Karthika Deepam 2 Today Episode:జ్యోకు పారు టార్చర్-జ్యో మెడలో తాళి క‌ట్టిన కార్తీక్‌-కాంచ‌న కంగారు

Published : Apr 15, 2026, 08:58 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 15వ తేదీ)లో జ్యోకు సపోర్ట్ గా మాట్లాడిన దీప. పారును రెచ్చగొట్టిన కార్తీక్. జ్యోను టార్చర్ చేసిన పారు. జ్యోత్స్న మెడలో తాళికట్టిన కార్తీక్. ఉలిక్కిపడి లేచిన కాంచన. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

PREV
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న మాటలను గుర్తు చేసుకొని, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది దీప. అప్పుడే వచ్చిన కార్తీక్, ఇంకా జ్యోత్స్న గురించే ఆలోచిస్తున్నావా? అంటాడు. మన గురించి జ్యోత్స్నకు నిజం తెలుసని నాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది దీప. ఏం చెప్పాలి? తను డీఎన్ఏ టెస్టు చేయించి మరీ తెలుసుకుంది. 

ఆ రోజు పార్టీలో నిన్ను చంపడానికి కేక్ లో విషం కలిపింది. నేను చూశాను కాబట్టి కేకు మార్చాను అని చెప్తాడు కార్తీక్. జ్యోత్స్నకు నువ్వంటే ప్రేమ పోలేదు బావ అంటుంది దీప. అయినా తను నిన్ను కోరుకోవడంలో తప్పులేదు అని జ్యోత్స్నకు సపోర్ట్ గా మాట్లాడుతుంది దీప. ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు. అని తల పట్టుకుంటాడు కార్తీక్.

26
జ్యోత్స్నకు దీప సపోర్ట్

జ్యోత్స్న తన మెడలో తాళి కట్టమని... గన్ పట్టుకొని మరీ నన్ను బెదిరించింది. కాల్చుకుంది కూడా, జస్ట్ లో మిస్ అయింది అని చెప్తాడు కార్తీక్. షాక్ అయిన దీప.. తను నిన్ను ప్రేమిస్తోంది, నీతో బతకాలని అనుకుంటోంది. ఒక ఆడదానిగా ఆలోచిస్తే తను మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదు అంటుంది దీప. అయితే నన్ను వదులుకుంటావా అని అడుగుతాడు కార్తీక్.

ఎందుకు వదులుకుంటా... కానీ జ్యోత్స్నను అలా తయారు చేసిన పెద్దవాళ్లదే తప్పు. బావే నీ భర్త అని చెప్పి చెప్పి తన మైండ్ పాడు చేశారు అంటుంది దీప. పారిజాతం గారు జ్యోత్స్న మనసు మారిస్తే బాగుండు.. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్తే బాగుండు అంటుంది దీప. నీకు కావాల్సిందే అదే కదా అని పారుకు ఫోన్ చేస్తాడు కార్తీక్.

36
పారును రెచ్చగొట్టిన కార్తీక్

ఫోన్ లిఫ్ట్ చేసిన పారు.. నేనే నీకు ఫోన్ చేయాలి అనుకుంటున్నాను అంటుంది. ఎందుకు నువ్వు కూడా దీపను తిడతావా? జ్యోత్స్న, దీపను తిట్టింది. దీప ఏడుస్తోంది. ఎంతైనా నా భార్య ఒక అనాథ. ఎవ్వరూ లేరనే కదా తనని ఇలా ఏడిపిస్తున్నారు అని పారు రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు కార్తీక్. దీప అనాథ కాదు, తనకి నేనున్నాను అంటుంది పారు. దీపను ఏడిపించిన జ్యోత్స్నను నేను నిద్ర పోనివ్వను అంటూ ఊగిపోతుంది.

46
పారు టార్చర్

దీప కొట్టిన చెంపదెబ్బను గుర్తుచేసుకొని కోపంగా పడుకోబోతుంది జ్యోత్స్న. తిరిగి చూసేసరికి పారు అక్కడే ఉంటుంది. షాక్ అయిన జ్యోత్స్న.. నువ్వెప్పుడు వచ్చావు అంటుంది. ఇందాకే వచ్చాను లే కానీ ఈ రోజు రాత్రి మనం పడుకోకూడదు. కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అంటుంది పారు. నన్ను ఇలా టార్చర్ చేయమని దీప నిన్ను పంపించిందా అని అడుగుతుంది జ్యో. తను అనాథ కదా.. అని ఒత్తిపట్టి పలుకుతుంది పారు. ఇన్ఫర్మేషన్ బాగానే అందిందే అంటుంది జ్యోత్స్న. పొద్దున్నే మనం బయటకు వెళ్లాలి రెడీగా ఉండమని చెప్పి వెళ్లిపోతుంది పారు.

56
కాంచన పీడ కల

మరోవైపు ఒక గుడిలో జ్యోత్స్న మెడలో తాళి కడతాడు కార్తీక్. అలా జరగడానికి వీల్లేదు అని ఉలిక్కిపడి లేస్తుంది కాంచన. తెల్లవారుజామున ఇలాంటి కల వచ్చింది ఏంటి? ఏం జరగబోతుంది అని కంగారు పడుతుంది కాంచన. నానమ్మ అరుపులకు నిద్ర లేచిన శౌర్య.. ఏమైందని అడిగి కాంచనకు వాటర్ ఇస్తుంది. 

66
కాంచన కంగారు

తెల్లవారాక తనకు వచ్చిన కల గురించి శ్రీధర్ తో చెప్తుంది కాంచన. ఇంత విచిత్రమైన కల నాకు ఎప్పుడు రాలేదు అంటాడు శ్రీధర్. ఇంతకీ నీకు వచ్చిన కల ఏంటమ్మా అని అడుగుతాడు కార్తీక్. నువ్వు జ్యోత్స్న మెడలో తాళి కట్టినట్లు మీ అమ్మకు కల వచ్చిందంట్రా అని చెప్తాడు శ్రీధర్. ఊరుకో అమ్మ నువ్వు నీ భయాలు అంటాడు కార్తీక్. ఇక్కడ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే కార్తీక్ పై జ్యోత్స్నకు ఇంకా ప్రేమ ఉంది. అందుకే అగ్రిమెంట్ పేరుతో తన దగ్గర పెట్టుకుంది. కానీ కార్తీక్, జ్యోత్స్న మెడలో తాళి కట్టడమన్నది ఎప్పటికీ కలే అంటాడు శ్రీధర్.

తెల్లవారుజామున వచ్చిన కల నిజమవుతుందని అంటారు కదా అంటుంది కాంచన. ఊరుకో అమ్మ అంటాడు కార్తీక్. వారసత్వపరంగా చూసుకున్నా మా నాన్నకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మీ నాన్నకు కూడా రెండు పెళ్లిళ్లు అయ్యాయి అంటుంది కాంచన. అలా అయితే మామయ్య కూడా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి కదా అంటాడు కార్తీక్. నువ్వు ఇలాంటి భయాలన్నీ పెట్టుకోకు అమ్మా.. నేను దీపను పెళ్లి చేసుకున్నాను అంతే.. అంటూ పక్కకు తిరిగి చూస్తాడు కార్తీక్. అప్పటికే వాళ్ల మాటలు వింటున్న దీప.. పక్కకు వెళ్లిపోతుంది. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories