Bigg Boss Telugu 7: షాకింగ్ ట్విస్ట్, బిగ్ బాస్ అశ్వినికి పెళ్లి అయ్యిందా... భర్త ఎవరు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?

First Published | Nov 11, 2023, 7:59 PM IST

బిగ్ బాస్ అశ్వినికి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అశ్వినికి ఆల్రెడీ పెళ్లైందట. ఇంత వరకు రహస్యంగా ఉన్న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందంటూ కథనాలు వెలువడుతున్నాయి. 
 

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 7లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు హౌస్ మేట్స్ లో అశ్విని శ్రీ ఒకరు. అశ్విని శ్రీ మొదట్లో తడబడింది. నామినేషన్స్ లో కూడా కరెక్ట్ గా పాయింట్స్ చెప్పలేక తోటి కంటెస్టెంట్స్ దాడికి గురైంది. ప్రియాంక, శోభ తరచుగా ఈమెకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. 
 

Bigg Boss Telugu 7

గత రెండు వారాలుగా ఆమె ఆట మెరుగైంది. అశ్విని కొందరితో మాత్రమే స్నేహంగా ఉంటుంది. భోలేతో ఆమెకు స్నేహం కుదిరింది. వీరిద్దరూ చాలా క్లోజ్.ఇక అశ్విని కెరీర్ పరిశీలిస్తే వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అశ్విని హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చారు. చిన్నాచితకా చిత్రాల్లో నటించినా బ్రేక్ రాలేదు. 


Bigg Boss Telugu 7

సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ రష్మిక మందాన అక్క పాత్ర చేసింది. ట్రైన్ సీన్ లో అశ్వినిని మనం చూడొచ్చు. అలాగే రాజా ది గ్రేట్ మూవీలో కూడా దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెకు ఓ పాత్ర ఇచ్చాడు. హీరోయిన్ గా ఎదగాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. మంచి హైట్, రూపం కలిగిన అశ్విని హీరోయిన్  మెటీరియల్ అనడంలో సందేహం లేదు. 

Bigg Boss Telugu 7


అనూహ్యంగా ఆమెకు బిగ్ బాస్ హౌస్లో ఛాన్స్ దక్కింది. ఈ పాప్యులర్ షో కారణంగా అశ్విని గురించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత జీవితం మీద ఓ వార్త వైరల్ అవుతుంది. 

Bigg Boss Telugu 7

అశ్వినికి ఆల్రెడీ  పెళ్లి అయ్యిందట. 2013లో తల్లిందండ్రులు పెళ్లి చేశారట. అయితే భర్తతో ఆమెకు విబేధాలు తలెత్తాయట. ఆ కారణంగా విడాకులు తీసుకుని విడిపోయిందట. భర్తకు దూరమయ్యాక మరలా ఆమె కెరీర్ మీద ఫోకస్ పెట్టారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

Bigg Boss Telugu 7

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ వారం భోలే ఎలిమినేట్ కానున్నాడని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అశ్వినికి దెబ్బ పడినట్లే. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ ని మిస్ అవుతుంది. భోలే వెళ్ళిపోతే అశ్విని ఒంటరి అవుతుంది అనడంలో సందేహం లేదు. 

Latest Videos

click me!