
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో కాంచన మాట్లాడిన మాటలను గుర్తుచేసుకొని బాధపడుతుంటాడు శ్రీధర్. టాబ్లెట్ వేసుకో నాన్న అంటూ స్వప్న, తండ్రి దగ్గరకు వస్తుంది. ఇలా కూర్చో అంటాడు శ్రీధర్. ఏమైంది నాన్న అంటుంది స్వప్న. నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు శ్రీధర్.
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న అంటుంది స్వప్న. అదే కాశీ విషయంలో నేను తప్పు చేశానని మీ పెద్దమ్మ చెప్పింది కదా. నువ్వు కూడా అనుకుంటున్నావా అని అడుగుతాడు శ్రీధర్. లేదు నాన్న. కాశీ తప్పు చేశాడు. తన ప్రవర్తన మారిపోయింది అంటుంది స్వప్న.
మీరు తప్పు చేయలేదు నాన్న. నాపై ప్రేమతో నాకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అనుకున్నారు. కానీ అది కాశీకి అర్థం కాలేదు. ఇప్పుడు అందరం బాధపడాల్సి వస్తోంది. నా వల్లే మీకు ఇన్ని బాధలు అని ఏడుస్తూ తండ్రి ఒడిలో పడుకుంటుంది స్వప్న. కాశీ తిరిగి వస్తాడు. నువ్వు బాధపడకు అంటాడు శ్రీధర్. కాశీ మీద నాకు నమ్మకం పోయింది నాన్న. నేను చేసిన ప్రతి ప్రేమ టెస్టులో మీరే గెలిచారు. కాశీ ఓడిపోయాడు అంటుంది స్వప్న. కూతురిని ఓదార్చుతాడు శ్రీధర్. వీరి ఇద్దరి మాటలను దూరంగా ఉండి వింటుంది కావేరి.
మరోవైపు కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది దీప. కార్తీక్, దశరథ రాగానే సుమిత్ర అమ్మ గారికి ఎలా ఉంది అని అడుగుతుంది. ఏం కాలేదమ్మా. అంతా బాగానే ఉంది అని చెప్పి లోపలికి వెళ్తాడు దశరథ. అదేంటి? ఏదో సమస్య ఉందని అన్నారు కదా అని కార్తీక్ ని అడుగుతుంది దీప. మీ అమ్మకు ఏం కాలేదు. అంతా బాగానే ఉంది. అయినా నువ్వు కిచెన్ లో హాయిగా వంట చేసుకోకుండా ఇక్కడ కూర్చొని ఎందుకు టెన్షన్ పడుతున్నావు. పదా లోపలికి వెళ్దాం అని అంటాడు కార్తీక్.
లోపలికి వెళ్లగానే మీ మామయ్యకు ఏమైంది? రిపోర్ట్స్ లో ఏం వచ్చింది అని అడుగుతుంది సుమిత్ర. ఏం కాలేదు అత్తా. అంతా బాగానే ఉంది అంటాడు కార్తీక్. బావ ఎందుకు అంత బాధగా ఉన్నాడని మనసులో అనుకుంటుంది దీప. రిపోర్ట్స్ ఏంటి అసలు ఏం జరుగుతోంది అని అడుగుతాడు శివన్నారాయణ. ఏం లేదు తాత. అత్త, మామయ్య 6 నెలలకు ఒకసారి చేయించుకునే జనరల్ చెకప్ చేయించుకున్నారు. వాటి గురించి అత్త అడుగుతోంది అంటాడు కార్తీక్.
సరే.. రిపోర్ట్స్ ఏవి ఒకసారి ఇవ్వు నేను చూస్తాను అంటాడు శివన్నారాయణ. ఎందుకు అని కంగారు పడతాడు కార్తీక్. సెకండ్ ఒపినియన్ తీసుకుంటాను అంటాడు శివన్నారాయణ. మాకు రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ చాలా పెద్ద స్పెషలిస్ట్. అయినా దాంట్లో ఏం లేదు. మామయ్యకు డి విటమిన్ లోపం ఉందట. మార్నింగ్ 7-10 ఎండలో వాకింగ్ చేయమన్నారు. అత్తకు బ్లెడ్ తక్కువగా ఉందట. ఆకుకూరలు తినమన్నారు. కొన్ని మందులు ఇచ్చారు అని చెప్తాడు కార్తీక్.
నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉందిరా. లోపల ఏదో పెట్టుకొని బయటకు ఇంకేదో చెప్తున్నట్లు అనిపిస్తోంది అంటాడు శివన్నారాయణ. కరెక్ట్ గానే అంచనా వేశావు తాత. ఈ రెండు రోజుల్లో అత్త వ్యాధి గురించి చెప్పి మిమ్మల్ని మానసికంగా ప్రిపేర్ చేయాలి అని మనసులో అనుకుంటాడు కార్తీక్.
సరే ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వు. నేను ఒకసారి చూస్తా అంటాడు శివన్నారాయణ. నేను చదువుకోలేదా ఏంటి? ఆ మాత్రం ట్యాబ్లెట్స్ నాకు తెలియవా? ఎవ్వరికి ఏం కాలేదు హ్యాపీగా ఉండండి అంటాడు కార్తీక్. బావ ఏదో దాస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. వాడు సంతోషంగానే ఉన్నాడు. నా మనుమడిని జైలుపాలు చేసిన బాధ కొంచెం కూడా లేదు వీడికి అంటుంది పారు.
నువ్వు బంధాల గురించి మాట్లాడుతావు అంతే. కార్తీక్ బంధాల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. కాశీ తప్పు చేశాడు. శిక్ష అనుభవిస్తున్నాడు. వదిలెయ్ అంటాడు శివన్నారాయణ. నా మనుమడిని జైలు పాలు చేసి మీరు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది పారు.
కార్తీక్ ని ఇలా రా అని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడుతుంది సుమిత్ర. కిచెన్ లోకి వెళ్లి పాయసం తెచ్చి తినిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు అత్త ఇవన్నీ అని అడుగుతాడు కార్తీక్. నీకు ఇష్టం అని చేశాను. నాకు ఎందుకో నచ్చిన వాళ్ల కోసం నచ్చినవన్నీ చేయాలి అనిపిస్తుంది. అందరినీ కలవాలి అనిపిస్తోంది. అన్నీ చూడాలి అనిపిస్తోంది అని మాట్లాడుతుంది సుమిత్ర. ఎమోషనల్ అవుతాడు కార్తీక్. గమనిస్తూ ఉంటుంది దీప.
మరోవైపు ఆఫీసులో కూర్చొని కాఫీ తాగుతుంటాడు శ్రీధర్. నాకు మళ్లీ నా స్థానం దక్కిందంటే నా కొడుకే కారణం అనుకుంటాడు. కార్తీక్ కోసం ఏదైనా చేయాలి అనుకుంటాడు. ఆలస్యమెందుకు జ్యోత్స్న తప్పు చేసినట్లు ప్రూఫ్స్ ఉన్నాయి కదా వాటిని మామయ్య గారికి ఇస్తే సరిపోతుంది అనుకుంటాడు. వాటి కోసం వెతికితే ఎక్కడ దొరకవు.
ఎవరో కావాలనే ప్రూఫ్స్ మాయం చేశారు. అయినా వీటిని తీయాల్సిన అవసరం ఎవరికి అంటుంది అని జ్యోత్స్నను గుర్తు చేసుకుంటాడు శ్రీధర్. అంటే నేను లేనప్పుడు జ్యోత్స్న ఆఫీసుకు వచ్చిందా? అయినా ఈ విషయం తనకు ఎలా లీక్ అయింది? ఇప్పుడు నేను ఏం చేయాలి అని తల పట్టుకుంటాడు శ్రీధర్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.