GuppedanthaManasu 19th January Episode:రిషి గురించి తెలుసుకున్న రాజీవ్.. ఇంటికొచ్చి వసుతో సెల్ఫీ

First Published Jan 19, 2024, 8:11 AM IST

రిషి ప్రస్తుత పరిస్థితి గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఇప్పుడు రిషి గాయపడిన సింహం అని.. అతనిని అంతమొందించడమే తన లక్ష్యం అని మనసులో అనుకుంటాడు.

Guppedantha Manasu

GuppedanthaManasu 19th January Episode: వసు ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా హెల్ప్ కావాల అని మహేంద్ర, అనుపమ అడుగుతారు. కానీ, వసు.. అది తాను మాత్రమే చేయాల్సిన పని అని చెబుతుంది. ఆ తర్వాత..గతంలో తాను, రిషి కలిసి ఎలా పని చేసేవాళ్లో.. నిద్ర వస్తే కాఫీ షేర్ చేసుకునేవాళ్లం అంటూ ఆనందంగా పంచుకుంటుంది.  వసు ముఖంలో ఆనందం చూసి.. అనుపమ అసలు మీ పరిచయం ఎలా జరిగింది అని అడుగుతుంది.  తాను స్టూడెంట్ గా కాలేజీకి వచ్చానని.. మొదట డీబీఎస్టీ కాలేజీలో తనకు సీటు ఇవ్వనని చెప్పిన రిషి సర్.. తర్వాత తన మనసులో నాకు చోటు ఇచ్చారు అని సంబరంగా చెబుతుంది. రిషి గురించి చాలా గొప్పగా చెబుతుంది.

Guppedantha Manasu

దీంతో, మహేంద్ర మురిసిపోయి తన కొడుకు అందరికంటే భిన్నం అని.. అలాంటి వ్యక్తి జీవితంలోకి రావాలంటే అదృష్టం ఉండాలని.. అది నీ అదృష్టం అని వసుధారతో అంటాడు. వెంటనే అనుపమ.. వసు దొరకడం కూడా రిషి అదృష్టమే అని చెబుతుంది. తాను వీళ్లద్దరిని చాలా కొద్దిరోజులు మాత్రమే దగ్గరుండి చూసినా.. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో గమనించానని చెబుతుంది. సరిగ్గా అదే సమయానికి వసు బావ రాజీవ్ ఎంట్రీ ఇస్తాడు. సీక్రెట్ గా వీరు మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటాడు

Latest Videos


Guppedantha Manasu

రాజీవ్ ని గమనించకుండా.. వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అనుపమ ఫ్లోలో.. రిషి తప్పిపోయిన విషయం, తర్వాత వసు కాపాడుకున్న సంగతి, ప్రస్తుతం... రిషి ఆరోగ్యం సరిగాలేదని.. ఇలా అన్ని విషయాలు మాట్లాడేస్తుంది. అదంతా రాజీవ్ వినేస్తాడు. రిషి ప్రస్తుత పరిస్థితి గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఇప్పుడు రిషి గాయపడిన సింహం అని.. అతనిని అంతమొందించడమే తన లక్ష్యం అని మనసులో అనుకుంటాడు.

Guppedantha Manasu

ఆ తర్వాత దూరం నుంచి వసుని చూస్తూ ఉంటాడు. నా డార్లింగ్ వసు.. నిన్ను చూసి ఎంతకాలం అయ్యింది.. అదే అందం.. అదే వచ్చస్సు అని దూరం నుంచే కామిస్తాడు. తర్వాత వసుని పూర్తిగా తనివితీరా చూడాలని అనుకుంటాడు.  దాని కోసం బయట నుంచి ఓ కర్ర కింద పడేలా చేసి.. వసు బయటకు వచ్చేలా చేస్తాడు. బయటకు వచ్చిన వసుధారకు ఎవరూ కనిపించరు. వెళ్లిపోదాం అనుకునేలోగా రాజీవ్.. వసుతో ఓ సెల్ఫీ కూడా దిగుతాడు. ఆ శబ్దం.. వసుధారకు వినపడుతుంది. వెంటనే వెళ్లి చెక్ చేస్తుంది. కానీ.. అప్పటికే రాజీవ్ కనపడకుండా దాక్కుంటాడు. దీంతో.. ఎవరూ కనపడలేదని.. వసు లోపలికి వెళ్లిపోతుంది.

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. మరుసటి రోజు భద్రను దేవయాణి తన ఇంటికి రమ్మని చెబుతుంది. ఆమె చెప్పినట్లే భద్ర అక్కడకు వెళతాడు. ఏంటి మేడమ్ రమ్మన్నారు అని భద్ర అడుగుతాడు. నువ్వు ఇక్కడకువస్తున్నట్లు.. చెప్పి వచ్చావా..? చెప్పకుండా వచ్చావా అని దేవయాణి అడుగుతుంది. అయితే.. చెప్పకుండానే వచ్చాను అని భద్ర అంటాడు. వెంటనే.. నోట్ల కట్టలు తీసి ఇస్తుంది. ఎందుకు మేడమ్ ఈ డబ్బులు అని శైలేంద్ర  అడిగితే.. నీ కోసమే ఖర్చులకు వాడుకో అని అంటుంది. దానికి భద్ర.. నాకు ఖర్చులు ఏమీ ఉండవు మేడమ్ అంటాడు. మహేంద్ర సర్ వాళ్లు మూడు పూటలా భోజనం పెడుతున్నారని, కొత్త దుస్తులు కొనిపెడుతున్నారని, వద్దు అన్నా.. జీతం ఇస్తున్నారని.. ఇంక తనకు ఏమి ఖర్చులు ఉంటాయి అని  అంటాడు.

డబ్బు ఇస్తుంటే వద్దు అనే వాడిని నిన్నే చూస్తున్నాను అని దేవయాణి అంటుంది. రూ.2వేలు ఇచ్చినా కళ్లకు అద్దుకొని తీసుకునేవాళ్లు ఉన్నారు.. నువ్వు ఇంత డబ్బు ఇస్తున్నా.. నీకు వద్దు అంటున్నావ్ అని.. ఈ సారికి ఖర్చులకు తీసుకో అని అంటుంది. భద్ర మాత్రం తనకు ఆ డబ్బులు వద్దు అని చెబుతాడు. మరి.. డబ్బులు కూడా వద్దు అంటున్నావ్.. ఈ పనులు ఎందుకు చేస్తున్నావ్ అని దేవయాణి అడుగుతుంది. తాను.. డబ్బు కోసం కాదని, సరదా కోసం చేస్తున్నాను అని చెబుతాడు. అయితే.. మనసులో దేవయాణి.. వీడు వెరైటీగా ఉన్నాడు అని అనుకుంటాడు.

Guppedantha Manasu

తర్వాత.. దేవయాణి.. తనకు ఓ పని చేసి పెట్టమని అడుగుతుంది. అయితే.. రూ.వంద ఇవ్వమని అంటాడు.  మొదట షాకైనా తర్వాత ఆ వంద రూపాయలు ఇస్తుంది.  ఇచ్చిన తర్వాత.. ఏం పని చేయాలి మేడమ్ అని అడుగుతాడు. దానికి దేవయాణి.. అనుపమ, మహేంద్ర రిషి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. అయితే.. రిషి కనిపించడం లేదని.. బాధపడుతున్నారని భద్ర చెబుతాడు. తర్వాత.. వసుధార మళ్లీ వాళ్ల నాన్నగారి ఇంటికి  వెళ్లిందా అని అడుుతుంది. లేదని.. ఇక్కడే ఉంది అని చెబుతాడు. తర్వాత.. వాళ్ల ఇంట్లో ఏం జరిగినా.. నాకు అన్నీ చెప్పాలి అని  దేవయాణి భద్రకు చెబుతుంది. 

దానికి భద్ర.. మీరు మీరు బంధువులే కదా ఫోన్ చేస్తే వాళ్లే చెబుతారు కదా అని  అడుగుతాడు. అది జరగదనే కదా నీకు చెప్పింది అని అంటుంది. భద్ర సరే అంటాడు. వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే.. ధరని వస్తుంది. ధరణి రావడం చూసి.. భద్రను దేవయాణి పంపించేస్తుంది.  ధరణి .. భద్ర ఫేస్ చూడదు. వెనక నుంచి చూస్తుంది. కాబట్టి గుర్తుపట్టదు. వచ్చి... దేవయాణిని ఎవరు అంటే.. సేల్స్ మెన్ అని చెప్పి తప్పించుకుంటుంది.

Guppedantha Manasu


మరోవైపు.. వసు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. మహేంద్ర వచ్చి.. రిషి గురించి ఆరా తీస్తాడు. కొద్దిరోజులు ఓపిక పడితేనే కోలుకుంటాడు అని వసు చెబుతుంది. ఆ మాటలకు.. ఇంకా ఎన్ని రోజులు అని, రిషికి  ఇంకా ఎంత కాలం దూరంగా ఉండాలి అని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలను భద్ర దూరం నుంచి మొత్తం వినేస్తాడు. వసు.. రిషికి ప్రమాదంగా ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలి అని మహేంద్రతో చెబుతుంది. కానీ.. అవన్నీ.. భద్ర కూడా వినేస్తాడు.

అనుపమ కూడా.. వసు చెప్పిందే కరెక్ట్ అని, అర్థం చేసుకోమని చెబుతుంది. కానీ.. మహేంద్ర మాత్రం వినిపించుకోడు. తన కొడుకు ని తనతో మాట్లాడనివ్వకుండా చేస్తున్నారని.. బాధపడతాడు. కానీ.. మహేంద్ర తాను ఓపిక పట్టలేనని, తాను తన కొడుకును చూడాల్సిందే అని పట్టుపడతాడు. రిషిని కలవడానికి వెళదాం అని పట్టుపడతాడు. వసుధార పరిస్థితి అర్థం చేసుకోమని ఎంత చెప్పినా.. మహేంద్ర వినిపించుకోడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!