పక్కనే ఉన్న స్వామిజీ మరోసారి మంత్రం చెప్పమని అంటాడు. అలా చెప్పలేమని, ఒకరికి ఒక్కసారి మాత్రమే చెప్పగలం అని ఫణీంద్ర చెబుతాడు. దీంతో.. పంచమి, మోక్షను పట్టుకొని బాగా ఏడుస్తుంది. ఇక ఇప్పుడు మనం నాగలోకానికి వెళ్లలేం అని.. ప్రత్యామ్నాయం చూద్దాం అని ఫణీంద్ర అంటాడు. స్వామిజీ తన వద్ద ఉన్న మూలికలను మోక్ష నోటిలో పెట్టి.. తనకు తెలిసిన వైద్యం చేస్తూ ఉంటాడు. ఇక.. ఫణీంద్ర కూడా పాములా మారి.. సాధ్యమైనంత వరకు విషయాన్ని బయటకు తీస్తూ ఉంటాడు.
మరోవైపు మోక్ష ఇంటికి వచ్చే వరకు భోజనం చేయనని వైదేహి పట్టుపడుతుంది. ఇంట్లో వాళ్లంతా మోక్ష వచ్చేస్తాడని ఓదారుస్తుంటే.. చిత్ర, జ్వాల మాత్రం.. మోక్ష ఇంక తిరిగిరాడు అని బాంబు పేలుస్తారు. మోక్షను పంచమి చంపేస్తుందని భయపెడతారు.