శివాజీ కూతురితో యావర్ రొమాన్స్... తమ్ముడు అనుకుంటే అల్లుడు అయ్యాడా!

First Published | Jan 26, 2024, 12:27 PM IST


బిగ్ బాస్ సీజన్ 7లో స్పై బ్యాచ్ శివాజీ, యావర్, ప్రశాంత్ బాగా పాపులర్ అయ్యారు. వీరు ఒకరి కోసం మరొకరు అన్నట్లు హౌస్లో ఉన్నారు. అయితే యావర్ ని శివాజీ తమ్ముడిగా ఆదరిస్తే చివరికి అల్లుడు అయ్యాడట... 
 

Bigg Boss Telugu 7


బిగ్ బాస్ తెలుగు 7 సూపర్ హిట్. గతంలో ఎన్నడూ చూడని ఆదరణ లేటెస్ట్ సీజన్ కి దక్కింది. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్, నాగార్జున హోస్టింగ్ ఈ రియాలిటీ షోకి విపరీతమైన ఆదరణ తెచ్చిపెట్టాయి. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, శోభ శెట్టి, ప్రియాంక, రతిక రోజ్ వంటి కంటెస్టెంట్స్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. 
 

Bigg Boss Telugu 7

సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, శోభ, ప్రియాంకలకు పోటీగా స్పై బ్యాచ్ శివాజీ, ప్రశాంత్, యావర్ అవతరించారు. ప్రధాన పోటీ ఈ రెండు గ్రూపుల మధ్య జరిగింది. భాష రాని యావర్, పల్లెటూరికి చెందిన ప్రశాంత్ లకు శివాజీ అండగా నిలిచాడు. వాళ్ళ విజయంలో కీలకం అయ్యాడు. 
 


Bigg Boss Telugu 7

వీరిద్దరినీ సొంత తమ్ముళ్లుగా శివాజీ చూసుకున్నాడు. అదే స్థాయిలో యావర్, ప్రశాంత్ ఆయన్ని గౌరవించారు. గాయం తగిలినప్పుడు శివాజీకి ఇద్దరూ సేవలు చేశారు. స్పై బ్యాచ్ ఫైనల్ కి వెళ్లగా ప్రశాంత్ టైటిల్ కొట్టాడు. యావర్ రూ. 15 లక్షలు తీసుకుని నాలుగో స్థానంలో నిష్క్రమించాడు. ఇక శివాజీ మూడో స్థానంలో నిలిచాడు.

Bigg Boss Telugu 7

బయటకు వచ్చాక కూడా వీరి బంధం కొనసాగుతుంది. తరచుగా కలుస్తున్నారు. అన్నీ కుదిరితే పల్లవి ప్రశాంత్, యావర్ లతో సినిమాలు చేస్తానని శివాజీ చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే అన్న శివాజీకి యావర్ వెన్నుపోటు పొడిచాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది. 

Bigg Boss Telugu 7

5వ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని కూడా శివాజీకి అభిమాని. హౌస్లో ఉంది ఒక్కవారమే అయినా శివాజీతో ఆమెకు అనుబంధం ఏర్పడింది. శివాజీ ఆమెను బిడ్డా అనే వాడు. ఎలిమినేట్ అయిన నయని పావని శివాజీ కోసం సోషల్ మీడియా క్యాంపైన్ చేసింది. 
 

Bigg Boss Telugu 7

శివాజీ-నయని పావని మధ్య తండ్రి కూతుళ్ళ బంధం కనిపిస్తుంది. కాగా నయని పావనితో ఇప్పుడు యావర్ రొమాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. యావర్-నయని పావని సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి 'తెలియదే' అనే ఓ ప్రైవేట్ సాంగ్ చేశారు. ఇది యూట్యూబ్ లో విడుదలైంది. 
 

Bigg Boss Telugu 7

తెలియదే... సాంగ్ ప్రమోషన్ లో భాగంగా రొమాంటిక్ ఫోటో షూట్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలు చూసిన ఓ నెటిజెన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నయని పావనితో రొమాన్స్ చేస్తున్న యావర్ ని శివాజీ చూస్తే... రేయ్ తమ్ముడు అనుకుంటే నాకు అల్లుడు అయ్యేటట్టు ఉన్నావు, అంటాడని కామెంట్ చేశాడు. 

Nayani Pavani

సదరు నెటిజెన్ కామెంట్ వైరల్ అవుతుంది. శివాజీని నయని పావని తండ్రిగా భావిస్తున్న నేపథ్యంలో ఆమెతో సన్నిహితంగా ఉంటున్న యావర్ ని అల్లుడితో నెటిజెన్స్ పోల్చుతున్నారు. అదన్నమాట సంగతి... 

Latest Videos

click me!