Guppedantha Manasu
Guppedantha Manasu 14th February Episode:వసుధార, మహేంద్ర, అనుపమ లు కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతారు. అప్పుడు మహేంద్ర.. డబ్బులు దొరికియామ్మా అని అడుగుతాడు. దానికి వసు లేదు మామయ్య అని బదులిస్తుంది. అందుకే.. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అన్నాను అని మహేంద్ర అంటాడు. అయితే.. దానికి వసు.. రిషి సర్ నిజంగా ఆ డబ్బులు తీసుకున్నారని మీరు నమ్ముతున్నారా మామయ్య అని అడుగుతుంది. లేదు.. అని మహేంద్ర అంటాడు. అందుకే... ఆ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తాను అని వసు అంటుంది. నువ్వు వాళ్లని ఏమీ చేయలేవని, వాళ్ల దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని మహేంద్ర అంటే... వాళ్ల దగ్గర సాక్ష్యాలు ఉన్నా కూడా మనల్ని ఏమీ చేయలేరు మామయ్య అంటాడు. అంత మొండి ధైర్యం ఏంటమ్మా అని మహేంద్ర అడిగితే.. వసు తన చేతికి ఉన్న బ్రేస్ లెట్ ని చూపిస్తుంది. ఇది ఇప్పుడు తనచేతికి ఉందని.. అంటే రిషి సర్ తనతోనే ఉందని అర్థమని, సర్ పరోక్షంగా ఈ సమస్య నుంచి మనల్ని బయటపడేస్తారని, కాలేజీని కాపాడుకుంటారని చెబుతుంది.
Guppedantha Manasu
రిషి సర్ మళ్లీ ఎండీ సీటులో దర్జాగా కూర్చోవాలి అనేది జగతి మేడమ్ కోరిక అని.. తన కోరిక కూడా అదేనని వసుధార అంటుంది. సర్ వచ్చిన క్షణమే కాలేజీని ఆయన చేతిలో పెడతాను అని.. జరిగేది అదే అని చెప్పి.. కాలేజీకి వెళ్దాం పదండి అని తీసుకొని వెళ్తుంది. అయితే వసు మొండి ధైర్యం చూసి మహేంద్ర బాధపడతాడు. నువ్వు కాలేజీ నుంచి దూరం అవ్వడం చూడటం తనకు కూడా ఇష్టం లేదని, కానీ ఆ శైలేంద్ర నీకు కూడా ఏదైనా ప్రమాదం తలపడెతాడేమో అనే తన దిగులంతా అని మనసులో అనుకుంటాడు. తర్వాత.. వసు వెంట వీళ్లు కూడా కాలేజీకి బయలుదేరతారు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే.. శైలేంద్ర కూడా కాలేజీకి రెడీ అవుతాడు. మంచిగా రెడీ అయ్యి తన తల్లి దగ్గరకు వస్తాడు. వచ్చీ రాగానే.. ఎలా ఉన్నాను అని అని అడుగుతాడు. నీకేంటి రా రాజకుమారుడిలా ఉన్నావ్ అని, పట్టాభిషేకానికి ముందు ముఖం వెలిగిపోతోందని తెగ పొగిడేస్తుంది. ఎండీ సీటు నీకు రావడం ఖాయం అని చెబుతుంది. ఆనందంగా శైలేంద్ర ఆశీర్వాదం తీసుకుంటాడు. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అని ఆశీర్వదించి.. తర్వాత.. జరుగుతాయి అంటావా అని సందేహం వ్యక్తం చేస్తుంది.
అయితే జరుగుతుందని.. ప్లాన్ మొత్తం చెబుతాను అని శైలేంద్ర అంటాడు. వసుధార, బాబాయ్ వాళ్లు డబ్బులు కట్టేలేక కాలేజీ నా వాళ్లకు రాసివ్వాలి. వాళ్లంతా నా బినామీలు అనే విషయం ఎవరికీ తెలీదు. ఒక్కసారి నా వాళ్ల దగ్గరకు కాలేజీ వచ్చాక అది నా చేతికి వచ్చినట్లే కదా.. ఎలా తిప్పాను మమ్మీ చక్రం. అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఎండీ సీటు నా కాళ్ల దగ్గరకు వస్తుంది అని శైలేంద్ర అంటాడు. అవును అని దేవయాణి కూడా సంబరపడుతుంది.
Guppedantha Manasu
ఇక, ఎండీ సీటు మనకు రాదు అని ఆ ధరణి ఏవేవో మాట్లాడింది కదా.. దానికి కూడా చెబుదాం అని ధరణిని పిలుస్తాడు. రాగానే ధరణి ఏంటండి అని అంటుంది. కాలేజీ మాకు దక్కదు అని ఛాలెంజ్ లు చేశావ్ కదా, మాకు మంచి గడియాలు మొదలయ్యాయి అని చెబుతాడు. అయితే.. మీరు అనుకున్నట్లు జరగదని.. సాయంత్రానికి నీరసంగా ఇంటికి వస్తారని, మీ ప్లాన్ మాత్రం పక్కాగా ఫెయిల్ అవుతుందని ధరణి చెబుతుంది. కల కంటుున్నావా అని శైలేంద్ర అంటే... ఆ పని తనది కాదని అంటుంది. ఎవరి మాట నెగ్గుతుందో చూద్దాం అని అంటాడు. తనకు మంచి జరగాలని కోరుకుంటూ ఎదురు రమ్మని అడుగుతాడు. మంచో, చెడో తాను అనుకున్నదే జరుగుతుందని చెప్పి.. ధరణి ఎదురొస్తుంది.
Guppedantha Manasu
శైలేంద్ర వెళ్లిన తర్వాత.. ధరణితో దేవయాణి.. ఇంత పిచ్చి పిల్లవేంటి నువ్వు అని అంటుంది. నువ్వు ఎంత అనుకున్నంత మాత్రాన.. చేతిలోకి వచ్చిన పావురం పారిపోతుందా ఏంటి అని అనిదేవయాణి అంటుంది. దానికి ధరణి.. ఎగరొచ్చు.. ఎగరకపోవచ్చు.. కానీ అవకాశం అయితే ఉంది కదా.. వెయిట్ చేద్దాం మీకే తెలుస్తుంది కదా అత్తయ్యగారు అని చెప్పేసి లోపలికి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
ఇక.. కాలేజీలో స్టూడెంట్స్ ని మళ్లీ శైలేంద్ర రెచ్చ గొడుతూ ఉంటాడు. వసుధారను గట్టిగా అడగమని లేకపోతే.. కాలేజీ వేరే వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుందని వాళ్లకు బాగా ఎక్కిస్తాడు. మీరు వసుని అడగకపోతే..కాలేజీ వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.. అప్పుడు కాలేజీ నాశనం అయిపోతుంది.. కాలేజీ యాజమాన్యం ఎలా ఉంటుందో... అసలు వాళ్లు కాలేజీని కళ్యాణ మండపం చేస్తారేమో.. మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుందని.. వసు మేడమ్ ని అడగండి అని చెబుతాడు.
Guppedantha Manasu
అప్పుడే వసుధార రావడంతో స్టూడెంట్స్ అందరూ క్యూ కడతారు. కాలేజీని వేరే వాళ్లు హ్యాండవర్ చేసుకున్నారా అని స్టూడెంట్స్ అడుగుతారు. ఎవరు చెప్పారు అని శైలేంద్ర వైపు చూస్తుంది. స్టూడెంట్స్ మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అదంతా అబద్ధం అని, కాలేజీకీ, మీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత తనదని వసు చెబుతుంది. ఇవన్నీ తలకు ఎక్కించుకొని మీ చదువు పాడు చేసుకోవద్దు అని వసు చెబుతుంది. కాలేజీ వేరే వాళ్లకు వెళ్లిపోతే మా పరిస్థితి ఏంటి అని స్టూడెంట్స్ అడిగితే.. అలాంటి పరిస్థితి తాను రానివ్వను అని చెప్పి.. స్టూడెంట్స్ ని లోపలికి పంపేస్తుంది.
Guppedantha Manasu
స్టూడెంట్స్ ని మానేజ్ చేసినంత ఈజీగా సిట్యువేషన్ హ్యాండిల్ చేయలేవు అని శైలేంద్ర అంటాడు. అయితే.. ఏ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తనకు బాగా తెలుసు అని వసు అంటుంది. ఇది నీకు కాలేజీకి చివరి రోజు కావచ్చు అని శైలేంద్ర అంటాడు. నాకు చివరి రోజు అవుతుందో.. నీకు చివరి రోజు అవుతుందో చూద్దాం.. అయినా వచ్చిన వాళ్ల వెనక నువ్వే ఉన్నావ్ అనుకుంట అని వసు అంటే.. అయ్యో.. నాకు ఏమీ తెలీదు అని శైలేంద్ర అమాయకంగా మాట్లాడతాడు. తర్వాత శైలేంద్ర వెళ్లిన తర్వాత.. కాలేజీని ఎలాగైనా దక్కించుకోవాలి అని మనసులోనే భయపడుతుంది.
Guppedantha Manasu
ఇక కాలేజీలో మీటింగ్ మొదలౌతుంది. నీకు ఇదే చివరి బోర్డు మీటింగ్ అని, నీ కోసం మీ బావ బయట వెయిట్ చేస్తున్నాడని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. రాజీవ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజుతో వసు దిక్కులేని దానిలా మిగిలిపోతుందని.. తనకు ఇక తానే దిక్కు అవుతాను అని రాజీవ్ సంబరపడిపోతూ ఉంటాడు. అప్పుడే మినిస్టర్ ఎంట్రీ ఇస్తాడు. మినిస్టర్ వస్తున్న విషయాన్ని రాజీవ్.. శైలేంద్రకు ఫోన్ చేసి చెబుతాడు. మినిస్టర్ వచ్చినా ఏమీ చెయ్యలేడని శైలేంద్ర నమ్మకంగా ఉంటాడు.
Guppedantha Manasu
కాలేజీ వదులుకోక తప్పదని మహేంద్ర అంటాడు. అయితే.. వసు మాత్రం తాను కాలేజీ వదలను అని చెబుతుంది. ఇంకా కొన్ని నిమిషాల్లో ఏం చేయగలవు అని మహేంద్ర అంటాడు. మన దగ్గర డబ్బు కూడా లేదని.. ఏం చేస్తావ్ అని అడుగుతాడు. వాళ్లమో.. ఏం డిసైడ్ అయ్యారు..? డబ్బులు ఇస్తారా? కాలేజీ వదిలేస్తారా అని అడుగుతారు. తమ దగ్గర డబ్బు లేదని.. కాలేజీ హ్యాండవర్ చేసుకుంటానంటే మీ ఇష్టం అని మహేంద్ర అంటాడు.
అయితే... వసు అందుకు తాను ఒప్పుకోనని, వాటిని తాను నమ్మడం లేదు అని చెబుతుంది. నమ్మకాలతో పనిలేదని, సాక్ష్యాలు కదా కావాల్సింది అని మహేంద్ర అంటే.. అది దొంగ పేపర్లని వసు అంటుంది. ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్లు.. మేం కోర్టుకు వెళతాం అని బెదిరిస్తారు. కోర్టు అంటే స్టూడెంట్స్ భవిష్యత్తు పాడౌతుందని శైలేంద్ర అంటాడు. అప్పుడే మినిస్టర్ గారు వస్తారు.
Guppedantha Manasu
ఆ డాక్యుమెంట్స్ ని మినిస్టర్ కూడా పరిశీలిస్తాడు. మినిస్టర్ కూడా ఏమీ చెయ్యలేడనే ధీమాలో శైలేంద్ర ఉంటాడు. మినిస్టర్ వచ్చినా పర్లేదు కానీ.. ఆ కొత్త హీరో రాకపోతే చాలు అని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు. మినిస్టర్ కూడా డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని అంటాడు. కానీ.. అవి నిజం కాదని వసు అంటుంది. మినిస్టర్ కూడా.. రిషి అలా చేయడని నమ్మకంగా అంటాడు. దానికి నమ్మకంతో పనిలేదని.. శైలేంద్ర అంటాడు.
ఆ ఫైనాన్స్ వాళ్లను ఏం చేద్దాం అని మినిస్టర్ అడుగుతాడు. వాళ్లు మాకు డబ్బులు ఇవ్వమని,లేకపోతే కాలేజీ రాసివ్వమని అంటాడు. వసు కోర్టుకు వెళతాను అని అంటుంది. అయితే.. కోర్టుకు వెళితే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారని, పరీక్షల వరకు ఆగమని వాళ్లను మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వాళ్లు వినిపించుకోరు. కాలేజీ తమకు ఇచ్చేయమని అంటారు.
Guppedantha Manasu
తమకు కాస్త ముందు చెప్పి ఉంటే బాగుండేదని మినిస్టర్ అంటాడు. డబ్బుల కోసం ప్రయత్నించలేదా అని మహేంద్రను అడుగుతాడు. అయితే.. మహేంద్ర ప్రయత్నించామని.. ఎవరూ ఇవ్వలేదని చెబుతారు. శైలేంద్ర కూడా తాను కూడా ప్రయత్నించాను కానీ ఇవ్వలేదు అని చెబుతాడు. అయితే... మరి కొంత సమయం ఇవ్వమని.. వాళ్లు కాలేజీ వదులుకోలేరని మినిస్టర్ ఫైనాన్స్ కంపెనీ వాళ్లను బతిమిలాడతాడు. కానీ.. వినను గాక వినరు. తాను కూడా ఏమీ చేయలేనని చేతులు ఎత్తేస్తాడు. బోర్డు మెంబర్స్ అందరూ సంతకాలు పెడితే తాము కాలేజీని హ్యాండవర్ చేసుకుంటామని ఫైనాన్స్ కంపెనీ వాళ్లు చెబతారు. ఆ మాటలకు వసు ఎమోషనల్ అవుతుంది. బోర్డు మెంబర్స్ సంతకాలు పెడుతూ ఉంటారు. రిషి సర్ నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది.. ఈ కాలేజీ మన చెయ్యి దాటిపోదని అని వసు మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.