Naga panchami
Naga Panchami Today Episode: మేఘన తన అన్న కోసం తెచ్చిన నాగ చంద్రకాంత మొక్కను కోల్పోయిన శక్తుల కోసం మోక్షకు ఉపయోగిస్తుంది. తనకు దొరికిన ఆకు పరసు రసం అని అందరినీ నమ్మిస్తుంది. దీంతో.. చివరకు మోక్ష బతుకుతాడు. ఇంట్లో వాళ్లను చూసి మోక్ష సంతోషిస్తాడు. తనను తన పంచమి బతికించిందని సంబరపడిపోతాడు కానీ.. వైదేహి నమ్మదు. నిన్ను బతికించింది మేఘన అని.. పంచమి కాదు అంటుంది.. అయినా సరే.. పంచమి చేసిన పూజలే తనను బతికించాయని అంటాడు.
అయితే.. వైదేహి.. పంచమిని వదిలేసి.. ఇంటికి వెళ్లిపోదాం రమ్మని చెబుతుంది. అందుకు మోక్ష అంగీకరించడు. అయితే.. మోక్ష తనతో పాటు ఇంటికి రాకపోతే..తాను చనిపోతాను అని వైదేహి బెదిరిస్తుంది. అలా చేయవద్దని, మోక్ష, ఇంట్లో అందరూ బతిమాలినా కూడా వైదేహి వినిపించుకోదు. పంచమిని కూడా చాలా తిడుతుంది. నా కొడుకును నాతో పంపించు అని పంచమిని అడుగుతుంది. దీంతో.. పంచమి తన మనసు మార్చుకుంటుంది. తనను వదిలేయమని పంచమి అడుగుతుంది. వద్దు అని.. కావాలంటే.. ఇద్దరం కలిసి చనిపోదాం అని మోక్ష అడిగినా, పంచమి మనసు కరగదు. మెక్ష తన ఇంట్లో వాళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరిస్తుంది. మోక్ష ఎంత చెప్పినా పంచమి వినిపించుకోదు. దీంతో.. చేసేదిలేక.. మోక్ష తన వాళ్లతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Naga panchami
మోక్ష బతికినందుకు చిత్ర, జ్వాలలు బాధపడిపోతూ ఉంటారు. ఈ లోగా మోక్షను ఇంటికి తీసుకువస్తారు. తీసుకువచ్చిన తర్వాత.. నీకు రెండో సారి ప్రాణం పోసి బతికించింది మేఘన అని, తనకు నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలని వైదేహి చెబుతుంది. ఒక దేవతలా మారి.. నిన్ను బతికించింది అని వైదేహి చెబుతుంది. కానీ.. మోక్షను బతికించింది మీ అందరి కోసం కాదని.. తాను బలి ఇవ్వడానికి మాత్రమే అని లోలోపల మేఘన రూపంలో ఉన్న కరాళి అనుకుంటూ ఉంటుంది.
Naga panchami
ఇక ఇంట్లో వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు.. మేఘనను పొగిడే కార్యక్రమం పెట్టుకుంటారు. అందరూ వరసగా మేఘనను పొగుడుతారు. దీంతో.. జ్వాల, చిత్రలు సెటైర్లు వేస్తారు. పంచమి స్థానంలోకి మేఘన వచ్చింది ఏంటి అని కౌంటర్లు వేస్తారు. కానీ.. పంచమి పేరు ఈ ఇంట్లో వినపడటానికి వీలు లేదని.. పంచమి.. ఈ ఇంటి నుంచి మాత్రమే కాదు.. మోక్ష జీవితం నుంచి కూడా వెళ్లిపోయిందని వైదేహి అంటుంది. అయితే.. తన నుంచి పంచమి ని ఎవరూ వేరు చేయలేరని.. పంచమి తనకు దూరమైన రోజు నేను ప్రాణాలతో ఉండను అని మోక్ష తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు,
Naga panchami
అయితే.. మోక్ష గుండె కోసినా కూడా పంచమి కనపడేలా ఉందని.. తన శక్తుల కోసం కాకపోయినా.. పంచమి మీద పగకోసం అయినా మోక్షను బలి ఇవ్వాలి అని మేఘన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక.. మోక్ష మనసులో ఇంకా పంచమి ఉంది అంటే.. మోక్షకు పాము గండం ఉండే ఉంటుంది అని..జ్వాల, చిత్ర అనుకుంటారు.
Naga panchami
ఇంట్లో ఉన్న మోక్ష.. పంచమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అటు.. పంచమి కూడా మోక్ష గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. మోక్షను దూరం చేసుకున్నందుకు పంచమి చాలా ఏడుస్తుంది. మోక్షతో గడిపిన కొద్ది రోజులు తనకు యుగాలతో సమానం అని.. అది తనకు చాలుఅని అనుకుంటుంది. మోక్ష ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని.. ఈ పంచమిని మర్చిపోండి అంటుంది. కానీ.. ఇక్కడ మోక్ష.. తాను పంచమిని వదులుకోలేనని, ఆమె కోసం తాను ఈ లోకాన్ని వీడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఉంటాడు.
Naga panchami
మరోవైపు... పంచమికి మోక్షను శాశ్వతంగా దూరం చేయాలని మేఘన అనుకుంటుంది. తన శక్తులు మళ్లీ తిరిగి పొందాలంటే.. మోక్షను బలి ఇవ్వాల్సిందే అనుకుంటాడు. మరోవైపు ఫణీంద్ర కూడా.. పంచమితో పెళ్లి అయినట్లు ఊహించుకున్న సందర్భాలను తలుచుకుంటాడు. అది జరగకపోగా.. తనకు కనీసం నాగలోకానికి వెళ్లే అవకాశం లేకుండా పోయిందని బాధపడుతూ ఉంటాడు.
Naga panchami
పంచమి తన ఇంట్లో కూర్చొని ఉదయాన్నే ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి సుబ్బు వస్తాడు. సుబ్బు అంటే.. సుబ్రహ్మణ్య స్వామి. పంచమి మనసు మార్చేందుకే సుబ్బు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి కాసేపు పంచమి బాధలు,కన్నీళ్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటే.. మీరు మనసులు మార్చుకొని పెళ్లి చేసుకున్నారని..మోక్ష, పంచమిల గురించి సుబ్బు చెబుతాడు. మీ ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోలేరు అని చెబుతాడు. కానీ.. పంచమి తన వల్ల మోక్ష బాబుకి ఎలాటి సుఖ సంతోషాలు ఉండవని, వేరే వారిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని చెబుతుంది.
Naga panchami
దానికి సుబ్బు... శారీరక సుఖం పువ్వులాగా అందరికీ కనపడుతుందని, కానీ మానసిక సుఖం మకరందం లాంటిదని ఎవరికీ కనపడదు అని చెబుతాడు. చిన్న పిల్లాడివి., నీకు ఇవన్నీ అర్థం కావు అని పంచమి కొట్టిపారేస్తుంది. సుబ్బు.. పంచమిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ పంచమి అంగీకరించదు.
కమింగప్ లోనూ... పంచమికి మోక్ష ఎదురౌతాడు. అయితే.. తనను కలిస్తే.. అస్థికలు మాత్రమే మిగులుతాయని.. తాను ఈ లోకం నుంచి వదిలివెళ్లిపోతాను అని పంచమి బెదిరిస్తుంది. మరి మోక్ష ఏం చేస్తాడో చూడాలి.