Naga Panchami 6th January episode: మోక్షను చంపేందుకు ఫణీంద్ర కుట్ర.. పూర్తి పాములా మారిన పంచమి..!

Published : Jan 06, 2024, 11:54 AM IST

నా గురించి అందరికీ తెలిసిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటే.. మిమ్మల్ని కాపాడుకోలేమో అనే భయం మాత్రమే తనకు ఉందని పంచమి చెబుతుంది.

PREV
17
Naga Panchami 6th January episode: మోక్షను చంపేందుకు ఫణీంద్ర కుట్ర.. పూర్తి పాములా మారిన పంచమి..!
Naga panchami

Naga Panchami 6th January episode: పంచమిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నంచిన వైదేహికి, చిత్ర, జ్వాలలకు మోక్ష షాకిస్తాడు. వాళ్ల ప్లాన్ ని తిప్పి కొడతాడు. పంచమిని తనను మృత్యువు తప్ప మరేదీ దూరం చేయలేదని గట్టిగా చెబుతాడు. మోక్ష మాటలకు వాళ్ల నాన్న, అన్నయ్యలు సపోర్ట్ చేస్తారు. దీంతో.. మోక్ష పంచమిని లోపలికి తీసుకువెళతాడు. 

27
Naga panchami

కానీ, అంతకంటే ముందు వాళ్ల అమ్మ, నానమ్మలకు కోపడినందుకు క్షమాపణలు చెబుతాడు. తర్వాత ఇంట్లో వాళ్లంతా.. మోక్షను మెచ్చుకుంటారు. భర్త అంటే నీలానే  ఉండాలి అని చెబుతారు. అందరూ లోపలికి వెళ్లిపోయిన తర్వాత.. వైదేహి పై చిత్ర, జ్వాలలు సెటైర్లు వేస్తారు. అత్తయ్య ప్లాన్ కి మోక్ష, పంచమిలు కాస్త కూడా బెదరలేదు అనుకుంటారు.

37
Naga panchami

మరోవైపు పంచమి ఆలోచిస్తూ ఉంటుంది. వైదేహి అన్న మాటలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మోక్ష పంచమి దగ్గరకు వస్తాడు. ఇంట్లో వాళ్లు అన్న మాటలకు బాధపడుతున్నావా అని అడుగుతాడు. వాళ్ల మాటలకు తాను బాధపడటం లేదని, వాళ్లు చెప్పింది నిజమే కదా, నేను పామునే కదా అని పంచమి అంటుంది. నా గురించి అందరికీ తెలిసిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటే.. మిమ్మల్ని కాపాడుకోలేమో అనే భయం మాత్రమే తనకు ఉందని పంచమి చెబుతుంది.

47
Naga panchami

తాను ఉన్నంత వరకు నీకు ఏమీ కానివ్వను అని మోక్ష అంటే, నేను లేకుండా మీరు మీ ఇంట్లో ఉండగలరని, కానీ, మీరు లేకుండా ఈ ఇంట్లో తాను ఉండలేను అని చెబుతుంది. దీంతో, మోక్ష.. కలిసి ఉంటే మన ఇద్దరం కలిసే ఉందామని, లేకపోతే.. ఇద్దరూ ఉండొద్దు అంటాడు. పంచమి మాత్రం అలా మాట్లాడొద్దని.. ఎలాగైనా మిమ్మల్ని నేను కాపాడతాను అని, నా కోసం మీరు ఎవరినీ  వదులుకోవద్దు అంటుంది. కానీ మోక్ష వినిపించుకోడు. ఫణీంద్రతో తాను మాట్లాడతాను అని... జరగాల్సిన దాని గురించి ఓ నిర్ణయం తీసుకుందామని చెబుతాడు.

 

అంతేకాదు.. శివయ్య మన ఇద్దరిని ఒకటి చేశాడని.. ఇలా అందరికీ భయపడుతూ ఏం జరుగుతుందా అనుకునే బతుకులు వద్దని, ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అంటాడు. నాకు ప్రాణం పోయగలిగితే అప్పటి వరకు కలిసి బతుకుదాం అని, లేదంటే...వచ్చే జన్మలో మళ్లీ కలిసి బతుకుదాం అని అంటాడు. తర్వాత మోక్ష, పంచమిలు.. మేఘన, ఫణీంద్రలను కలుసుకుంటారు.

57
Naga panchami

పంచమి తనకు అన్ని విషయాలు చెప్పిందని, మీరు చేయాలి అనుకున్నది చేయండి అని ఫణీంద్రతో మోక్ష అంటాడు. అయితే, నాగమణితో మిమ్మల్ని మళ్లీ బతికిస్తాను అని ఫణీంద్ర నమ్మబలుకుతాడు. అయితే.. తనకు ఆ విషయాలతో సంబంధం లేదని, పంచమి ఏం చెబితే అది తాను చేస్తాను అంటాడు.

‘మోక్షను ఒప్పించింది అంటే యువరాణి నాతో నాగలోకానికి వచ్చేసినట్లే నాగదేవత నన్ను మెచ్చుకుంటుంది. మోక్ష ఇష్టరూప నాగజాతికి శత్రువు.. మహారాణి చావుకు కారణమైన వాడిని బతికించాల్సిన అవసరం లేదు.’ అని ఫణీంద్ర మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం కాపాడతాను అంటాడు. ఇదే విషయంపై పంచమి మరోసారి ఫణీంద్ర అడుగుతుంది. తాను తన భర్త ప్రాణాలను పణంగా పెడుతున్నానని, అనుకున్నది జరుగుతుందా అని అడుగుతుంది. దానికి ఫణీంద్ర.. కచ్చితంగా జరుగుతుందని చెబుతాడు. అయితే మోక్ష.. ఈ రోజే జరిగిపోవాలని అంటాడు.

67
Naga panchami

దానికి తగినట్లే ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు. అయితే.. దానికంటే ముందు. పంచమి నాగలోకానికి వచ్చి.. నాగ దేవత అనుమతి తీసుకోవాలని అప్పుడే ఇష్టరూపిణి నాగిని అవుతావని, మోక్షను కాటు వేయగలవని చెబుతాడు. తర్వాతే నాగమణి తేవడానికి వెళ్లాలి అని చెబుతాడు. తర్వాత.. ఈరోజే మనం గడిపే చివరి రోజు అని.. క్షణం ఇక యుగంలా గడుపుదామని పంచమిని మోక్ష తీసుకొని వెళతాడు.

77
Naga panchami

తర్వాత.. నాగ దేవతతో పంచమి అంగీకరించదనే విషయం చెబుతాడు. తనకు నమ్మకం లేకపోయినా.. యువరాజుగా నువ్వు చెబుతున్నావ్ కాబట్టి నమ్ముతున్నాను అంటుంది. నీ మీద నమ్మకంతోనే  యువరాణికి శశ్తులు ఇస్తాను అంటుంది. తర్వాత.. నిజంగానే నాగదేవత పంచమికి ఇష్టరూప నాగిణి గా మారే శక్తి ప్రసాదిస్తుంది. దీంతో.. పంచమి పాముగా మారుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!

Recommended Stories