మేం రోడ్డున పడితే.. నువ్వేమీ అవుతావ్..? అమెరికాలో ఉంటావా..? నువ్వు కూడా రోడ్డునే పడతావ్ అని రాహుల్ అంటాడు. అయితే.. స్వప్న తనకు మాత్రం అలాంటి పరిస్థితి రాదు అని.. తాతయ్య గారు తనకు తరిగిపోని ఆస్తి ఇఛ్చారని, తాను తన కొడుకు కూర్చొని తిన్నా కరిగిపోదు అని చెబుతుంది. తనకు వచ్చిన కష్టం ఏమీ లేదు అని చెబుతుంది. ఇక..వెళ్లే ముందు... మీరు ఏం చేసుకుంటారో నాకు అనవసరం కానీ.. మా చెల్లి కావ్య జీవితాన్ని నాశనం చేస్తాను అంటే మాత్రం అస్సలు ఊరుకోను అని మాస్ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. స్వప్న ఇచ్చిన వార్నింగ్ కి రుద్రాణి, రాహుల్ లు షాకౌతారు.