Brahmamudi
BrahmaMudi 29th March Episode: బాబుకి స్నానం ఎలా చేయించాలో తెలిక రాజ్ తికమకపడుతుంటే.. కావ్య హెల్ప్ చేస్తానంటుంది. ముందు స్నానానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. గార్డెన్ లో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అక్కడికి వెళ్లాక కూడా.. రాజ్ కి స్నానం ఎలా చేయించాలో తెలీదు. అయితే... కావ్య చెబుతూ ఉంటుంది. కానీ.. బాబు ఏడుస్తూ ఉండేసరికి.. తాను చూపిస్తాను అని అంటుంది. అప్పుడు కావ్య తనని తాను తిట్టుకుంటుంది. తనంత తింగరిది ఈ భూ ప్రపంచం మీద ఉండదు అని అంటుంది. ముందు ఆ పిల్లాడి తల్లి ఎవరో చెప్పండి అంటుంది. తర్వాత బాబుకి నలుగు పెట్టి స్నానం చేయిస్తుంది. ఇప్పుడు మీ అమ్మ మన ఇద్దరినీ ఇలా చూస్తే... మనకు తలంటు పోస్తుంది అని కావ్య అంటుంది.
Brahmamudi
సీన్ కట్ చేస్తే.. పిల్లాడి గోలలో పడి రాజ్ ఓ ఆఫీసు పనిని నిర్లక్ష్యం చేస్తాడు. దాని వల్ల కంపెనీకి రూ. కోటి నష్టం వస్తుంది. అదే విషయం ప్రకాశంకి ఆఫీసు నంచి ఫోన్ చేసి చెబుతారు. అయితే.. ప్రకాశం వాళ్లతో మాట్లాడుతుంటే అనామిక, రుద్రాణి వినేస్తారు. ఈ విషయం బయటకు తెలీకుండా చూసుకోవాలని ప్రకాశం అంటాడు. అయితే.. బావగారి వల్ల.. రూ.కోటి నష్టం వచ్చినా కూడా బయటపడకూడదట అని అనామిక అంటుంది. కానీ.. ఈ విషయాన్ని పెద్దది చేసి.. నిప్పు రాజేయడానికి మనం ఉన్నాం కదా.. ఈ విషయాన్ని లోపలికి వెళ్లి.. మీ అత్తకు చెబుదాం అని అనామికతో అంటుంది. అనామిక కూడా సరే అనడంతో వెంటనే వెళ్లి.. ధాన్యలక్ష్మి చెవిలో ఊదేస్తారు. మా ఆయన వల్ల రూ.50లక్షలు నష్టం వస్తే మొగుడు, పెళ్లాలు పెద్ద గొడవ చేశారు కదా... ఇప్పుడు మా అక్క ఏం సమాధానం చెబుతుందో చూస్తాను అంటూ ధాన్యలక్ష్మి ఊగిపోతుంది.
Brahmamudi
ఇక.. ఇదే విషయం సుభాష్ కి కూడా తెలుస్తుంది. వెంటనే ప్రకాశం ని పిలుస్తాడు. అలంకృత డిజైనర్స్ వాళ్లతో డీల్ క్యాన్సిల్ అయ్యిందంట ఎందుకు అని అడుగుతాడు. వాళ్లతో కాకపోతే.. ఇంకొకరితో డీల్ చేసుకోవచ్చులే అన్నయ్య అని ప్రకాశం అంటాడు. అసలు. వీళ్లతో ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అని అడుగుతాడు.. అది నేను ఆఫీసుకు వెళ్లి కనుక్కొని రేపు చెబుతాను అన్నయ్య అని అంటాడు.
Brahmamudi
రేపటిదాకా మీకు గుర్తుండాలి కదండి.. ఈరోజే బావగారికి నిజం చెప్పండి అనుకుంటూ ధాన్యలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. వెనక నుంచి రుద్రాణి, అనామికలు కూడా వస్తారు. ఇక.. ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది. ఎవరి వల్ల నష్టం వచ్చిందో చెప్పండి అని అంటుంది. ప్రకాశం.. ఇవన్నీ నీకు ఎందుకు..నోర్మూసుకో అని చెబుతాడు. కానీ.. ధాన్యలక్ష్మి వినదు. రాజ్ వల్లే..కంపెనీకి రూ.కోటి నష్టం వచ్చింది అని చెబుతుంది. ఆ మాటకు అందరూ షాకౌతారు. కంపెనీ విషయాలు ఆడవాళ్లకు ఎందుకు అని ప్రకాశం అంటే.. మొన్న మా ఆయన రూ.50లక్షలు నష్టం వస్తే.. మా అక్క గొడవ చేసిందిగా.. మా ఆయన పరవు పోయేలా అందరూ నానా మాటలు మాట్లాడారు కదా.. ఈ రోజు రాజ్ చేసిన పనికి ఏమంటారు అని అడుగుతుంది.
Brahmamudi
ఇక.. రాజ్ ఎంట్రీ ఇస్తాడు. ఎన్నిసార్లు పరువు పోయింది పిన్ని అని అడుగుతాడు. అసలు బాబాయ్ పరువు ఎవరు తీశారు అని ప్రశ్నిస్తాడు. మీకు మీరే మీ మనసులను దూరం చేసుకొని.. మమ్మల్ని వేరు చేసి చూస్తున్నారు.. తాను కంపెనీ విషయాలు సరిగా పట్టించుకోలేదని.. ఆ సమయంలో ఆ డీల్ పోయిందని.. మళ్లీ నెలలో అంతకంటే మంచి డీల్ తీసుకురాగలను అని అంటాడు.
Brahmamudi
ఇక... ఆ రోజు ప్రకాశం ని తాను ప్రశ్నించినందుకు తన భర్త వాళ్ల తమ్ముడికి క్షమాపణలు చెప్పాడని అపర్ణ అంటుంది. మళ్లీ పాత కథ ఎందుకు తవ్వుతున్నావ్ అని తిడుతుంది. అయితే..కోటి రూపాయలు నష్టం వచ్చింది కదా అని అనామిక మధ్యలో దూరుతుంది. దీంతో.. అపర్ణరెచ్చిపోతుంది. నీ పుట్టింటి నుంచి తెచ్చావా..? కంపెనీలో నీది, నీ పేరెంట్స్ పార్ట్ నర్ షిప్ ఏమైనా ఉందా..? పిల్ల కావివి నోరుమూసుకొని ఉండు.. ఎక్కువ మాట్లాడితే పనిమినిషి శాంతను మాన్పిస్తాను.. ఆ పనులన్నీ ఇంటి కోడలుగా నువ్వే చేయాల్సి వస్తుంది జాగ్రత్త అని అనామికు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. దెబ్బకు అనామిక నోరు మూస్తుంది.
ఇక రాజ్.. తన వల్లే కంపెనీకి నష్టం వచ్చిందని అంగీకరిస్తాడు. కానీ.. సంవత్సర కాలంగా కంపెనీ బాధ్యతలన్నీ తానే చూసుకుంటున్నాను అని చాలా లాభాలు వచ్చాయని.. ఇప్పుడు లాభం గురించి చెప్పాలా..? నష్టం చెప్పాలా అని సీరియస్ అవుతాడు. ఈ ఇంట్లో అక్కాచెల్లెల్లా ఉండే.. మీరు శత్రువుల్లా మారిపోయారు.. ఇది లాభమా నష్టమా? అన్నదమ్ముల మధ్య కూడా తేడాలు తేవాలని చూస్తున్నారులాభమా, నష్టమా? ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నారు.. లాభమా నష్టమా ? నన్ను తల్లిలా పెంచిన ప్రేమ ఇప్పుడు నీలో లేకపోవడం లాభమా నష్టమా? కళ్యాణ్ కి జ్వరం వస్తే ఇంటిల్లపాది నిద్రపోకుండా కూర్చుంది.. అది లాభమా, నష్టమా అని చాలా ప్రశ్నలు వేస్తాడు. రాజ్ ప్రశ్నలకు అందరి నోళ్లు మూతలు పడతాయి.
అయితే.. అపర్ణ మాత్రం రివర్స్ అవుతుంది. ఇప్పటి వరకు చాలా బాగా మాట్లాడావు అని... కానీ పాలకుండ లాంటి ఈ ఇంట్లో విషపు చుక్క నింపింది నువ్వు కాదా అని ప్రశ్నిస్తుంది.. ఇప్పుడు అందరూ మాట్లాడటానికి కారణం నువ్వు కాదా అని... బిడ్డను తీసుకువచ్చిన విషయాన్ని ఎత్తి చూపిస్తుంది. తల్లి అడిగిన ప్రశ్నలకు మాత్రం రాజ్ సమాధానం చెప్పడు.