Guppedantha Manasu 1st April Episode:మను వీక్ నెస్ పై కొట్టిన శైలేంద్ర, నోరు జారిన మహేంద్ర..!

First Published Apr 1, 2024, 7:53 AM IST

మరి కొందరికి తండ్రి ఉంటే తల్లి ఉండదు... తల్లి ఉంటే తండ్రి ఉండడు. కొందరికైతే అసలుు వాళ్ల తండ్రి ఎవరో కూడా తేలీదు అని అంటాడు. కావాలనే మను ని టార్గెట్  చేయాలని ఇలా మాట్లాడతాడు.

Guppedantha Manasu

Guppedantha Manasu 1st April Episode:  కాలేజీలో బోర్డు మీటింగ్  ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డు మీటింగ్ లో  స్టూడెంట్స్ ఎక్కువ గా కాలేజీకి రావడం లేదని, అటెండెన్స్ పర్సంటేజ్ పడిపోతోందని  బోర్డు మెంబర్స్ చెబుతారు. అయితే.. అటెండెన్స్ పడిపోకుండా ఉండాలంటే.. ఏం చేయాలి అని ఒకరి తర్వాత ఒకరు కొన్ని ఐడియాలు వేస్తారు. కానీ.. ఏవీ వర్కౌట్ కావు అని తేలుస్తారు. తర్వాత.. ఆలోచించిన తర్వాత వసుధార ఒక ఐడియా ఇస్తుంది. స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినట్లు... మనం కూడా అలానే చేద్దాం అని వసుధార చెబుతుంది. చాలా మంది పిల్లలు పేరెంట్స్ కి కాలేజీకి వెళ్తున్నాం అని చెప్పి.. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. వాళ్లను కంట్రోల్ చేయాలంటే పేరెంట్సే బెస్ట్ అని వసు అంటుంది. దానికి అందరూ వావ్ సూపర్ ఐడియా అని అందరూ అంటారు.

Guppedantha Manasu

శైలేంద్ర మాత్రం.. తనకు కావాల్సిన పాయింట్ దొరికింది అని అనుకుంటాడు. వెంటనే వాళ్ల నాన్నని పేరెంట్స్ అంటే.. ఇద్దరూ రావాలా డాడీ అని అడుగుతుంది. అదేం ప్రశ్న.. పేరెంట్స్ అంటే ఇద్దరూ కదా అని ఫణీంద్ర అంటాడు. దానికి శైలేంద్ర... అంటే అందరికీ ఇద్దరరు పేరెంట్స్ ఉండరు కదా.. కొందరికి సింగిల్ పేరెంట్స్ ఉంటారు.. మరి కొందరికి తండ్రి ఉంటే తల్లి ఉండదు... తల్లి ఉంటే తండ్రి ఉండడు. కొందరికైతే అసలుు వాళ్ల తండ్రి ఎవరో కూడా తేలీదు అని అంటాడు. కావాలనే మను ని టార్గెట్  చేయాలని ఇలా మాట్లాడతాడు.

Guppedantha Manasu

ఆ మాటలకు మను బాగా హర్ట్ అవుతాడు. పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ ని గట్టిగా నొక్కేస్తాడు. చేతికి చాలా పెద్ద గాయం అవుతుంది.  అది చూసి మహేంద్ర, వసుధార షాకౌతారు. వెంటనే చేతికి రక్తం పోతుంటే.. మహేంద్ర.. క్లాత్ కడతాడు. మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మీరు మీటింగ్ కంటిన్యూ చేసుకోండి అని చెప్పి వెళతాడు. అతను కావాలనే గ్లాస్ పగలకొట్టాడా అని ఒక బోర్డు మెంబర్ అడుగుతాడు. అయితే.. టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అవుతోందని.. శైలేంద్ర గారు ఎందుకు ఏదేదో మాట్లాడతారు అని.. ఒక మేడమ్ అంటారు.

Guppedantha Manasu


దీంతో.. ఫణీంద్ర కూడా.. శైలేంద్రను తిడతాడు. పేరెంట్స్ లేకపోతే రారు.. అంతేకానీ.. దానికి ఇవన్నీ ఎందుకు.. అసలు బుధ్ధి ఉందా నీకు.. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా అని తిట్టేస్తాడు. తర్వాత.. ఈ పేరెంట్స్-లెక్చరర్స్ మీటింగ్ పెడదాం, అన్ని ఏర్పాట్లు చేయండి అని ఫణీంద్ర చెప్పి.. మీటింగ్ ముగుస్తాడు.

Guppedantha Manasu

ఇక.. మను తన క్యాబిన్ లో కూర్చొని ఉంటాడు. రక్తం కారుతూ ఉంటుంది. శైలేంద్ర అన్న మాటలనే తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడే.. శైలేంద్ర వస్తాడు. ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అనే వంకతో వచ్చి.. గ్లాస్ ఎందుకు బ్రో అంత గట్టిగా నొక్కావ్..? పొరపాటున నొక్కావా లేక.. నేను మాట్లాడే మాటలకు నొక్కావా అని అడుగుతాడు. మను ఏమీ సమాధానం ఇవ్వడు. కానీ శైలేంద్ర మాత్రం ఆపడు. నేను తండ్రి గురించి మాట్లాడినప్పుడే నువ్వు అలా చేశావ్ కదా అని అడుగుతాడు.

Guppedantha Manasu

అంతటితో ఆగడు. మీ అమ్మ అనుపమ గారు అని రీసెంట్ గా తెలిసింది కదా.. అది కూడా అనుకోకుండా బయటపడింది. మీరు ఆవిడ మీ తల్లి అని ఎందుకు చెప్పలేదు..? ఎందుకు దాచారు..? మీ మధ్య దూరం ఎందుకు ఉంది..? మరి అనుపమ మీ తల్లి అయితే.. మీ తండ్రి ఎవరు..? అని అడుగుతాడు. శైలేంద్రకు దేవయాణి, ఫణీంద్ర పేరెంట్స్.  వసుధారకు సుమిత్ర, చక్రపాణిలు పేరెంట్స్.. రిషికి.. మహేంద్ర, జగతి పేరెంట్స్.. అలానే మీ పేరెంట్స్ ఎవరు..?  చాలా కాలం జగతి పిన్ని, రిషి మాట్లాడుకోలేదు... అలానే నీకు, మీ నాన్నకు మాటలు లేవా? అని అడుగుతాడు.  ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను.. మీ నాన్న ఎవరు..? అని అడుగుతాడు.

Guppedantha Manasu

అప్పుడే మహేంద్ర, వసుధార వచ్చి.. శైలేంద్రను తిడతారు. నేను వాళ్ల నాన్న గురించి అడుగుతుంటే నువ్వు వచ్చావ్ ఏంటి బాబాయ్ అని శైలేంద్ర అంటాడు. నువ్వు ఎ:దుకు వచ్చావ్ వసుధార ఫస్ట్ ఎయిడ్ చేయడానికా..? నేను కూడా అందుకే వచ్చాను కానీ చేయించుకోవడం లేదు అని శైలేంద్ర అ ంటాడు.   బలవంతంగా.. మహేంద్ర, వసుధారలు కలిసి.. ఫస్ట్ ఎయిడ్ చేస్తారు.  తర్వాత.. శైలేంద్రను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతారు.

Guppedantha Manasu

కానీ శైలేంద్ర నేను వెళ్లను అని..  జస్ట్ మను వాళ్ల నాన్న ఎవరో తెలుసుకుంటున్నాను అని చెబుతాడు. నీకు ఎందుకు అని మహేంద్ర అంటే.. తెలుసుకుందామని.. నువ్వు చెప్పు మను మీ నాన్న ఎవరు..? నువ్వు చెప్పకపోతే.. అనుపమ గారినే అడుగుతాను అని అంటాడు. ఆ మాటకు మను సీరియస్ గా చూస్తాడు. అయితే.. ఓ మీ అమ్మని అడగొద్దా..? మీరే చెబుతారా చెప్పమని ఫోర్స్ చేస్తాడు. 

Guppedantha Manasu

మను బాధ చూసి.. వసుధార కూడా బాధపడుతూ ఉంటుంది. శైలేంద్ర అలా రెచ్చ గొట్టడంతో.. వాళ్ల నాన్న ఎవరో తెలియకపోవడం మను లోపమే అని మహేంద్ర అంటాడు. మహేంద్ర.. నోరు జారడంతో వసుధార, మను ఇద్దరూ షాకౌతారు. తర్వాత తేరుకొని.. పొరపాటున అనేశాను అని అంటాడు. అయితే.. మను మాత్రం.. మా నాన్న ఎవరో నాకు తెలియకపోవడం నా లోపం కాదు సర్ అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!