Guppedantha Manasu
Guppedantha Manasu 24th January Episode: ఫెస్ట్ ఆపేస్తానని శైలేంద్ర తనను బెదిరించిన విషయం వసు వచ్చి మహేంద్ర, అనుపమలకు చెబుతుంది. అది విన్న అనుపమ .. తప్పంతా మీదేనని.. శైలేంద్ర గురించి తెలిసిన వెంటనే ఫణీంద్రకు చెప్పాల్సిందని అనుపమ అంటుంది. అలా చెప్పి ఉంటే జగతి, రిషి లకు ఇలా జరిగి ఉండేది కాదు అని అనుపమ అంటుంది. అయితే.. తాము చెబితే అన్నయ్య బాధపడతాడని, తనకు తాను గా తెలుసుకుంటాడని అనుకున్నాని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
అయితే.. ఈ సారి శైలేంద్ర పిచ్చి పిచ్చి గా మాట్లాడితే.. వార్నింగ్ ఇవ్వడం కాదు.. చెంప పగలకొట్టమని వసుతో అనుపమ అంటుంది. అయితే.. నిజానికి తాను ఆ పనే చేసేదాన్నని..కాకపోతే పక్కనే స్టూడెంట్స్ ఉండటం వల్ల కొట్టకుండా..కేవలం మాటలతో వార్నింగ్ ఇచ్చాను అని వసు బదులిస్తుంది.
Guppedantha Manasu
ఇక్కడ సీన్ కట్ చేస్తే.. ఫణీంద్ర.. శైలేంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. ఫెస్ట్ పనులు ఎంత వరకు జరుగుతున్నాయి అని అడుగుతాడు. వసుధార అన్ని పనులు చూసుకుంటోందని శైలేంద్ర చెబుతాడు. వసుధార ఒక్కతే అన్ని పనులు చూసుకోవడం కాదు.. నువ్వు కూడా హెల్ప్ చేయమని చెబుతాడు. గతంలో మన కాలేజీలో ఫెస్ట్ ని రిషి చాలా గ్రాండ్ గా నిర్వహించేవాడని, వసు తనకు చాలా సపోర్ట్ గా ఉండేదని ఫణీంద్ర గుర్తు చేసుకుంటాడు. కానీ.. ఇప్పుడు రిషి లేడని, ఎక్కడికి వెళ్లాడో కూడా తెలీదని.. ఆ ఒత్తిడి వసుధారపై చాలా ఎక్కువగా ఉందని.. నువ్వే హెల్ప్ చేయాలి అని శైలేంద్ర తో మరోసారి ఫణీంద్ర చెబుతాడు.
Guppedantha Manasu
వెంటనే దేవయాణి.. ‘ అవునండి. వసుధార రిషి కనపడని దగ్గర నుంచి చాలా టెన్షన్ లో ఉంది. తనకు రిషి అంటే ప్రాణం. అందరినీ ఎదిరించి మరీ ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కనిపించకపోవడంతో.. కాలేజీ పనులు కూడా సరిగా చేయలేకపోతోంది. అలాంటి సమయంలో ఇప్పుడు తను ఫెస్ట్ బాధ్యతలు సరిగా నిర్వహించలేదు. తనకి కాకుండా... మరెవరికి అయినా అప్పగిస్తే బాగుండేది’ అని అంటుంది.
Guppedantha Manasu
దానికి ఫణీంద్ర.. అంటే.. నీ కొడుక్కి అప్పగించమని అడుగుతున్నావా అని అంటాడు. దానికి దేవయాణి.. అందులో తప్పేముంది.. ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే కదా.. వాడు కూడా ఎంత సమర్థుడో తెలిసేది అని అంటుంది. కానీ.. ఫణీంద్ర.. నీ కొడుకు నువ్వు అనుకున్నంత తెలివైన వాడు కాదు.. వాడికి అసలు ఏమీ తెలీదు. చిన్న సమస్య వచ్చినా దానిని సాల్వ్ చేయడం రాదు. మొన్నటికి మొన్న కాలేజీలో స్టూడెంట్స్ అంతా రిషి చనిపోయారని నమ్మి.. గొడవ చేస్తే.. దానిని పరిష్కరించకుండా.. కాలేజీని మూసేద్దాం అని సలహా ఇచ్చాడు. కానీ.. వసుధార జస్ట్ అలా వచ్చి.. ప్రాబ్లమ్ ని చిటికెలో సాల్వ్ చేసిందని ఫణీంద్ర చెబుతాడు. వెంటనే శైలేంద్రను నీకు కూడా.. అలాంటి ఆశలు ఉన్నాయా అని ఫణీంద్ర అడుగుతాడు. దానికి శైలేంద్ర. లేదు డాడ్.. మీరు చేసిందే కరెక్ట్ అంటాడు. అది విన్న ఫణీంద్ర.. చూశావా.. వాడికి లేని ఆశలు నువ్వు నేర్పకు అంటు దేవయాణికి క్లాస్ పీకుతాడు. తర్వాత.. ఫెస్ట్ బాగా జరగాలని, అందరూ వసుధారను మెచ్చుకోవాలని ఫణీంద్ర అంటాడు.
Guppedantha Manasu
ఆ మాటలు విని ధరణి సంతోషిస్తుంది. వెంటనే..దేవయాణి.. ధరణిని.. అక్కడి నుంచి వెళ్లిపోమని వార్నింగ్ ఇస్తుంది. ఇక వసుధార ఇంట్లో నిద్రపోకుండా.. ఫెస్ట్ గురించి స్టూడెంట్స్ కి హింట్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా... వర్క్ చేస్తూ ఉంటుంది. అలా వసు వర్క్ చేస్తూ ఉండటం అనుపమ చూస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు పని చేస్తున్నావ్.. నిద్రపోమ్మని చెబుతుంది. కానీ.. వసు లేదని.. పని ఉందని.. చాలా టెన్షన్ గా ఉందని అంటుంది. దానికి అనుపమ.. ఎందుకు టెన్షన్.. అంతకముందు కూడా నువ్వు ఇలాంటివి చాలా చేశావ్ కదా అని అడుగుతుంది. దానికి వసు.. అప్పుడు రిషి సర్ తన పక్కనే ఉండేవాడని.. ఆయన పక్కన ఉంటే భయం ఉండదని, ఏ తప్పు జరగదని అంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా.. రిషి సర్ వెంటనే సరే చేసేవారని.. రేపు అలా జరుగుతుంని తనకు నమ్మకం లేదు అని అంటుంది. అయితే.. అనుపమ ధైర్యం చెబుతుంది. ప్రోగ్రామ్ మొత్తం చూసి.. బాగా చేశావ్.. అంతా బాగానే జరుగుతుందని సపోర్ట్ ఇస్తుంది.
Guppedantha Manasu
ఇక.. శైలేంద్ర నిద్రపోకుండా వసుధార ను ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. వసు ధైర్యం చూస్తుంటే.. తనకు రిషి ఎక్కడ ఉన్నాడో తెలిసే ఉంటుందనిపిస్తోందని, కానీ ఎక్కడ దాచిందో మాత్రం అర్థం కావడం లేదు అనుకుంటాడు. ఇన్నిరోజులు వసుధార కాలేజీకి రాకపోవడంతో... ఎండీ సీటుకు అనర్హురాలు అని అందరితో అనిపించాను.. కానీ రిషి గాడివాయిస్ విన్న తర్వాత.. అందరూ కామ్ అయిపోయారు అని అనుకుంటాడు. ఈ యూత్ ఫెస్టివల్ సరిగా జరగకుండా ఆపి.. వసుధార ఫెయిల్ అయ్యేలా చేస్తేనే తనకు ఎండీ సీటు దక్కుతుందని అనుకుంటాడు. దాని కోసం ఏం చేయాలని ఆలోచిస్తుండగా.. ధరణి వస్తుంది.
ధరణి రాగానే.. ఎందుకు టెన్షన్ పడుతున్నారని, జీవితంలో ఏదో జరగకూడదని జరుగుతున్నట్లు బయపడుతున్నారని అనిపిస్తోందని అంటుంది. దానికి శైలేంద్ర.. కంగారు ఏం లేదు.. ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను అంటాడు. అదేంటో చెప్పమని.. తాను సలహా ఇస్తాను కదా అంటుంది. దానికి శైలేంద్ర ఆలోచనలో పడతాడు. ధరణి చాలా సార్లు.. తనకు తన కీడు కోరి ఇచ్చిన సలహాలు తనకు ప్లస్ అయ్యిందని.. ధరణి సలహా అడగాలి అనుకుంటాడు. అదే విషయం చెబుతాడు... వసుధార కాలేజీలో యూత్ ఫెస్టివల్ చేస్తోందని చెబుతాడు. దానికి ధరని.. ఆ ఫెస్ట్ ని ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తున్నారా అని అమాయకంగా అడుగుతుంది. అయితే.. శైలేంద్ర కాదని.. తాను వసుధార మేలు కోరుకుంటున్నానని.. అందరూ ఆనందపడేలా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెబుతాడు.
ధరణి వెంటనే.. తనను అడిగితే..వెంటనే ఐడియా ఇస్తాను కదా అని అంటుంది. ఏేంటి అని శైలేంద్ర అడిగితే.. రిషి వస్తున్నాడని చెప్పమని చెబుతుంది. కాసేపు ఆలోచించి.. ఈ ఐఢియా బాగుందని అనుకుంటాడు. ధరణి కూడా మనసులో.. మీరు అలా చెబితే.. నిజంగానే రిషి కాలేజికి వస్తాడని.. మీ కుట్రలను కంట్రోల్ చేస్తాడని, రిషి, వసులు సంతోషంగా ఉంటారని అనుకుంటుంది.
Guppedantha Manasu
ఉదయాన్నే వసుధార కాలేజీకి రెడీ అవుతుంది. అనుపమ బయటకు వెళ్లిందని మహేంద్ర చెప్పడంతో.. తాను కాలేజీలో పని ఉందని.. ముందు వెళతాను అని అంటుంది. వెళ్లే ముందు.. జగతి ఫోటో ముందుకు వెళ్లి.. నమస్కారం చేసుకుంటుంది. కాలేజీ ఫెస్ట్ సరిగా జరిగేలా చూడమని, పొరపాటు జరిగితే.. తనతో పాటు కాలేజీ కి చెడ్డ పేరు వస్తుందని.. అలా జరగకుండా చూడమని, మీ ఆశీస్సులు నాకు అందించండి అని.. జగతికి దండం పెట్టుకుంటుంది. తర్వాత.. మహేంద్ర తో తాను బయలుదేరుతాను అని చెబుతుంది.
Guppedantha Manasu
దానికి మహేంద్ర.. మీ అత్తయ్యను ఏం కోరుకున్నావ్ అని అడుగుతాడు.. విగ్నాలు జరగకుండా చూడమని కోరుకున్నాను అని చెబుంది. అలా చేయమని.. వినాయకుడిని కోరుకుంటారు కదా అని మహేంద్ర అంటే.. జగతి మేడమ్ ని మించిన దైవం తనకు లేరు అని చెబుతుంది. జగతి ఆశీస్సులు కూడా నీకు ఉంటాయి లే అని మహేంద్ర అంటాడు. ఆ సమయానికి జగతి ఫోటో కింద పడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. దీనిని అపశకునంలా చూపించారు. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం...