట్లాడేవారు. వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తే బాగుపడతారు... అని కౌంటర్ ఇచ్చాడు. గౌతమ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. 

 

66
Bigg Boss Telugu 7

తామంతా ఫ్రెండ్స్. తమ వృత్తిలో భాగంగా కలిసి నటిస్తున్నాము. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని గౌతమ్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. ఇక నయని పావని లేటెస్ట్ సాంగ్ తెలియదే... మంచి ఆదరణ దక్కించుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories