హౌజ్‌లో ఆ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్‌, డబ్బుల కోసమే వచ్చా, ఆదిత్య ఓం ఫైర్‌

First Published | Sep 10, 2024, 12:07 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండో వారం నామినేషన్‌లో ఆదిత్య ఓమ్‌లో ఫైర్‌ కనిపించింది. ఫస్ట్ టైమ్‌ ఆయన రెచ్చిపోయాడు. అదే సమయంలో హౌజ్‌లో ఓ జంట మధ్య కెమిస్ట్రీ నడుస్తుందట. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 మొదటి వారం పూర్తయ్యింది. 14 మందితో ప్రారంభమైన ఈ షోలో ఫస్ట్ వీక్‌లో ఒకరు ఎలిమినేట్‌ అయ్యారు. బెజవాడ బేబక్కని ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. కిచెన్‌ కే పరిమితమైన ఆమె తాను పెద్ద తప్పు చేశానంటూ ఎలిమినేట్‌ అయ్యాక వెల్లడించింది.

ఇక ఇప్పుడు రెండో వారం ప్రారంభమైంది. బేబక్క ఎలిమినేట్‌ అయ్యాక ఆమె చేసిన కామెంట్లు, విమర్శలపై రివ్యూ చేసుకున్నారు కంటెస్టెంట్లు. సోనియా నిఖిల్‌తో ఈ విషయాలను చర్చించింది. తనపై చేసే ఆరోపణలను ఆమె ఖండించింది. మరోవైపు కిర్రాక్‌ సీత ఎమోషనల్‌ అయ్యింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్, స్పెషల్స్
 

సెకండ్‌ వీక్‌కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. చీఫ్‌గా అతి పెద్ద క్లాన్‌ కలిగి ఉన్న నేపథ్యంలో యష్మి ఈ నామినేషన్ల నుంచి దూరంగా ఉంది. ఆమెని ఎవరూ నామినేట్‌ చేయడానికి లేదు. మిగిలిన వాళ్లు ఇద్దరిద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో అభయ్‌.. ఆదిత్య ఓం, విష్ణు ప్రియాలను నామినేట్‌ చేశాడు.

సోనియా.. కిర్రాక్‌ సీత, విష్ణుప్రియాలను నామినేట్‌ చేయగా, సీత.. ప్రేరణ, నైనిక నామినేట్‌ చేసింది. మణికంఠ.. ఆదిత్య ఓం, శేఖర్‌ బాషాలను, ఆదిత్య ఓం..అభయ్‌,శేఖర్‌ బాషాలను నామినేట్‌ చేశారు. విష్ణు ప్రియా మణికంఠ, సోనియాలను, శేఖర్‌ బాషా.. మణికంఠ, ఆదిత్యం ఓంలను నామినేట్‌ చేశారు. 
 


ఈ నామినేషన్ల ప్రక్రియలో విష్ణు ప్రియా, సోనియాల మధ్య మరోసారి హాట్‌ హాట్‌ డిస్కషన్‌ జరిగింది. అడల్టరీ జోకులకు సంబంధించిన చర్చనే వచ్చింది. విష్ణుప్రియాకి టాస్క్ లు అర్థం కావని కామెంట్‌ చేసింది సోనియా. దీనికి సంబంధించి గట్టగానే డిస్కషన్‌ జరిగింది. గట్టిగానే తిట్టుకున్నారు.

ఆదిత్య ఓం విషయంలోనూ అదే జరిగింది. ఆయన అందరితో కలవలేకపోతున్నారని శేఖర్‌ బాషా, అభయ్‌ కామెంట్‌ చేయగా, తాను ఇంతే అని, అది అందరికి తెలుసు అంటూ కౌంటర్‌ ఇచ్చి, చివరికి తనదైన స్టయిల్‌లో థ్యాంక్స్ అంటూ నవ్వుతూ తీసుకున్నారు. తానేంటో టైమ్‌ వచ్చినప్పుడు చెబుతా అని, తనకు డబ్బు చాలా ముఖ్యమని, డబ్బు కోసం ఫ్యామిలీని వదిలేసి ఇక్కడకి వచ్చినా, రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు అని వాపోయాడు ఆదిత్య.

ఫైర్ అయ్యాడు ఆదిత్య. అదే సమయంలో సింపతి కోసం ప్రయత్నించాడు. శేఖర్‌ బాషా కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ఆదిత్య ప్రవర్తన కాస్త భిన్నంగానే ఉంది. ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఆయన రియాక్ట్ అవుతున్న తీరు చూసి ఇతర కంటెస్టెంట్లు నవ్వుకోవడం గమనార్హం.  
 

ఇక మొదటి వారం అంతా హీట్‌గా రెండో వారం నామినేషన్లు ప్రక్రియ జరగలేదు. చాలా వరకు సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు. ఎక్కువగా రియాక్ట్ అయితే తమ గురించి తప్పుగా వెళ్తుందో అనే ఇన్‌ సెక్యూరిటీతో కంటెస్టెంట్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆదిత్య కూడా ఓ సందర్భంలోఅదే మాట్లాడాడు. అలానే ఆట ఆడుతున్నారు.

ఇవన్నీ ఓ ఎత్తైతే.. హౌజ్‌లో చాలా సైలెంట్‌గా ఓ కెమిస్ట్రీ వర్కౌట్‌ అవుతుంది. ఓ జంట కలవబోతుంది. పులిహోర కలుపుకుంటున్న ఈ జంట లవర్ కేటగిరిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉంది. వాళ్లు ఎవరో కాదు సోనియా, నిఖిల్‌. ఎప్పుడూ ఈ ఇద్దరు కలిసేలా ఉన్నారు. నిజానికి సోనియానే హింట్‌ ఇస్తుంది.

కానీ నిఖిల్‌ తీసుకోవడం లేదు. ఆయన ట్యూబ్‌ ఎలగడం లేదు. దీంతో ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుంది. కానీ సోనియా మాత్రం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. నిఖిల్‌కి అర్థం కావడం లేదా? లేక తప్పించుకు తిరుగుతున్నాడా? అనేది ఇక్క పెద్ద ప్రశ్న. 
 

సోనియా అందరిలో కలవడం లేదు. ఆమె సెపరేట్‌గా ఉంటుంది. ఇతర లేడీ కంటెస్టెంట్లతో కలిసేందుకు ఆమె సుముఖంగా లేదు. వాళ్లని దూరంపెడుతుంది. తన గ్రూప్‌ వేరే అనేలా ప్రవర్తిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె నిఖిల్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందని అర్థమవుతుంది.

నిఖిల్‌తో మాట్లాడుతున్న తీరు మూవ్‌ అవుతున్న తీరుని చూస్తుంటే కెమిస్ట్రీ బిల్డ్ చేసుకుంటుందని తెలుస్తుంది. అదే సమయంలో పృథ్వీరాజ్‌తోనూ క్లోజ్‌ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి వర్కౌట్‌ అయితే తాను సేఫ్‌గా ఉండొచ్చు అనేది సోనియా ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

అదేసమయంలో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ఇంకా నడుస్తుంది. మంగళవారం ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సారి విష్ణు ప్రియా, నిఖిల్‌, ఆదిత్య ఓం, మణికంఠ, శేఖర్‌ బాషా, పృథ్వీరాజ్‌, కిర్రాక్‌ సీత, నైనిక నామినేషన్ లో ఉండబోతున్నారని, సోనియా..యష్మి పవర్స్ వల్ల తప్పించుకుందని తెలుస్తుంది. దీనిపై రేపు క్లారిటీ రానుంది. 
 

Latest Videos

click me!