Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు

Published : Apr 02, 2026, 09:44 AM IST

Illu Illalu Pillalu April 2 Episode: ఎప్పుడెప్పుడు వల్లి బాగోతం బయటపడుతుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇన్నాళ్లకు ఆ భాగ్యం దక్కింది. శ్రీవల్లి పాపాలు పండి మొత్తం విషయం ఆమె భర్త చందుకి కూడా తెలిసిపోయింది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
చందుకు వల్లిపై అనుమానం

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. శ్రీరామనవమికి అందంగా రెడీ అయి తన తల్లికి ఫోన్ చేస్తుంది. ‘అమ్మా మన ప్లాన్ సక్సెస్ అయింది. ప్రేమ ఫోన్లో ఉన్న ఆడియో రికార్డింగ్ డిలీట్ చేసేసాను’ అని చెబుతుంది. దానికి భాగ్యం నా కూతురువి అనిపించావే, ఆ ఆడియో అడ్డుపెట్టుకొని నీతో ఎన్ని ఆడుకున్నారో అంటూ నర్మదా, ప్రేమలని తిడుతుంది. త్వరగా శ్రీరామనవమికి మా ఇంటికి వచ్చేయండి, వారిద్దరికీ చుక్కలు చూపించేద్దాం అంటుంది వల్లి. ఇలా ఫోన్ మాట్లాడి అలా తిరిగేసరికి ఆమె వెనకే భర్త చందు కోపంగా చూస్తూ ఉంటాడు. దీంతో ఒక్కసారిగా వల్లి భయపడిపోతుంది. చందు నీతో మాట్లాడాలి అని అంటాడు. దాంతో వల్లికి భయం పట్టుకుంటుంది. శ్రీవల్లి చేయి పట్టుకొని ఇంటి పెరట్లోకి లాక్కొస్తాడు చందు.

24
ప్రేమను ఇరికించిన వల్లి

చందు.. వల్లి చేత నిజాలు చెప్పిస్తాడని ప్రేమకు ముందే అర్థమవుతుంది. వెంటనే ఇంట్లో ఉన్న అమూల్య దగ్గరికి వెళ్లి మీ అన్నయ్య చందు పెరట్లో ఉన్నాడు నిన్ను పిలుస్తున్నాడు అని చెబుతుంది. అమూల్య.. చందుని వెతుక్కుంటూ పెరట్లోకి వస్తుంది. ఆ సమయానికి చందు శ్రీవల్లిని ‘నువ్వు నా దగ్గర ఏ విషయాలు దాచావో చెప్పు. అమూల్యను ఆ విశ్వక్ ను ప్రేమించమని చెప్పింది ఎవరు? మా నాన్న హాస్పిటల్ పాలవడానికి కారణం ఎవరు? చెప్పు’ అని గట్టిగా అడుగుతాడు. దానికి వల్లి తనకేమీ తెలియదని అబద్ధాలు ఆడుతుంది. దానికి చందు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నీకు తెలియదంటే నమ్మను మర్యాదగా చెబుతావా లేదా అంటూ కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. సరిగ్గా అదే సమయానికి నర్మద, ప్రేమ కూడా అక్కడికి వస్తారు. శ్రీవల్లి‘ చెప్పేస్తాను బావా.. ప్రేమే ఇదంతా చేసింది. విశ్వను ప్రేమించమని అమూల్యకి చెప్పింది’ అని అంటుంది. అప్పుడే వచ్చిన అమూల్య కూడా వినేస్తుంది. 

‘పుట్టింటి వాళ్ల గురించి ఆలోచించే ప్రేమ.. అమూల్యకు విశ్వను ప్రేమించమని చెప్పింది. వాళ్ళ మధ్య ప్రేమ రాయబారం నడిపింది’ అంటుంది. అంతే కాదు దేవుని తోడు అంటూ ఒట్టు కూడా పెట్టేస్తుంది. అమూల్య జీవితం నాశనం అవ్వడానికి ప్రేమే కారణం అంటుంది వల్లి. ఇది వినేసిన అమూల్య వదినా అంటూ గట్టిగా అరుస్తూ వస్తుంది. దాంతో రీవల్లి భయపడి వెనక్కి తిరుగుతుంది. ఇదేంటి ఇలా అడ్డంగా దొరికిపోయాను అనుకుంటుంది.

34
వల్లి బాగోతం బట్టబయలు

ఇక అమూల్య అక్కడికి వచ్చి వల్లితో ‘నువ్వు అసలు మనిషివేనా నీకు బుద్ధి ఉందా? నీ కాపురంలో సమస్యలు వస్తాయని ఆలోచించి నువ్వు చేసిన పని ఎవరితోనీ చెప్పొద్దని నర్మద, ప్రేమ దగ్గర మాట తీసుకున్నాను. కానీ నువ్వు మాత్రం ప్రేమ వదిన పైకి తోసేస్తావా? జీవితాలు నాశనం చేస్తావా?’ అంటూ గట్టిగానే అడుగుతుంది. అయినా శ్రీవల్లి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమూల్య నాకేం పాపం తెలియదు అని అంటుంది. వెంటనే చందు కల్పించుకొని అమూల్య నువ్వు చెప్పు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు అమూల్య మొత్తం జరిగిందంతా చెప్పేస్తుంది. విశ్వక్ తో ప్రేమకు, ఇంట్లోంచి వెళ్లి పోవడానికి అన్నిటికీ కారణం వల్లి అని చెప్తుంది. అంతేకాదు అర్ధరాత్రి పెళ్లి ఇంట్లోంచి తీసుకెళ్లి విశ్వక్ దగ్గరికి తీసుకెళ్లింది కూడా వల్లియేనని వివరిస్తుంది. దాంతో చందు షాక్ అవుతాడు. 

అదే సమయానికి ప్రేమ నర్మదా కల్పించుకుంటారు. నర్మద మాట్లాడుతూ ‘మా గురించి మీ తమ్ముళ్ళతో మీ భార్యలు ఎలాంటి వాళ్లో తెలుసుకోకుండా వాళ్ళతో ఎలా సంసారం చేస్తారని మీరు అడిగారు కదా బావ.. మీ భార్య గురించి కూడా మీకు తెలియాలని ఇలా చేసాం. ఇక ఏం నిర్ణయించుకుంటారో మీ ఇష్టం’ అని అంటుంది నర్మద.

44
పుట్టింట్లో వదిలేసిన చందు

ఇక్కడి నుంచి సీన్ వేదవతి దగ్గరికి మారుతుంది. వేదవతి పూజకు రెడీ చేస్తుంది. శ్రీరామనవమికి పూజ చేసేందుకు పంతులు కూడా వస్తారు. కాసేపు రామరాజు వేదవతి ఫన్నీ గొడవలు పడతారు. ఇక్కడ నుంచి సీన్ మళ్ళీ చందు దగ్గరికి మారుతుంది. చందు గదిలో వల్లి బట్టలను సర్దుతాడు. చీరలన్నీ బ్యాగ్ లో పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోమని చెబుతాడు. కానీ వల్లి మాత్రం ఏడుస్తూ ప్రేమకు, నర్మదకు తాపంటూ ఇష్టం లేదని, కుట్రలు చేసి పచ్చని సంసారంలో నిప్పులు పోసారని ఏదేదో చెబుతుంది. దానికి చందు నీ చదువు అబద్దమని, సర్టిఫికెట్స్ మోసమని, వాళ్లు నీపై మోసం కుట్ర చేశారంటానికి ఆధారాలు ఉన్నాయా? అని అడుగుతాడు.వల్లి ఎంత ఏడ్చినా కూడా పట్టించుకోకుండా తీసుకెళ్లి వాళ్ళ పుట్టింటి దగ్గర దించుతాడు.

వల్లి ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు లేకుండా బతకలేనని చెబుతుంది. అయినా చందు ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమెను అక్కడే వదిలేసి వచ్చేస్తాడు. వల్లి పుట్టింటికి వెళుతుంది. అక్కడ భాగ్యం, ఇడ్లీ బాబాయి వల్లిని చూసి ఆనందపడతారు. పూజకి లేటుగా వస్తున్నామని నువ్వే తీసుకెళ్లడానికి వచ్చావా అని అడుగుతారు. వల్లి కోపంతో బ్యాగు విసిరేసి మీరు నోట్లోంచి ఒక్క మాట వచ్చినా చంపేస్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories