ఇక.. అనుపమ వెళ్లిన తర్వాత.. వసుధారతో మహేంద్ర మాట్లాడతాడు. మనం కష్టాల్లో ఉన్న సమయంలో ఈ మను వచ్చాడని.. కాలేజీని దక్కించుకోవడానికి శైలేంద్ర చేస్తున్న కుట్రలను అడ్డుకొని, కాలేజీని కాపాడాడని.. ఇప్పుడు కాలేజీలోనే ఉంటున్నాడని అంటాడు. నీకు కూడా ప్రతి విషయంలోనూ అండగా ఉంటున్నాడని, రిషి వస్తాడనే నమ్మకం కూడా కలిగించాడు అని అంటాడు. రాజీవ్ నుంచి కూడా చాలా సార్లు మను కాపాడాడు అని వసుధార చెబుతుంది. మను ని చూసి రాజీవ్ భయపడుతున్నాడని, తన జోలికి రావడం లేదని వసుధార చెబుతుంది. అందుకే.. ఇంత చేసిన మనుకి మనం ఏదో ఒకటి చేయాలని, మను బర్త్ డే గ్రాండ్ గా చేయాలి అని అంటాడు. సరే అని.. కాలేజీకి టైమ్ అవుతుంది వెళతాను అని వసుధార చెబుతుంది.