Guppedantha Manasu 30th March episode:శైలేంద్ర చిచ్చు, మను ని చూసి ఆనందంలో ఎగిరి గంతులు వేస్తున్న వసు

Published : Mar 30, 2024, 07:59 AM IST

ఇక.. శైలేంద్ర రెచ్చిపోతాడు. ఈ కారణం  చూపించి ఆ మనుగాడికి చుక్కలు చూపిస్తానని..  వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాను అని సంబరపడిపోతాడు.

PREV
18
Guppedantha Manasu 30th March episode:శైలేంద్ర చిచ్చు, మను ని చూసి  ఆనందంలో ఎగిరి గంతులు వేస్తున్న వసు
Guppedantha Manasu


Guppedantha Manasu 30th March episode:దేవయాణి తన కొడుకు శైలేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది.  మను, అనుపమ ల మధ్య ఉన్న సమస్యను చాలా ఈజీగా డీకోడ్ చేసేసింది. వసుధార, మహేంద్ర ఆ విషయం తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డారు. కానీ.. దేవయాణి తన  మాస్టర్ మైండ్ తో ఈజీగా కనిపెట్టేసింది. అదే విషయం శైలేంద్రతోనూ చెబుతుంది. అది విని శైలేంద్ర కూడా షాకౌతాడు. మను చిన్న తనంలో తన  తండ్రి ఎవరు అని గట్టిగా అడగలేకపోయి ఉంటాడని.. కానీ పెద్ద అయిన తర్వాత మాత్రం గట్టిగా నిలదీసి ఉంటాడని.. అదే వారిద్దరి మధ్య గొడవకు కారణమై ఉంటుందని చెబుతుంది. మనుకి తన ఫ్రెండ్స్ ముందు.. తండ్రి తెలీదని ఏడిపించి ఉండొచ్చని.. అందుకే తల్లిని కూడా నిలదీసి ఉండొచ్చు అని అంటాడు.

28
Guppedantha Manasu

తాను అనుపమతో మాట్లాడినప్పుడు.. నీ భర్త ఎవరు..? ఏం చేస్తూ ఉంటాడు అని ఒక్క ప్రశ్ననే నాలుగైదు రకాలుగా అడిగి చూసినా కూడా తాను నోరు విప్పలేదని చెబుతుంది. కనీసం నీ కొడుక్కైనా తండ్రి తెలుసా అని అడిగినప్పుడు దానికి కూడా సమాధానం చెప్పలేదు. కానీ ఆ సమయంలో అనుపమ కళ్లలో నీరు, బాధ చూశాను అని దేవయాణి అంటుంది. ఇక.. శైలేంద్ర రెచ్చిపోతాడు. ఈ కారణం  చూపించి ఆ మనుగాడికి చుక్కలు చూపిస్తానని..  వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాను అని సంబరపడిపోతాడు.

38
Guppedantha Manasu


ఇక.. అనుపమను.. ఏంజెల్ తన గదిలో పడుకోపెడుతుంది. తర్వాత సంతోషంగా  ఉన్నావా అత్తయ్య అని అడుగుతుంది. ఎందుకు అని అనుపమ అంటే.. నీ కొడుకు తో కలిసి భోజనం చేశావ్ కదా.. బయటకు నువ్వు ముఖం  చిరాకుగా పెట్టినా, లోలోపల సంతోషంగా ఉండే ఉంటావ్ కదా.. అయినా మా బావతో కలిసి భోజనం చేసినందుకు తాను కూడా సంతోషంగా ఉన్నానని.. అందుకే ఆ మెమరీని ఫోటో తీశాను అని చెబుతుంది. నువ్వు ఆ ఫోటోచూడలేదు కదా నీకు కూడా చూపించనా అని అంటుంది. అనుపమ ఏమీ అవసరం లేదని కొట్టిపారేస్తుంది.

48
Guppedantha Manasu

ఇక.. అప్పుడే వసుధార వచ్చి... మేడమ్ ఒక రిక్వెస్ట్.. మీరు ఒప్పుకుంటాను అంటే అడుగుతాను అని అంటుంది. ఈ మధ్య మీరు నాకు ఇష్టం లేకపోయినా.. మీకు నచ్చినట్లు చేస్తున్నారు కదా అని అంటుంది. అయితే.. వసుధార మాత్రం.. మీరు ఏమనుకున్నా మీకు నిజాలే చెబుతున్నాను అని అంటుంది. తర్వాత.. మనుని కాలేజీకి రమ్మని పిలవమని అడుగుతుంది, అదేంటి.. కాలేజీకి మను రావడం లేదా అని ఏంజెల్ అడిగితే... జరిగిన గొడవ మొత్తం చెబుతుంది.

అందుకే.. మళ్లీ మను ని కాలేజీకి రమ్మని పిలవమని అంటుంది. అయితే.. అనుపమ మాత్రం ఇప్పుడు అంత అవసరం ఏముంది..? కాలేజీ మను లేకుండా మీరు నడపలేరా అంటుంది. అయితే.. వసుధార మాత్రం వదలదు. ఎవరైనా మను ఎందుకు రావడం లేదు అంటే ఏమని సమాధానం చెప్పాలి..? మనమే కదా నింద వేసింది అని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. మీకు నచ్చినట్లు చేసుకోమని అనుపమ అంటుంది. కానీ.. తాను పిలిస్తే మను రాడు అని... అనుపమ గారు పిలిస్తేనే వస్తాడు అని  చెబుతుంది. అనుపమ సైలెంట్ గా ఉండిపోతుంది.

58
Guppedantha Manasu

ఇక.. శైలేంద్ర మను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ మను గాడిని తండ్రి పేరు చెప్పి ఏడిపిద్దాం అంటే.. వాడు కాలేజీకి  రాడు కదా.. వాడు ఉన్న ప్లేస్ కి వెళ్లి రెచ్చగొడితే ఎలా ఉంటుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మను కాలేజీకి వస్తాడు. వీడేంటి.. నాకులాగా సిగ్గు లేకుండా మారిపోయాడా..? అది వాడి క్యారెక్టర్ కాదే.. మరి కాలేజీకి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటాడు.

68
Guppedantha Manasu

అప్పుడే.. మను కారు దిగి వచ్చి శైలేంద్రను గెలుకుతాడు. ఏంటి నేను కాలేజీకి రాను అనుకున్నావా అని ప్రశ్నిస్తాడు. నేను కాలేజీకి రాను అని కాలేజీలో ఆ రాజీవ్ గాడితో కలిసి రచ్చ చేయడం లాంటివి చేస్తే.. పుచ్చలేచి పోతుంది అని వార్నింగ్ ఇస్తాడు. అయితే.. మను వెళ్లిన తర్వాత... నా మనసులో ఉన్నది నువ్వు కనిపెట్టగలవేమో కానీ... నా అసలు ఉద్దేశం నీకు తెలీదులే అనుకుంటాడు.

78
Guppedantha Manasu

ఇక వసుధార మను కాలేజీకి రాలేదని ఎదురుచూస్తూ ఉంటుంది. మనసులో రిషి సర్ తో మాట్లాడుకుంటూ ఉంటుంది. తప్పు చేయకపోయినా మను గారికి శిక్ష పడిందని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్యూన్ వచ్చి... మను గారు వచ్చిన విషయం చెబుతాడు. ఆ మాటకు వసుధార ముఖం వెలిగిపోతుంది. వెంటనే అనుపమకు ఫోన్ చేస్తుంది. థ్యాంక్స్ కూడా చెబుతుంది. థ్యాంక్స్ ఎందుకు అని అనుపమ అంటుంది. మను కాలేజీకి రావడానికి కారణమే మీరు అనే విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా.. ఇన్ డైరెక్ట్ గా చెబుతుంది.  కానీ అనుపమ వదలదు. నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్పావ్ అని అడుగుతుంది. అప్పుడు మను కాలేజీకి వచ్చాడని... దానికి కారణం మీరే అని నాకు తెలుసు అని వసుధార అంటుంది. ఈ విషయం మీకు అర్థమైనా.. కావాలనే గుచ్చి గుచ్చి అడుగుతున్నారని తనకు అర్థమైందని వసుధార అనేసి ఫోన్ పెట్టేస్తుంది.

88
Guppedantha Manasu

తర్వాత.. మను దగ్గరకు ఫైల్ తీసుకొని వెళ్తుంది. మను కాలేజీకి వచ్చినందుకు వసు థ్యాంక్స్ చెబుతుంది.  రావాల్సి వచ్చిందని..కొందరి మాట తాను జవ దాటలేను అని అంటాడు. తల్లిమాట ఎవరూ జవదాటలేరు అని వసుధార అంటుంది.  ఇక.. రిషి సర్ జాడ కనిపెట్టలేకపోయాను అని వసుధార బాధపడితే.. తాను అదే పనిలో ఉన్నాను అని, తనని నమ్మమని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!

Recommended Stories