ఒక్క వారం బిగ్ బాస్ హౌస్లో ఉన్న బేబక్క ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా?

First Published | Sep 9, 2024, 3:52 PM IST

బిగ్ బాస్ హౌస్లో బెజవాడ బేబక్క సంచలనాలు చేస్తుంది అనుకుంటే, వారం రోజులకే ఎలిమినేట్ అయ్యింది. కాగా బిగ్ బాస్ బేబక్క రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.  
 

సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఎలిమినేటైన సంగతి తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న మొదలైంది. మొదటి వారానికి గానూ నాగ మణికంఠ, విష్ణుప్రియ, పృథ్విరాజ్, శేఖర్ బాషా, సోనియా ఆకుల, బేబక్క నామినేషన్స్ లో ఉన్నారు. 

నామినేషన్స్ లో ఉన్న మిగతా వారితో పోల్చుకుంటే బేబక్క ఫేమ్ తక్కువ. బేబక్క సోషల్ మీడియా స్టార్ మాత్రమే. ఆమెకు పెద్దగా పాపులారిటీ లేదు. అలాగే బేబక్క నామినేషన్స్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆమె నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ విషయంలో స్ట్రాంగ్ రీజన్స్ చెప్పలేకపోయింది. అది ఒక మైనస్ అయ్యింది. 



బేబక్కకు ఒక వర్గంలో పాజిటివిటీ ఉంది. ఆమె మెచ్యూరిటీ గా మాట్లాడుతుంది. సెట్టిల్డ్ గా ఉంటుంది అనే వాదన ఉంది. అయితే బేబక్క ప్రశాంతంగా ఉండటం కూడా బిగ్ బాస్ మేకర్స్ కి నచ్చకపోవచ్చు. కాంట్రవర్సీ కామెంట్స్ తో కంటెంట్ ఇచ్చే వాళ్లకు మాత్రమే మైలేజ్ ఉంటుంది. 

ఏజ్ బార్ అయిన లేడీ కంటెస్టెంట్స్ ని హౌస్లో ఉంచరు. గతంలో కూడా ఇది నిరూపితం అయ్యింది. హేమ, కరాటే కళ్యాణి, షకీలా, కిరణ్ రాథోడ్ తక్కువ వారాల్లోనే ఎలిమినేట్ అయ్యారు. వయసు పైబడిన బేబక్క హౌస్లో టాస్క్ లలో పెద్దగా రాణించలేదు అని మేకర్స్ భావించే అవకాశం ఉంది. నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. చివరికి నాగ మణికంఠ, బేబక్క మిగిలారు. ఉత్కంఠ మధ్య బేబక్క ఎలిమినేట్ అయ్యిందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. 
 

Vishnupriya Bhimeneni


బిగ్ బాస్ హౌస్లో వారం రోజులు ఉన్న బేబక్క రెమ్యూనరేషన్ గా ఎంత తీసుకున్నారనే చర్చ నడుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం బేబక్క రూ. 1.30 లక్షలు తీసుకున్నారట. ఇది మినిమమ్ రెమ్యూనరేషన్. అందరి కంటే తక్కువగా వారానికి రూ. 1.20 లక్షలు నాగ మణికంఠకు ఇస్తున్నారట. 

బెజవాడ బేబక్క ఇష్టపడి బిగ్ బాస్ షోకి వెళ్ళింది. అలాంటి వారు రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయలేరు. హౌస్లోకి వెళితే చాలని భావిస్తారు. తక్కువ మొత్తానికి ఒప్పుకుని బేబక్క బిగ్ బాస్ షోకి వెళ్లారట. ఇక అత్యధికంగా విష్ణుప్రియ ఛార్జ్ చేస్తుందట. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

విష్ణుప్రియకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని రెండు మిలియన్స్ వరకు ఫాలో అవుతున్నారు. యాంకర్ కమ్ యాక్ట్రెస్. ఈ క్రమంలో విష్ణుప్రియ గట్టిగా డిమాండ్ చేసిందట. విష్ణుప్రియ వారానికి రూ. 4 లక్షలు తీసుకుంటుందట. ప్రస్తుతానికి విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ అని చెప్పొచ్చు. 

ఆమె ఖచ్చితంగా ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంది. నటుడు ఆదిత్య ఓం సైతం పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. అతడు వారానికి రూ. 3 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టాడట. గతంలో ఆదిత్య ఓం హీరోగా పలు చిత్రాల్లో నటించారు. మిగతా కంటెస్టెంట్స్ లో పలువురు రూ. 2 నుండి 2.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. 

Latest Videos

click me!