బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జునకు భారీ రెమ్యునరేషన్? ఐదు సీజన్స్ కలిపి ఎంత ఇచ్చారంటే?

First Published Jan 2, 2024, 7:05 AM IST

బిగ్ బాస్ షోకి నాగార్జున ఒక ఆకర్షణ. గత ఐదు సీజన్స్ నుండి ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఆయనకు బిగ్ బాస్ యాజమాన్యం భారీగా చెల్లిస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 
 

Nagarjuna

తెలుగులో బిగ్ బాస్ సూపర్ హిట్. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా ఫస్ట్ సీజన్ ప్రసారం అయ్యింది. ఎన్టీఆర్ హోస్ట్ గా బెస్ట్ అనిపించుకున్నారు. ఇక సినిమాలు ఇతర కమిట్మెంట్స్ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆ బాధ్యత నుండి తప్పుకున్నారు. 
 

Nagarjuna

సీజన్ 2 హోస్టింగ్ బాధ్యతలు హీరో నాని చేపట్టారు. నాని హోస్టింగ్ కి మిశ్రమ స్పందన దక్కింది. తనపై విమర్శలు కూడా వినిపించాయి. దాంతో నాని హోస్టింగ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. గతంలో నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు? షోకి హోస్టింగ్ చేసి ఉన్నారు. 

Latest Videos


Nagarjuna

ఈ క్రమంలో నాగార్జునను ఎంపిక చేశారు. సీజన్ 3 నుండి ఆయన వరుసగా బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నారు. ఆయన సారథ్యంలో షో మంచి టీఆర్పీ రాబడుతుంది. ఒక్క సీజన్ 6 మినహాయిస్తే అన్ని సీజన్స్ విజయం సాధించాయి. సీజన్ 7 అయితే బ్లాక్ బస్టర్. 

Nagarjuna

కాగా బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున రెమ్యునరేషన్ ఎంత? సీజన్ కి ఆయన ఎంత తీసుకుంటున్నారు? అనే సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దాని ప్రకారం బిగ్ బాస్ షో యాజమాన్యం నాగార్జునకు భారీగానే చెల్లిస్తున్నారు. 

Nagarjuna

గత ఐదు సీజన్స్ కి హోస్టింగ్ చేసిన నాగార్జున మొత్తంగా రూ. 140 కోట్లు తీసుకున్నాడని సమాచారం. అంటే సరాసరిన ఒక సీజన్ కి నాగార్జున రూ. 28 కోట్లు తీసుకుంటున్నారు. సినిమా రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా ఎక్కువ. నాగార్జున ప్రస్తుత మార్కెట్ రీత్యా ఆయన రెమ్యూనరేషన్ కనీసం పది కోట్లు కూడా లేదు. 

కానీ బిగ్ బాస్ హోస్ట్ గా దాదాపు ముప్పై కోట్ల వరకు తీసుకుంటున్నారట. దీనిపై స్పష్టమైన సమాచారం లేకున్నప్పటికీ వైరల్ అవుతుంది. మరోవైపు ఈ షో బ్యాన్ చేయాలనే డిమాండ్ ఉంది. సాంప్రదాయవాదులు విమర్శలు చేస్తున్నారు. హోస్ట్ గా నాగార్జున విమర్శలపాలవుతున్నారు. 

Nagarjuna


నాగార్జున ఇంటి ఎదుట ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా నాగార్జున షో వదల్లేదు. సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడం, అన్నపూర్ణ స్టూడియో ఎదుట అల్లర్లు ఈ షో పరువు మరింత తీశాయి. మరి సీజన్ 8కి కూడా నాగార్జున హోస్ట్ గా ఉంటారా? లేదా? అనేది చూడాలి... 

click me!