
GuppedanthaManasu 5th February Episode:గుప్పెడంత మనసు సీరియల్ కి రిషినే ఆయువుపట్టు. కానీ... చాలా కాలంగా రిషి అనే క్యారెక్టర్ అసలు కనిపించడం లేదు. కిడ్నాప్ అయ్యాడని కొన్నాళ్లు.. దెబ్బలు తగిలాయమని మరి కొంత కాలం క్యారెక్టర్ ని హైడ్ చేశారు. ఈ సారి ఏకంగా ఆ క్యారెక్టర్ ని చంపేసేందుకు ప్లాన్ చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రోజు ఎపిసోడ్ లో అలాంటి సంకేతాలే ఇచ్చారు. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం..
భద్ర తప్పించుకున్నాడనే వార్త.. శైలేంద్ర చెవిన పడుతుంది. అయితే.. ఈ విషయం తెలియని దేవయాణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ భద్ర గాడు నోరు తెరిస్తే.. మనం చేసిన దుర్మార్గాలన్నీ బయటకు వచ్చేస్తాయని.. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని కంగారుపడుతూ ఉంటుంది. కానీ.. శైలేంద్ర వచ్చి.. టెన్షన్ పడకు మమ్మీ.. ఆ భద్ర నోరు విప్పడు అని అంటాడు. ఎందుకు..వాడిని చంపేశావా అని దేవయాణి సంబరంగా అడిగితే... కాదు.. ముకుల్ నుంచి తప్పించాను అని చెబుతాడు. అది విని.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది.
సరే.. భద్ర అంటే తప్పించుకున్నాడు.. కానీ ఆ వసుధారను ఏం చేస్తావ్.. ఎంత కాలం అని ఎండీ సీటు కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఆ వసుధార ప్రతి విషక్ష్ంలో మనకు అడ్డుగా ఉంది కదా అని దేవయాణి అడుగుతుంది. ఆ వసుధార గుండె పగిలిపోయే ప్లాన్ ఒకటి వేశాను మామ్ అంటాడు. ఏంటో చెప్పమని దేవయాణి అంటే.. ఇప్పుడే కాదని.. ప్రస్తుతం అయితే.. భద్ర తప్పించుకున్నాడనే సంతోషకరమైన వార్తను ఆనందిద్దాం.. అని తల్లిని తీసుకొని వెళతాడు.
ఇదంతా దూరం నుంచి ధరణి వింటుంది. భద్ర దొరికాడని సంబరపడేలోగా ఇలా జరిగిందేంటి అని అనుకుంటుంది. భద్ర దొరికితే.. వీళ్ల పాపలన్నీ బయటపడతాయని అనుకున్నాను.. కానీ వెంటనే తప్పించుకున్నాడు అని అనుకుంటుంది. అయినా ఆ దేవుడు ఉన్నాడని.. ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నా.. ఏదో ఒక రోజు మీ పాపాలకు తగిన శిక్షలు పడటం ఖాయం అని శాపాలు పెడుతుంది.
సీన్ కట్ చేస్తే.. భద్ర తప్పించుకున్నాడనే విషయం తెలిసి మహేంద్ర, వసుధార, అనుపమలు షాకౌతారు. ఎలా తప్పించుకున్నాడు అని అనుపమ అడిగితే... కానిస్టేబుల్ ని కాపలా కూడా పెట్టానని..కానీ ఎలా తప్పించుకున్నాడో అర్థం కావడం లేదు అని ముకుల్ చెబుతాడు. భద్ర దొరికాడని.. రిషి గురించి సమాచారం తెలుస్తుందని మేమంతా ఆనందపడుతుంటే.. ఇలా జరిగిందేంటి అని అనుపమ అంటుంది.
ఈ లోగా.. ముకుల్.. ఇంతకన్నా మరో ముఖ్యమైన విషయం ఉందని చెబుతాడు. ఎంటది అని వీళ్లు అడిగితే..హాస్పిటల్ లో ఓ బాడీని గుర్తుపట్టాలి అని అంటాడు. ఆ మాట విని.. వసుధార, మహేంద్రలు షాకౌతాడు. డెడీ బాడీ ఏంటి..? గుర్తుపట్టడం ఏంటి..? అంతకముందు కూడా ఒకసారి ఇలానే చేశారు అని వసుధార ఆవేశపడుతుంది. మహేంద్ర కూడా.. తన కొడుకు రిషికి ఏమీ కాదు అని.. అది ఇంకెవరిదో అని అంటాడు. వసుధార కూడా.. తనకు రిషి సర్ అంటే ప్రాణం అని.. తన గుండె ఇంకా కొట్టుకుంటోంది అంటే.. రిషి సర్ క్షేమంగా ఉన్నారనే అర్థం అని ఏడుస్తుంది.
చక్రపాణి కూడా ముకుల్ ని ప్రాధేయపడతాడు. తన అల్లుడు బంగారం అని చెబుతాడు. రాక్షసుడిలాంటి తనను మార్చింది.. తన కూతురి ప్రేమేనని.. వాళ్ల ప్రేమ మీద తనకు దేవుడి మీద ఉన్నంత నమ్మకం ఉందని అంటాడు. తన అల్లుడిగారికి ఏమీ కాదు అని అంటాడు.
అయితే.. అప్పుడే ముకుల్ తన కానిస్టేబుల్ చేత ఓ టీషర్ట్ తెప్పిస్తాడు. అది.. రిషి సర్ ఫంక్షన్ వచ్చేటప్పుడు వేసుకున్నదేనని చక్రపాణి చెబుతాడు. డెడ్ బాడీ దగ్గర దొరికిందని ముకుల్ అంటాడు. అయితే.. అలాంటి టీషర్ట్స్ వేరే వాళ్లకి కూడా ఉండొచ్చు కదా అని వసుధార అంటుంది.. అయితే.. రిషి సర్ కి ఏమీ కాకూడదని తనకి కూడా ఉందని.. జస్ట్ వచ్చి చూడమని ముకుల్ అంటాడు. వీళ్లంతా ఒప్పుకోకపోవడంతో.. అనుపమ సర్ది చెప్పి.. మహేంద్రను మాత్రం పంపిస్తుంది. వసుధార నువ్వు ఇక్కడే ఉండు అని చెబుతుంది.
మరోవైపు ఫనీంద్ర.. ఇంట్లో కూర్చొని మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటాడు. రిషి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందో లేదో అని మనసులో అనుకుంటాడు. ఈ లోగా దేవయాణి వచ్చి పక్కన కూర్చుంటుంది. ధరణి వచ్చి కాఫీ ఇస్తుంది. మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఫణీంద్ర అంటే... ఇప్పుడు కాకపోతే కాసేపు ఆగి లిఫ్ట్ చేస్తాడులే దానికి ఎందుకు అంత కంగారు అని దేవయాణి అంటుంది.
దీంతో.. ఫణీంద్ర తిడతాడు.. నీకు అసలు రిషి కనిపించడం లేదని కంగారు ఉందా..? హాయిగా తింటున్నావ్.. పడుకుంటున్నావ్ అని సీరియస్ అవుతాడు. దీంతో.. తన నటన మొత్తం బయటపెడుతుంది. శైలేంద్ర కంటే ఎక్కువ ప్రేమగా నేను రిషి పెంచాను అని భారీ డైలాగులు కొడుతుంది.
తర్వాత.. ఫణీంద్ర.. అనుపమకు ఫోన్ చేస్తాడు. అనుపమ లిఫ్ట్ చేస్తుంది. రిషి గురించి ఏమైనా తెలిసిందా అంటే.. రిషి గురించి తెలుసుకోవడానికి మహేంద్ర హాస్పిటల్ కి వెళ్లాడని చెబుతుంది. ఆ మాట విని ఫణీంద్ర కంగారుపడతాడు. దీంతో.. డెడ్ బాడీ ఐడెంటిఫికేుషన్ కి వెళ్లాడని.. జరిగిందని చెబుతుంది. మహేంద్ర తోడుగా ఎవరు వెళ్లారు.. అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే అని ఫణీంద్ర అడుగుతాడు.
కానీ అనుపమ.. రిషికి ఏమీ కాదని, ఆ టీషర్ట్ ఎలా వచ్చిందో తమకు తెలీదని.. అందుకే తామంతా వెళ్లలేదని చెబుతుంది. కానీ.. ఆ మాటలకు ఫణీంద్ర కుప్పకూలిపోతాడు. ధరణి వాటర్ తెచ్చి ఇస్తుంది. ఏమైందని దేవయాణి అడిగితే.. డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కోసం మహేంద్ర హాస్పిటల్ కి వెళ్లాడు అని చెబుతాడు. ఆ మాటలకు శైలేంద్ర, దేవయాణి సంబరపడతే.. ధరణి మాత్రం బయపడుతుంది.
కానీ శైలేంద్ర బయటకు మాత్రం.. రిషికి ఏమీ కాదని.. తన తమ్ముడు రిషికి ఏమీ కాదు అని.. ఫణీంద్రకు ధైర్యం చెబుతాడు. ఆనవాలు లేకుండా.. ముకుల్ వచ్చి బాబాయ్ ని ఎలా తీసుకువెళతాడు అని శైలేంద్ర అడుగుతాడు.. అయితే.. ఆనవాలు దొరికిందని ఫణీంద్ర అంటాడు. రిషికి ఏమీ కాకూడదని ధరణి మనసులో అనుకుంటూ ఉంటే.. అది రిషి బాడీ అవ్వాలని శైలేంద్ర దేవుడిని కోరుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.