BrahmaMudi 26th march Episode:రుద్రాణి ప్లాన్ రివర్స్.. మాడిన కడుపులు, రాజ్ ఆకలి మాత్రం తీర్చిన కావ్య..!

First Published | Mar 26, 2024, 11:23 AM IST

కొడుకు తినలేదని గుర్తుకువచ్చి.. బాధతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. అపర్ణ వెంటే సుభాష్.. అతని వెంట ఇందిరాదేవి వెళ్లిపోతారు.

Brahmamudi

BrahmaMudi 26th march Episode: దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటారు. రాజ్ ఇంకా రాలేదని చూస్తూ ఉంటారు. అప్పుడు రుద్రాణి సెటైర్ వేస్తుంది. ఒకప్పుడు రాజ్ రాజులా వచ్చి కూర్చొని తినేవాడని.. ఇప్పుడు.. అందరి ముందు ముఖం కూడా చూపించలేకపోతున్నాడు అని సెటైర్ వేస్తుంది. దానికి ప్రకాశం సీరియస్ అవుతాడు. నీ కొడుకులా సిగ్గులేకుండా ఉండలేరు కదా అని అంటాడు. అయితే.. తన కొడుకు తప్పు ఒప్పుకున్నాడని.. స్వప్నను పెళ్లి చేసుకున్నాడని..రాజ్ లాగా సీక్రెట్ గా కాపురం చేసి బిడ్డను కనలేదు అని  అంటుంది.

Brahmamudi

అప్పుడే భోజనానికి రాజ్ వస్తాడు. వెంటనే.. రాజ్ కి సిగ్గు ఉంది అన్నావ్ కదా అన్నయ్య  అని అంటుంది. ముందు నుంచి ఆ మాటలకు అపర్ణకు కాలిపోతూ ఉంటుంది. ఇంతలో రాజ్ వచ్చి భోజనానికి కూర్చుంటాడు. రాజ్ అన్నం వడ్డించుకోగానే.. ఈ టైమ్ లో చాలా త్వరగా తినేయాలి  రాజ్..లేకపోతే బాబు లేచి ఏడుస్తాడు. ఆడించడానికి వాళ్ల కన్న తల్లి లేదు కదా.. పెంపుడు తల్లి కావ్య సొంత కొడుకులా ఎత్తుకొని ఆడించలేదు కదా అని అంటుంది.  ఆమాటలకు చిరాకు పుట్టి అపర్ణ భోజనం చేయకుండానే లేచి వెళ్లిపోబోతుంది.

Latest Videos


Brahmamudi

అయితే.. ఆమెను రాజ్ ఆఫుతాడు. తాను ఇక్కడ భోజనం చేయడం అందరికీ నచ్చకపోవచ్చని.. మీరు వెళ్లొద్దని.. తానే వెళతాను అనేసి వెళ్లిపోతాడు. ఇక.. అపర్ణ కూర్చుుంటుంది. ఇప్పుడు వదిన.. రాజ్ తినలేదని.. తాను కూడా తినదేమో అని రుద్రాణి అంటుంది. ఆ మాటకు పౌరుషానికి అపర్ణ తినాలనే అన్నం కలుపుతుంది కానీ..  కొడుకు తినలేదని గుర్తుకువచ్చి.. బాధతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. అపర్ణ వెంటే సుభాష్.. అతని వెంట ఇందిరాదేవి వెళ్లిపోతారు.

Brahmamudi

నాకు మాత్రం ఆకలేస్తోందని ధాన్యలక్ష్మి అంటుంది. మనం తిందాం అని రుద్రాణి అంటుంది. వెంటనే ప్రకాశం.. సిగ్గు ఉందా ఇంట్లో ఎవరూ తినకపోయినా, నీకు ఆకలేస్తుందా అని తిడతాడు. ఆ తిట్లకు ధాన్యంతో పాటు.. రుద్రాణి కూడా భోజనం చేయకుండా లేస్తుంది. నేను నిన్ను అనలేదమ్మానువ్వు తిను అని ప్రకాశం రుద్రాణితో అంటే...నాకు కూడా సిగ్గు ఉంది అన్నయ్య అని అంటుంది. పాపం నీ కొడుక్కి లేదనుకుంట అని రాహుల్ ని ఉద్దేశించి ప్రకాశం అంటాడు. రాహుల్ ని కూడా రుద్రాణి తిననివ్వదు. ఇక.. తప్పక అనామిక కూడా భోజనం చేయదు. ఏదో అనుకుంటే.. రుద్రాణి ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.

Brahmamudi

ఇక.. కావ్య.. రాజ్ కోసం భోజనం తీసుకువెళ్లాలి అనుకుంటుంది. ప్లేట్ లో భోజనం పెడుతుంటే అపర్ణ వచ్చి ఆపుతుంది. మేమంతా చెడ్డవాళ్లమని.. నువ్వు మాత్రం మంచిదానివి అనిపించుకోవాలని చూస్తున్నావా అని తిడుతుంది. అయితే.. అందరూ ఇలా వెలివేస్తే.. నిజం ఎలా బయటకు వస్తుంది అని కావ్య ప్రశ్నిస్తుంది. అందరికంటే ఎక్కువ నష్టం తనకు మాత్రమే జరిగిందని.. మీరంతా కేవలం పరువు కోసమే ఆలోచిస్తున్నారని.. తాను అంతకంటే ఎక్కువ నష్టపోయానని.. నిజం తెలుసుకోవాల్సిందే అని అంటుంది. కనీసం ఇలా అయినా.. నిజం తెలుసుకునే ప్రయత్నం తనని చేయనివ్వమని అడుగుతుంది. ఇంట్లో ఎవరూ నిలదీయకపోతే నిజం  ఎలా బయటకు వస్తుంది అని తిరిగి ప్రశ్నిస్తుంది. దీంతో.. అపర్ణ నోరు మూసుకుంటుంది.

Brahmamudi

కావ్య భోజనం రాజ్ కి తీసుకొని వెళ్తుంది. మొదట రాజ్ తనకు ఆకలిగా లేదని చెబుతాడు. కానీ.. బిడ్డను ఎత్తుకోవడానికైనా ఓపిక ఉండాలిగా తినమని... కావ్య అనడంతో.. రాజ్ తినేస్తాడు. తిన్న తర్వాత.. నిజం చెప్పమని అడుగుతుంది. నిజం నిద్రపోతోందని, అయినా.. అంతకముందే తాను చెప్పాను అని.. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదని రాజ్ అంటాడు. కావ్య మళ్లీ ప్రశ్నించే సరికి.. తనకు నిద్ర వస్తోందని పడుకుంటాడు.

Brahmamudi

ఇక.. భోజనం చేయక కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. అనామిక, ధాన్యలక్ష్మి, రుద్రాణి, రాహుల్ లు తిప్పలు పడుతూ ఉంటారు. అందరూ పడుకున్నారని.. ఇప్పుడు.. తినేద్దాం అని అనామిక అంటుంది. కానీ.. ఉదయం లేచే సరికి అందరికీ తెలిసిపోతుందని.. మన మీదే అనుమానం వస్తుందని రాహల్ అంటాడు. మరి ఏం చేద్దాం అని అనామిక అంటే.. తాను నలుగురికి సరిపోయేలా ఫుడ్ ఆర్డర్ చేశాను అని చెబుతాడు. ఎప్పుడు వస్తుంది అని అనామిక ఆశగా అడుగుతుంది. ఆలోగా.. డెలివరీ బాయ్ వచ్చి.. లొకేషన్ లో ఉన్నాను అని చెబుతాడు.

Brahmamudi

వీళ్లు బయటకు వెళ్లేలోగా.. అక్కడ ప్రకాశం ఉంటాడు. ఆ డెలివరీ బాయ్ ప్రకాశం కి ఫుడ్ ఇస్తాడు.. రాహుల్ సర్ ఆర్డర్ చేశారు అని.. అయితే.. రాహుల్ అనే వారు ఎవరూ లేరని.. ఈ ఇంట్లో సిగ్గులేని వాళ్లుు ఎవరూ లేరు అని.. ఆ ఫుడ్ నువ్వే తినేయ్ అని చెబుతాడు. ఆ మాటకు అనామిక, రాహుల్ తల బాదుకుంటారు. మరి.. వీళ్లకు భోజనం దొరికుతుందో లేదో.. రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

click me!